Alert: వాహనదారులకు ఇక ‘QR కోడ్’ రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరి
Alert: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి వేళల్లో రహదారులపై ప్రయాణించే వాహనాలు స్పష్టంగా కనిపించేలా చేయడానికి ఫిబ్రవరి 20 నుంచి అన్ని రవాణా వాహనాలకు క్యూఆర్ కోడ్ (QR Code) ఆధారిత రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనను పాటించని వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ (FC) జారీ చేయబోమని అధికారులు స్పష్టం చేశారు. అసలేంటి ఈ కొత్త విధానం? ఇప్పటివరకు వాహనాలపై సాధారణ రిఫ్లెక్టివ్ టేపులు అమర్చుతున్నప్పటికీ, నాణ్యత లోపాలు మరియు నకిలీ టేపుల వాడకం కారణంగా ఆశించిన ఫలితాలు రాలేదని ప్రభుత్వం గుర్తించింది. దీంతో 1989 కేంద్ర...