Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Municipal Elections: రేపు వైన్ షాపులు బంద్

Author
Posted By STAR TRINETHRAM
| 12 Feb 2026, 11:18 PM | Politics
Municipal Elections: రేపు వైన్ షాపులు బంద్

Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగ్గా, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో మొత్తం 73.01 శాతం ఓటింగ్ నమోదైంది. కార్పొరేషన్లలో 66.05 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 38,09,406 ఓట్లు పోలయ్యాయి.

ఫలితాలు వెల్లడైన అనంతరం ఫిబ్రవరి 16న కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు, మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్నారు.

కౌంటింగ్ రోజున వైన్ షాపులు బంద్..

కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 13న ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని వైన్ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సైబరాబాద్ పరిధిలో మూసివేత..

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు మున్సిపాలిటీల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ఇంద్రేశం, ఇస్నాపూర్, గడ్డపోతారం మున్సిపాలిటీలతో పాటు కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని ఎల్లంపేట, అలియాబాద్, ముడిచింతలపల్లి ప్రాంతాల్లో కూడా వైన్ షాపులు బంద్ కానున్నాయి.

ఇవి కూడా చదవండి

వైన్ షాపులతో పాటు బార్లు, రెస్టారెంట్లలో మద్యం సరఫరా నిలిపివేయనున్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్డారం, చిట్కుల్, ఇస్నాపూర్, రుద్రారం గ్రామాలతో పాటు గడ్డపోతారం మున్సిపాలిటీలోని గడ్డపోతారం, ఖాజీపల్లి, మాధార ప్రాంతాలు కూడా ఈ ఆదేశాల పరిధిలోకి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.

హోరాహోరీగా సాగిన ఎన్నికలు..

ఈసారి మున్సిపల్ ఎన్నికలు త్రిముఖ పోరుగా మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధానంగా పోటీపడ్డాయి. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృత ప్రచారం నిర్వహించాయి. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం చూపించినప్పటికీ, బీఆర్ఎస్, బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చినట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. త్రిముఖ పోరుతో ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో తుది గెలుపు ఎవరిని వరించనుందో ఫిబ్రవరి 13న స్పష్టత రానుంది.

ALSO READ: Accreditation: ఏ మీడియాకు ఎన్ని కార్డులో తెలుసా?

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: