Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Andhra Pradesh: చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం

Author
Posted By STAR TRINETHRAM
| 15 Feb 2026, 12:03 PM | Andhra Pradesh
Andhra Pradesh: చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజాప్రయోజన నిర్ణయం తీసుకుంటూ చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమైంది. కూటమి ప్రభుత్వ హామీ ప్రకారం అమలు కాబోతున్న ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని చేనేతలు, పవర్ లూమ్స్ కార్యకర్తలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం ఇప్పటికే కసరత్తులు మొదలెట్టింది.

రాష్ట్ర విద్యుత్ శాఖ వివరాల ప్రకారం.. అర్హుల ఎంపిక పూర్తి అయ్యి, వచ్చే ఏప్రిల్ 1 నుండి నిబంధనల ప్రకారం విద్యుత్ సౌకర్యం లబ్ధిదారులకి అందించబడనుంది. ఈ పథకం ద్వారా హ్యాండ్ లూమ్స్ కార్మికులకు నెలకు సుమారు రూ.700 విద్యుత్ ఖర్చులు ఆదా కానున్నాయి. అలాగే పవర్ లూమ్స్ కార్యకర్తలకు నెలకు రూ.1800 వరకు విద్యుత్ ఖర్చులు ఆదా కాబోతున్నాయని ప్రభుత్వం అంచనా వేసింది.

ఈ పథకం కేవలం భౌతిక సౌకర్యం మాత్రమే కాకుండా, చేనేతల జీవనోపాధికి మద్దతుగా, వారి ఆర్థిక భారాన్ని తగ్గించే కీలక సంకల్పంగా భావించబడుతోంది. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు. ప్రభుత్వం పరిశీలించిన వివరాల ప్రకారం.. మొత్తం 11 వేలకు పైగా హ్యాండ్ లూమ్స్, పవర్ లూమ్స్ ఈ పథకానికి అర్హత కలిగి ఉన్నట్లు గుర్తించింది.

ఇవి కూడా చదవండి

చేనేతలకు ఉచిత విద్యుత్ ఇచ్చే పథకానికి ఇటీవల కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. అధికారులు పథకం అమలు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. పథకం ద్వారా చేనేతలు, కుటుంబాల ఆర్థిక భారం తగ్గి, వారి ఉత్పత్తి, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ALSO READ: T20 World Cup: నేడే INDvsPAK మ్యాచ్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: