Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

T20 World Cup: నమీబియాపై భారత్ ఘన విజయం

Author
Posted By STAR TRINETHRAM
| 12 Feb 2026, 10:56 PM | Sports
T20 World Cup: నమీబియాపై భారత్ ఘన విజయం

T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో నమీబియాపై జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో భారత్ 93 పరుగుల తేడాతో ఘనంగా గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

భారత్ విధ్వంసక బ్యాటింగ్..

టాస్ గెలిచిన నమీబియా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా దూకుడుగా ఆడింది. సంజూ శాంసన్ కేవలం 8 బంతుల్లో 22 పరుగులు చేసి శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీతో జట్టుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో వికెట్లు పడినప్పటికీ హార్దిక్ పాండ్యా సిక్సర్ల మోత మోగించి స్కోరు వేగంగా పెంచాడు.

చివరి రెండు ఓవర్లలో 10 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు సాధించింది.

వరుణ్ చక్రవర్తి మాయ..

210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా మంచి ఆరంభం ఇచ్చింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. పవర్ ప్లే ముగిసే సరికి 57 పరుగులు సాధించి పోటీ ఇవ్వగలమనే సంకేతాలు ఇచ్చారు.

కానీ పవర్ ప్లే తర్వాత మ్యాచ్ దిశ పూర్తిగా మారిపోయింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రంగంలోకి దిగడంతో నమీబియా బ్యాటింగ్ కుప్పకూలింది. ఒకే ఓవర్‌లో 2 వికెట్లు, రెండు ఓవర్లలో 3 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుకు గట్టి దెబ్బ కొట్టాడు.

ఇవి కూడా చదవండి

నమీబియా పతనం..

లౌరెన్ ష్టీన్‌కాంప్ 20 బంతుల్లో 29 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్స్), జాన్ ఫ్రైలింక్ 15 బంతుల్లో 22 పరుగులు చేశారు. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్‌మస్ 18 పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది.

బౌలర్ల ప్రదర్శన..

భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసి మెరిశాడు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు సాధించారు. అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రిత్ బుమ్రా, శివమ్ దుబే తలో వికెట్ దక్కించుకున్నారు.

బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ, బౌలింగ్‌లో రెండు వికెట్లు సాధించిన హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ALSO READ: Alert: వాహనదారులకు ఇక ‘QR కోడ్’ రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: