Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Bharata Parapati Sangham: ఘనంగా భారత పరపతి సంఘం 36వ వార్షికోత్సవ వేడుకలు

Author
Posted By STAR TRINETHRAM
| 23 Feb 2026, 05:37 PM | Telangana
Bharata Parapati Sangham: ఘనంగా భారత పరపతి సంఘం 36వ వార్షికోత్సవ వేడుకలు

Bharata Parapati Sangham: వర్ధన్నపేట పట్టణకేంద్రంలో ఆదివారం భారత పరపతి సంఘం 36వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఆ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సభ్యులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహభరిత వాతావరణంలో కార్యక్రమాలను చేపట్టారు. గత 36 సంవత్సరాలుగా సంఘం చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను స్మరించుకుంటూ నాయకులు తమ భావాలను వ్యక్తపరిచారు.

ఈ సందర్భంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించిన బెజ్జం పాపరావును ప్రత్యేకంగా సత్కరించారు. సంఘ సభ్యులంతా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఆయన విజయం సంఘానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని నాయకులు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసంతో సాధించిన ఈ విజయాన్ని మరింత సేవా కార్యక్రమాల రూపంలో కొనసాగించాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

అనంతరం సభ్యులు మిఠాయిలు పంచుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు. సభలో మాట్లాడిన నాయకులు సంఘ ఐక్యతే తమ బలమని, భవిష్యత్తులో కూడా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, యువతకు మార్గదర్శనం వంటి అంశాల్లో సంఘం చురుకుగా వ్యవహరిస్తోందని వివరించారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కీర్తి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు ఎండీ షబ్బీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి సమ్మెట శ్రీనివాస్, సహాయ కార్యదర్శి తోట శ్రీనివాస్, కోశాధికారి కొండా గోపాల్, ముఖ్య సలహాదారులు కొండేటి సత్యం, మైస సురేష్, కార్యవర్గ సభ్యులు చెన్న శ్రీధర్, ముక్కర రాజు, సమ్మెట సుధీర్, దీకొండ యుగేంధర్, రామగిరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. సభ్యుల సమక్షంలో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ALSO READ: Telangana: ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: