Andhra Pradesh: చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజాప్రయోజన నిర్ణయం తీసుకుంటూ చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమైంది. కూటమి ప్రభుత్వ హామీ ప్రకారం అమలు కాబోతున్న ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని చేనేతలు, పవర్ లూమ్స్ కార్యకర్తలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం ఇప్పటికే కసరత్తులు మొదలెట్టింది. రాష్ట్ర విద్యుత్ శాఖ వివరాల ప్రకారం.. అర్హుల ఎంపిక పూర్తి అయ్యి, వచ్చే ఏప్రిల్ 1 నుండి నిబంధనల ప్రకారం విద్యుత్ సౌకర్యం లబ్ధిదారులకి అందించబడనుంది. ఈ పథకం ద్వారా హ్యాండ్ లూమ్స్ కార్మికులకు నెలకు సుమారు రూ.700 విద్యుత్...