Municipal Elections: రేపు వైన్ షాపులు బంద్

Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగ్గా, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో మొత్తం 73.01 శాతం ఓటింగ్ నమోదైంది. కార్పొరేషన్లలో 66.05 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 38,09,406 ఓట్లు పోలయ్యాయి. ఫలితాలు వెల్లడైన అనంతరం ఫిబ్రవరి 16న కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు, మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. కౌంటింగ్ రోజున వైన్ షాపులు బంద్.. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి...