తల్లే ప్రాణం❤️ఈ కొడుకును అభినందించాల్సిందే.. (VIDEO)

సోషల్ మీడియాలో ప్రతి రోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని దృశ్యాలు మాత్రం మనసును తాకి ఎంతోకాలం గుర్తుండిపోతాయి. అలాంటి హృదయాన్ని కదిలించే ఘటన తాజాగా నెటిజన్లను భావోద్వేగానికి గురిచేసింది. వృద్ధురాలైన తల్లిని సైకిల్‌పై ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్తున్న ఓ యువకుడి దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం ప్రయాణం కాదు.. అది ఒక కొడుక్కి తన తల్లిపట్ల ఉన్న అపారమైన ప్రేమ, బాధ్యత, మమకారం ప్రతిబింబించిన క్షణంగా మారింది. https://twitter.com/therapeuticvids/status/2022206914638360917?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2022206914638360917%7Ctwgr%5E127709d1bd486722a69317fcfd0da79755f8313f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Ftherapeuticvids%2Fstatus%2F2022206914638360917 వీడియోలో కనిపిస్తున్న దృశ్యం సాదాసీదాగా కనిపించినా, అందులోని భావం ఎంతో గొప్పది. వృద్ధ తల్లి సైకిల్ వెనుక కూర్చునేలా చేసి, ఆమె పడిపోకుండా ఉండేందుకు తన నడుముకు...