Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Andhra Pradesh: ముగిసన బిల్ గేట్స్ పర్యటన

Author
Posted By STAR TRINETHRAM
| 16 Feb 2026, 03:48 PM | Andhra Pradesh
Andhra Pradesh: ముగిసన బిల్ గేట్స్ పర్యటన

Andhra Pradesh: ప్రపంచ సాంకేతిక రంగంలో తనదైన ముద్ర వేసుకున్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లిన బిల్ గేట్స్ మరియు ఆయన బృందం రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ముఖ్యంగా టెక్నాలజీ ఆధారిత పాలనా విధానంలో తీసుకువచ్చిన మార్పులు, ప్రజలకు చేరువైన డిజిటల్ సేవలు, సంజీవని ప్రాజెక్ట్ పురోగతి, అమరావతి నిర్మాణ పనులపై ప్రత్యేకంగా ఆసక్తి కనబరిచారు.

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా చేపడుతున్న చర్యలపై సవివరంగా చర్చించారు. పరిపాలనలో సాంకేతికత వినియోగం ద్వారా పారదర్శకత, వేగవంతమైన సేవలందింపు, ప్రజల భాగస్వామ్యం ఎలా పెరిగిందో అధికారులు వివరించారు. సంజీవని ప్రాజెక్ట్ ద్వారా ఆరోగ్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నాలు, అమరావతి రాజధాని నిర్మాణంలో అవలంబిస్తున్న సాంకేతిక ప్రమాణాలపై కూడా చర్చ సాగింది. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, భవిష్యత్ భాగస్వామ్యాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకున్నారు.

సుమారు 5 గంటలకుపైగా సాగిన ఈ పర్యటనలో బిల్ గేట్స్ వివిధ ప్రదర్శనలను పరిశీలించి అధికారులను ప్రశ్నించారు. అభివృద్ధి ప్రణాళికలపై సమగ్ర అవగాహన పొందిన ఆయన రాష్ట్రం చేపడుతున్న మార్పులను అభినందించినట్లు సమాచారం. అనంతరం విజయవాడలోని పటమట చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియాన్ని సందర్శించిన బిల్ గేట్స్ అక్కడ కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. క్రీడాపట్ల తన ఆసక్తిని చాటుతూ సరదాగా గడిపారు.

ఇవి కూడా చదవండి

పర్యటన ముగిసిన తర్వాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన ప్రత్యేక విమానంలో ముంబై మీదుగా ఢిల్లీకి పయనమయ్యారు. మొత్తం మీద 5 గంటలకు పైగా సాగిన ఈ పర్యటన రాష్ట్రంలో సాంకేతిక, పరిపాలనా రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లు భావిస్తున్నారు.

ALSO READ: T20 World Cup: భారత్-పాక్ పోరుకు డిజిటల్‌లో సంచలన రికార్డు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: