Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Ponguleti Srinivas Reddy: జనం గుండెల్లో నిలిచిన నాయకుడి గాధ

Author
Posted By STAR TRINETHRAM
| 05 Mar 2026, 07:02 PM | Politics
Ponguleti Srinivas Reddy: జనం గుండెల్లో నిలిచిన నాయకుడి గాధ


  • అజాతశత్రువు నుంచి అగ్రనేత వరకూ..

  • కాంగ్రెస్‌కు ఖమ్మం కంచుకోట నిర్మాత..

  • ధరణి అక్రమాలపై ఉక్కుపాదం.. భూభారతి రూపకర్త

  • ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రజాసేవ

  • జర్నలిస్టుల పెద్దన్న.. సేవా మార్గంలో శ్రీనన్న

  • అన్నివర్గాల వారికి ఆపదలో ఆసరా..

  • తెరకెక్కుతున్న బయోపిక్‌తో మరింత ఎత్తుకెళ్లనున్న గుర్తింపు!


Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో పదునైన వ్యక్తిత్వం, ప్రజల నడకలో నడిచే నాయకత్వం, మాటిస్తే నిలబెట్టుకునే ధైర్యం.. ఇవన్నీ ఒకే పేరులో కలిస్తే అది ‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి’. స్వశక్తితో రాష్ట్ర మంత్రివర్యుడి స్థాయికి ఎదిగినా, అధికార అంచులపై నిలబడినా, ప్రజల అంచులకే దగ్గరగా నిలిచిన జన హ‌ృదయ నాయకుడు ఆయన. ఖమ్మం నేలపై తన మాటతో రాజకీయ సమీకరణాలు మార్చగల శక్తి, సేవతో హృదయాలు గెలుచుకున్న సహజ స్వభావం ఆయన సొంతం. ఇచ్చిన మాట తప్పని నైజం, సేవ, కరుణ ఎన్నో లక్షణాల సమన్వయమే శ్రీనన్న బ్రాండ్. అధికారంలో ఉన్నా అహంకారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నా వెనుకడుగు లేకుండా ప్రజల కోసం పోరాడిన ప్రయాణమే ఆయన కథ. ఇప్పుడు ఆ ప్రయాణమే వెండితెరపై ‘శ్రీనన్న అందరివాడు’గా మారబోతుండటం, ఆయనకు ఉన్న ప్రజాభిమానానికి ప్రతీక.

‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి’ తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రజలు ముద్దుగా శ్రీనన్న అని పిలుచుకునే పొంగులేటి జనహృదయ నేత. కాంట్రాక్టర్‌గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇలా అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అనతికాలంలోనే ప్రజలనాడిని పట్టిన పొంగులేటి.. లీడర్ బేస్ రాజకీయం కాదు క్యాడర్ బేస్, ప్రజల బేస్ రాజకీయం చేస్తూ అజాతశత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆపద ఉంది అంటూ తన గడపతొక్కిన వారికి సాయం చేసేందుకు వెనుకాడరు శ్రీనన్న. 2013లో వైసీపీ తరపున రాజకీయ ఆరంగేట్రం చేసిన పొంగులేటి.. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరుపున ఖమ్మం ఎంపీగా గెలిచారు. తాను ఎంపీగా గెలవడమే కాదు ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించి సత్తాచాటారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు పొంగులేటి. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా బీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో తనకు సీటు దక్కకపోయినా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు.

అయితే బీఆర్ఎస్‌లో జరిగిన వెన్నుపోటు రాజకీయాలతో విసిగిపోయి 2023లో ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ (టీ-పీసీసీ) ప్రచార కమిటీ కో-ఛైర్మన్‌గా నియమితులై కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో తనవంతు పాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లో పొంగులేటి చేసిన కామెంట్స్ తెలంగాణ అంతటా ప్రతిధ్వనించాయి. ఖమ్మం నుండి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా గెలవనీయనని శపథం పూని.. దానిని నిలబెట్టుకున్నారు పొంగులేటి. ప్రజలు సైతం శ్రీనన్న వెంటే నిలవడంతో ప్రస్తుతం ఖమ్మంలో బీఆర్ఎస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు.

పొంగులేటి కుటుంబ నేపథ్యం..

1959లో ఖమ్మంలోని కల్లూరు మండలం నారాయణపురంలో రాఘవరెడ్డి, స్వరాజ్యం దంపతులకు జన్మించారు పొంగులేటి. ఆయనకు భార్య మాధురి కుమారుడు (హర్షారెడ్డి), కుమార్తె (సప్ని) ఉన్నారు. 1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామోదయ పథకంలో క్రాస్‌వాల్‌ నిర్మాణం చేపట్టి కాంట్రాక్టర్‌గా మారిన పొంగులేటికి తిరుగులేకుండా పోయింది. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పొంగులేటి కంపెనీలు కాంట్రాక్ట్‌లు చేస్తున్నాయి.

ధరణి అక్రమాలపై ఉక్కుపాదం.. భూభారతి తీసుకొచ్చిన మంత్రి

రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పొంగులేటి. ప్రధానంగా ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపుతూ.. ప్రజలు, రైతులకు మరింత పారదర్శకంగా సేవలు అందించాలనే తపనతో భూభారతి పోర్టల్‌ను తీసుకురావడంలో పొంగులేటి చూపిన చొరవ అనితర సాధ్యం. అలాగే తనకు కేటాయించిన అన్ని శాఖలకు న్యాయం చేస్తూనే మంత్రిగా ఉన్నా.. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగానే కాదు సేవకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అవసరమైన వారికి వైద్య సహాయం, విద్యార్థులకు విద్యా సహాయం, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం వంటి చర్యలతో ప్రజల విశ్వాసాన్ని చురగొన్నారు పొంగులేటి.

పార్టీలోనే కాదు పాలనలోనూ పొంగులేటి మార్క్..

ఇవి కూడా చదవండి

ఇక మంత్రిగా తన పాలనకు నిదర్శనంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తాచాటారు పొంగులేటి. ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ కంచుకోటగా చేయడమే కాదు తాను ఇంఛార్జీగా ఉన్న మున్సిపాలిటీల్లో హస్తం జెండా ఎగరయేడంలో మాస్టర్ మైండ్ పొంగులేటి అని నిరూపించుకున్నారు. మంత్రిగా లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారంటే ఆయన కమిట్‌మెంట్‌ను అర్థం చేసుకోవచ్చు.

సీఎం రేవంత్ తర్వాత నెంబర్ 2 పొంగులేటి..

ప్రజాప్రభుత్వం పాలనలో సీఎం రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ 2 స్థానంలో ఉన్నారు పొంగులేటి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి -డీఎస్‌ కాంబినేషన్‌లో రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రాగా తాజాగా సీఎం రేవంత్ -టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి సారథ్యంలో రెండోసారి కూడా అధికారం కాంగ్రెస్‌దేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జర్నలిస్టుల పెద్దన్న శ్రీనన్న..

గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ ప్రభుత్వాలు చేసిన పొరపాట్లను ప్రజాప్రభుత్వంలో జరగకుండా పెద్దన్నలా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు పొంగులేటి. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరికి న్యాయం చేసే విధంగా ముందుకుసాగుతున్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటు వివిధ సమస్యల పరిష్కారానికి దశల వారిగా ప్రణాళికలు రచిస్తున్నారు.

కులం లేదు.. మతం లేదు.. సాయం అంటూ తన గడపతొక్కిన వారికి కాదు, లేదు అనకుండా సాయం చేయడమే పొంగులేటికి తెలుసు. అందుకే ఆయన అభిమానులే కాదు ప్రజలు సైతం ఆప్యాయంగా "మనసున్న మారాజు" అని పిలుచుకుంటారు. రాజకీయాల్లోకి చాలామంది నేతలు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజల గుండెల్లో గుర్తింపు తెచ్చుకున్న వారే చిరకాలంగా నిలబడతారు. అలాంటి కోవకే చెందిన వ్యక్తి శ్రీనన్న. అందుకే ఆయన జీవిత చరిత్రపై బయోపిక్ వస్తుందంటే పొంగులేటికి ఉన్న గుర్తింపు అర్థం చేసుకోవచ్చు. 'శ్రీనన్న అందరివాడు' పేరుతో తెలుగు, హిందీ, తమిళ్ సహా మొత్తం 6 భాషల్లో సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో మంత్రి పొంగులేటి పాత్రలో సీనియర్ నటుడు సుమన్ నటించనున్నారు.

"ఎన్నికల వరకే రాజకీయం, ఆ తర్వాత ప్రజాసేవ" అనే నినాదంతో పనిచేయడమే పొంగులేటికి తెలుసు. నిత్యం ప్రజల్లో ఉండటం, వారి సమస్యలను నేరుగా వినడం, అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలు చూపించడం పొంగులేటి ప్రత్యేకత. ఆ సేవాగుణమే పొంగులేటిని రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేనినేతగా నిలబెట్టింది.

ALSO READ: CM Revanth Reddy: దేశం కోసమైనా రాహుల్ గాంధీ ప్రధాని కావాలి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: