Andhra Pradesh: ముగిసన బిల్ గేట్స్ పర్యటన
Andhra Pradesh: ప్రపంచ సాంకేతిక రంగంలో తనదైన ముద్ర వేసుకున్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లిన బిల్ గేట్స్ మరియు ఆయన బృందం రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ముఖ్యంగా టెక్నాలజీ ఆధారిత పాలనా విధానంలో తీసుకువచ్చిన మార్పులు, ప్రజలకు చేరువైన డిజిటల్ సేవలు, సంజీవని ప్రాజెక్ట్ పురోగతి, అమరావతి నిర్మాణ పనులపై ప్రత్యేకంగా ఆసక్తి కనబరిచారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో...