Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Alert: వాహనదారులకు ఇక ‘QR కోడ్’ రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరి

Author
Posted By STAR TRINETHRAM
| 12 Feb 2026, 10:46 PM | Telangana
Alert: వాహనదారులకు ఇక ‘QR కోడ్’ రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరి

Alert: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి వేళల్లో రహదారులపై ప్రయాణించే వాహనాలు స్పష్టంగా కనిపించేలా చేయడానికి ఫిబ్రవరి 20 నుంచి అన్ని రవాణా వాహనాలకు క్యూఆర్ కోడ్ (QR Code) ఆధారిత రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనను పాటించని వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ (FC) జారీ చేయబోమని అధికారులు స్పష్టం చేశారు.

అసలేంటి ఈ కొత్త విధానం?

ఇప్పటివరకు వాహనాలపై సాధారణ రిఫ్లెక్టివ్ టేపులు అమర్చుతున్నప్పటికీ, నాణ్యత లోపాలు మరియు నకిలీ టేపుల వాడకం కారణంగా ఆశించిన ఫలితాలు రాలేదని ప్రభుత్వం గుర్తించింది. దీంతో 1989 కేంద్ర మోటారు వాహనాల నియమావళి ప్రకారం క్యూఆర్ ఆధారిత మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS)ను అమల్లోకి తీసుకొచ్చింది.

ఈ కొత్త విధానంలో ప్రతి రిఫ్లెక్టివ్ టేపుపై తెలంగాణ రవాణా శాఖ లోగో, హోలోగ్రామ్, ప్రత్యేక సీరియల్ నంబర్‌తో కూడిన QR కోడ్ ఉంటుంది. అధికారులు తనిఖీల సమయంలో QR కోడ్‌ను స్కాన్ చేసి టేపు అసలైనదా కాదా అనే విషయాన్ని వెంటనే నిర్ధారించగలరు. దీని ద్వారా నకిలీ ఉత్పత్తుల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అనుమతి పొందిన సంస్థలు..

ప్రభుత్వం కేవలం ఐదు ప్రముఖ కంపెనీలను (OEMs) మాత్రమే ఎంపానెల్ చేసింది. అవి:

* 3ఎం ఇండియా లిమిటెడ్

* ఒరాఫోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

* అవెరి డెన్నిసన్ ఇండియా

* గ్లోడియన్ రిఫ్లెక్టివ్

* డోమింగ్ రిఫ్లెక్టివ్ మెటీరియల్స్

ఇవి కూడా చదవండి

వాహన యజమానులు ఈ సంస్థల అధీకృత డీలర్ల వద్ద మాత్రమే రిఫ్లెక్టివ్ టేపులు అమర్చించుకోవాలి. అధిక ధరలు వసూలు చేయకుండా ప్రభుత్వం నిర్దిష్ట రేట్లను ఖరారు చేసింది. ఈ ధరల్లో టేపుల అమరిక (అఫిక్సేషన్), సర్టిఫికేట్ ఛార్జీలు కూడా కలుపుకుని ఉంటాయి.

ఖరారు చేసిన ధరలు:

CT 20MM: మీటరుకు రూ.79.80 నుంచి రూ.85 వరకు

CT 50MM: మీటరుకు రూ.145 నుంచి రూ.151.80 వరకు

C3/C4 రియర్ మార్కింగ్ ప్లేట్లు: జతకు రూ.2,500 నుంచి రూ.2,900 వరకు

రిఫ్లెక్టర్లు (40MM/80MM): ఒక్కోటి రూ.35 నుంచి రూ.60 వరకు

టేపులు అమర్చిన తర్వాత డీలర్లు కనీసం 2 ఏళ్ల వారంటీతో కూడిన అఫిక్సేషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది.

కఠిన తనిఖీలు

రవాణా అధికారులు తనిఖీల సమయంలో QR కోడ్ స్కాన్ చేసి టేపుల ప్రామాణికతను ధృవీకరిస్తారు. ఒకవేళ నకిలీ ఉత్పత్తులు గుర్తిస్తే సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే తయారీ సమయంలోనే (Company Fitted) రిఫ్లెక్టివ్ టేపులు ఉన్న కొత్త వాహనాలకు ఈ ధృవీకరణ అవసరం లేదని అధికారులు తెలిపారు. రవాణా వాహన యజమానులు గడువులోపు అధీకృత డీలర్ల వద్ద రిఫ్లెక్టివ్ టేపులు అమర్చించుకుని రోడ్డు భద్రతలో భాగస్వాములు కావాలని రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది.

ALSO READ: TGSET 2026 హాల్ టికెట్లు విడుదల

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: