T20 World Cup: నమీబియాపై భారత్ ఘన విజయం

T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో నమీబియాపై జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో భారత్ 93 పరుగుల తేడాతో ఘనంగా గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ విధ్వంసక బ్యాటింగ్.. టాస్ గెలిచిన నమీబియా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా దూకుడుగా ఆడింది. సంజూ శాంసన్ కేవలం 8 బంతుల్లో 22 పరుగులు చేసి శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీతో జట్టుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో వికెట్లు పడినప్పటికీ హార్దిక్ పాండ్యా సిక్సర్ల మోత...