Holi Festival: హోలీ పండుగపై ప్రజల్లో అయోమయం.. క్లారిటీ

Holi Festival: ప్రతి సంవత్సరం తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ పౌర్ణమి రోజున హోలీ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అయితే ఈసారి హోలీ తేదీ విషయంలో ప్రజల్లో అయోమయం నెలకొంది. చంద్రగ్రహణం సంభవించడం, అదే సమయంలో ప్రభుత్వం ప్రకటించిన సెలవు కారణంగా ఏ తేదీన హోలీ జరుపుకోవాలన్న సందిగ్ధత ఏర్పడింది. పండితుల సూచనల ప్రకారం.. గ్రహణం ఉన్న రోజున సూతకం అమల్లో ఉంటుందని, ఆ సమయంలో శుభకార్యాలు నిర్వహించడం శాస్త్రసమ్మతం కాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హోలికా దహనం, రంగుల పండుగ తేదీలపై స్పష్టత అవసరమైంది. ద్రిక్ పంచాంగం వివరాల ప్రకారం.. హోలికా దహనానికి 2 మార్చి సాయంత్రం 6.22 గంటల నుంచి రాత్రి 8.50...