Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తల్లే ప్రాణం❤️ఈ కొడుకును అభినందించాల్సిందే.. (VIDEO)

Author
Posted By STAR TRINETHRAM
| 13 Feb 2026, 04:43 PM | National
తల్లే ప్రాణం❤️ఈ కొడుకును అభినందించాల్సిందే.. (VIDEO)

సోషల్ మీడియాలో ప్రతి రోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని దృశ్యాలు మాత్రం మనసును తాకి ఎంతోకాలం గుర్తుండిపోతాయి. అలాంటి హృదయాన్ని కదిలించే ఘటన తాజాగా నెటిజన్లను భావోద్వేగానికి గురిచేసింది. వృద్ధురాలైన తల్లిని సైకిల్‌పై ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్తున్న ఓ యువకుడి దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం ప్రయాణం కాదు.. అది ఒక కొడుక్కి తన తల్లిపట్ల ఉన్న అపారమైన ప్రేమ, బాధ్యత, మమకారం ప్రతిబింబించిన క్షణంగా మారింది.

https://twitter.com/therapeuticvids/status/2022206914638360917?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2022206914638360917%7Ctwgr%5E127709d1bd486722a69317fcfd0da79755f8313f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Ftherapeuticvids%2Fstatus%2F2022206914638360917

వీడియోలో కనిపిస్తున్న దృశ్యం సాదాసీదాగా కనిపించినా, అందులోని భావం ఎంతో గొప్పది. వృద్ధ తల్లి సైకిల్ వెనుక కూర్చునేలా చేసి, ఆమె పడిపోకుండా ఉండేందుకు తన నడుముకు టవల్‌తో కట్టుకుని ఎంతో జాగ్రత్తగా సైకిల్ తొక్కుతూ తీసుకెళ్తున్నాడు ఆ కొడుకు. సౌకర్యాలు లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, తల్లిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాలనే ఆ తపన అందరి మనసులను హత్తుకుంది. అతనికి ఆ సైకిలే లగ్జరీ కారు.. తల్లే అతని ప్రపంచమనే భావన ఈ దృశ్యంలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత కాలంలో వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్న తరుణంలో, ఈ వీడియో మాత్రం మానవీయ విలువలను గుర్తు చేస్తోంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా నిలబడటం పిల్లల బాధ్యత అని పెద్దలు చెబుతుంటారు. కానీ ఆ మాటలను కార్యరూపంలో చూపించేవారే నిజమైన ఆదర్శంగా నిలుస్తారు. ఈ యువకుడు తన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తీసుకెళ్లిన తీరు చూస్తే ‘అమ్మపై మమకారం అంటే ఇదే’ అని చెప్పక తప్పదు.

నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరు “ఇదే నిజమైన ప్రేమ” అంటుంటే, మరికొందరు “డబ్బు, సౌకర్యాల కంటే తల్లిపైనున్న మమకారం గొప్పది” అని వ్యాఖ్యానిస్తున్నారు. జీవితంలో ఎంత ఎత్తుకెళ్లినా, తల్లిదండ్రుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరనే సందేశాన్ని ఈ చిన్న ఘటన బలంగా చాటిచెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ దృశ్యం, మన కుటుంబ విలువలను మరోసారి గుర్తు చేస్తోంది.

ALSO READ: Banking services: వాట్సాప్‌లో Hi అని మెసేజ్ చేస్తే చాలు..

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: