Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న షోయబ్ మాలిక్.. తాజాగా మరో నటితో పెళ్లికి సిద్ధమైనట్లు రూమర్స్?

Author
Posted By STAR TRINETHRAM
| 27 Feb 2026, 01:18 PM | Sports
ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న షోయబ్ మాలిక్.. తాజాగా మరో నటితో పెళ్లికి  సిద్ధమైనట్లు రూమర్స్?

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న షోయబ్ మాలిక్.. తాజాగా మరో నటితో పెళ్లికి సిద్ధమైనట్లు రూమర్స్?

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరోసారి వార్తల్లో నిలిచారు. క్రీడా మైదానంలో తన ఆటతీరుతో గుర్తింపు పొందిన ఆయన.. వ్యక్తిగత జీవిత విషయాల్లోనూ తరచుగా వార్తలో నిలుస్తున్నాడు. తాజాగా నాలుగో వివాహం చేసుకోబోతున్నాడన్న ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తోంది. రెండు సంవత్సరాల క్రితం పాకిస్తానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్న ఆయన, తాజాగా మరో నటి వనీజా సత్తార్‌తో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నాడనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 27న వివాహం జరగనుందనే అనధికారిక కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ, దీనిపై షోయబ్ గానీ, వనీజా గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ పాక్, భారత మాధ్యమాల్లో ఈ అంశం చర్చనీయాంశమైంది.

షోయబ్ గతంలో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను 2010లో హైదరాబాద్‌లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సరిహద్దులను దాటి జరిగిన ఈ ప్రేమ వివాహం ఆ సమయంలో అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. వీరికి ఇజ్హాన్ అనే కుమారుడు జన్మించాడు. అయితే కాలక్రమేణా అభిప్రాయ భేదాలు పెరగడంతో 2024లో విడాకులు ప్రకటించారు. ప్రస్తుతం సానియా తన కుమారుడితో కలిసి దుబాయ్‌లో నివసిస్తూ తన వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

సానియాతో విడాకుల ప్రకటన వెలువడిన కొద్ది వారాలకే షోయబ్, సనా జావేద్‌ను వివాహం చేసుకోవడం మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. లాహోర్‌లో సన్నిహితుల మధ్య జరిగిన ఆ వేడుక చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గత రెండు సంవత్సరాలుగా వీరి దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగుతోందనే భావన ఉన్నప్పటికీ, తాజా ప్రచారం వారి బంధంపై సందేహాలు కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇదే సమయంలో షోయబ్.. నటి లైబా ఖాన్‌తో కూడా జతకట్టారనే వదంతులు వినిపించాయి. అయితే ఆమె ఈ సంవత్సరం మదీనాలో జవాద్‌ను వివాహం చేసుకుని చిత్రాలను పంచుకోవడంతో ఆ ప్రచారం పూర్తిగా తప్పుడు వార్తగా తేలిపోయింది.

షోయబ్ తొలి వివాహం 2000 సంవత్సరంలో అయేషా సిద్ధిఖితో జరిగింది. ఆ వివాహం వివాదాస్పదంగా మారి, కొద్ది కాలంలోనే విడాకులతో ముగిసింది. అప్పట్లో వచ్చిన ఆరోపణలు ఆయన ప్రతిష్టపై ప్రభావం చూపాయి. తరువాత సానియాతో జరిగిన వివాహం, ఆ తర్వాతి పరిణామాలు, ఇప్పుడు వినిపిస్తున్న తాజా ప్రచారం అన్ని కలిపి షోయబ్ వ్యక్తిగత జీవితం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి.

ఇప్పటికే మూడు వివాహాలు, రెండు విడాకులు చర్చకు దారితీయగా, ఇప్పుడు నాలుగో పెళ్లి నిజమా.. కాదా.. అన్న సందేహం అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ వార్తలపై స్పష్టత రానప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం చర్చలు ఆగడం లేదు.

ALSO READ: TVS Orbiter vs Bajaj Chetak C2501: ఈ రెండు స్కూటర్లలో ఏది బెటర్ అంటే?

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: