ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న షోయబ్ మాలిక్.. తాజాగా మరో నటితో పెళ్లికి సిద్ధమైనట్లు రూమర్స్?

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న షోయబ్ మాలిక్.. తాజాగా మరో నటితో పెళ్లికి సిద్ధమైనట్లు రూమర్స్? పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరోసారి వార్తల్లో నిలిచారు. క్రీడా మైదానంలో తన ఆటతీరుతో గుర్తింపు పొందిన ఆయన.. వ్యక్తిగత జీవిత విషయాల్లోనూ తరచుగా వార్తలో నిలుస్తున్నాడు. తాజాగా నాలుగో వివాహం చేసుకోబోతున్నాడన్న ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తోంది. రెండు సంవత్సరాల క్రితం పాకిస్తానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్న ఆయన, తాజాగా మరో నటి వనీజా సత్తార్‌తో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నాడనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 27న వివాహం జరగనుందనే అనధికారిక కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ, దీనిపై షోయబ్ గానీ, వనీజా...