Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Holi Festival: హోలీ పండుగపై ప్రజల్లో అయోమయం.. క్లారిటీ

Author
Posted By STAR TRINETHRAM
| 02 Mar 2026, 06:15 PM | National
Holi Festival: హోలీ పండుగపై ప్రజల్లో అయోమయం.. క్లారిటీ

Holi Festival: ప్రతి సంవత్సరం తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ పౌర్ణమి రోజున హోలీ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అయితే ఈసారి హోలీ తేదీ విషయంలో ప్రజల్లో అయోమయం నెలకొంది. చంద్రగ్రహణం సంభవించడం, అదే సమయంలో ప్రభుత్వం ప్రకటించిన సెలవు కారణంగా ఏ తేదీన హోలీ జరుపుకోవాలన్న సందిగ్ధత ఏర్పడింది. పండితుల సూచనల ప్రకారం.. గ్రహణం ఉన్న రోజున సూతకం అమల్లో ఉంటుందని, ఆ సమయంలో శుభకార్యాలు నిర్వహించడం శాస్త్రసమ్మతం కాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హోలికా దహనం, రంగుల పండుగ తేదీలపై స్పష్టత అవసరమైంది.

ద్రిక్ పంచాంగం వివరాల ప్రకారం.. హోలికా దహనానికి 2 మార్చి సాయంత్రం 6.22 గంటల నుంచి రాత్రి 8.50 గంటల వరకు శుభ ముహూర్తం ఉన్నట్లు పేర్కొంటున్నారు. 5.55 గంటలకు పౌర్ణమి తిథి ప్రారంభమై 3 మార్చి సాయంత్రం 5.07 గంటలకు ముగుస్తుందని వివరిస్తున్నారు. అయితే 3 మార్చి రోజున చంద్రగ్రహణ ప్రభావం ఉండటంతో హోలికా దహనాన్ని 2 మార్చినే నిర్వహించడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు. గ్రహణ దోషం కారణంగా 3 మార్చి రోజున రంగులు చల్లుకోవడం వంటి వేడుకలు చేయకూడదని, హోలీ ఉత్సవాలను 4 మార్చి జరుపుకోవడమే శ్రేయస్కరమని అభిప్రాయపడుతున్నారు. గ్రహణ సమయాన్ని దైవారాధన, జపధ్యానాలకు కేటాయించడం శాస్త్రోక్తమని చెబుతున్నారు. చంద్రుడు ప్రత్యక్ష దైవంగా భావించబడే గ్రహం కావడంతో గ్రహణ సమయంలో ఆచార నియమాలు పాటించడం అవసరమని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా 3 మార్చినే రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులకు ముందుగానే సెలవు ప్రకటించాయి. పండుగ తేదీపై పండితులు ఇచ్చిన సూచనలు వెలువడినప్పటికీ సెలవు విషయంలో మార్పులు ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో కొందరు 3 మార్చినే హోలీ వేడుకలకు సిద్ధమవుతుండగా, మరికొందరు 4 మార్చి జరుపుకోవాలని భావిస్తున్నారు. ఈ పరిస్థితి ప్రజల్లో మరింత సందిగ్ధతకు దారితీస్తోంది. సంప్రదాయాలు, శాస్త్రోక్త నియమాలు, ప్రభుత్వ నిర్ణయాలు కలిసి ఈసారి హోలీ పండుగను ప్రత్యేక చర్చనీయాంశంగా మార్చాయి.

ALSO READ: TDB: శబరిమల ఆలయంలో మహిళలకు నో ఎంట్రీ

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: