Bharata Parapati Sangham: ఘనంగా భారత పరపతి సంఘం 36వ వార్షికోత్సవ వేడుకలు
Bharata Parapati Sangham: వర్ధన్నపేట పట్టణకేంద్రంలో ఆదివారం భారత పరపతి సంఘం 36వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఆ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సభ్యులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహభరిత వాతావరణంలో కార్యక్రమాలను చేపట్టారు. గత 36 సంవత్సరాలుగా సంఘం చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను స్మరించుకుంటూ నాయకులు తమ భావాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించిన బెజ్జం పాపరావును ప్రత్యేకంగా సత్కరించారు. సంఘ సభ్యులంతా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఆయన విజయం సంఘానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని నాయకులు పేర్కొన్నారు. ప్రజల...