Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Exit polls: ‘మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా..!’

Author
Posted By STAR TRINETHRAM
| 11 Feb 2026, 10:50 PM | Politics
Exit polls: ‘మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా..!’

* కాంగ్రెస్‌కు 80-85 మున్సిపాలిటీల అంచనా!

* తుది ఫలితాలపై ఉత్కంఠ

* ఈవీఎంల తీర్పే అంతిమ నిర్ణయం

Exit polls: తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పురపోరుకు బుధవారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై కేంద్రీకృతమైంది. పట్టణ రాజకీయాల్లో ఎవరు ఆధిపత్యం చాటుకోబోతున్నారు? అధికార పగ్గాలు ఎవరికి దక్కనున్నాయి? అన్న ఉత్కంఠ నెలకొన్న వేళ ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటికే పీపుల్స్ పల్స్ సర్వే కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉంటుందని అంచనా వేయగా, తాజాగా మరో రెండు ప్రముఖ సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి.

బీకాన్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ప్రకారం రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యం సాధించబోతోందని అంచనా వేస్తోంది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ 80 నుంచి 85 మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశముందని పేర్కొంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌కు 8 నుంచి 10 మున్సిపాలిటీలు, బీజేపీకి 4 నుంచి 6 మున్సిపాలిటీలు దక్కవచ్చని అంచనా వేసింది. అదేవిధంగా సుమారు 21 మున్సిపాలిటీలలో హంగ్ పరిస్థితి లేదా ఇతర పార్టీలకు అవకాశముంటుందని ప్రిడిక్షన్ ఇచ్చింది. ఈ అంచనాలు వెలువడిన వెంటనే రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు వేడెక్కాయి.

ఇవి కూడా చదవండి

ఇక ఆపరేషన్ చాణక్య సర్వే సంస్థ విడుదల చేసిన వివరాలు మరింత విశ్లేషణాత్మకంగా ఉన్నాయి. మొత్తం మున్సిపల్ వార్డుల పరంగా కాంగ్రెస్ పార్టీ 1400 నుంచి 1449 వార్డులు, అంటే దాదాపు 48 శాతం వరకు గెలుచుకునే అవకాశముందని అంచనా వేయబడింది. బీఆర్ఎస్ 745 నుంచి 793 వార్డులు, సుమారు 26 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలుస్తుందని పేర్కొంది. బీజేపీ 358 నుంచి 399 వార్డులు, అంటే 13 శాతం వరకు సాధించవచ్చని అంచనా. ఎంఐఎం 150 నుంచి 187 వార్డులు, జనసేన 30 నుంచి 35 వార్డులు, ఇతరులు 80 నుంచి 119 వార్డులు గెలుచుకునే అవకాశముందని సర్వే వివరించింది.

ప్రధాన పార్టీలన్నీ ఈ పురపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృత ప్రచారం నిర్వహించాయి. అధికార కాంగ్రెస్ అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లగా, బీఆర్ఎస్ మరియు బీజేపీలు ప్రభుత్వం పై విమర్శలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఓటర్ల మద్దతు విషయంలో ప్రతిపక్షాలు వెనుకబడినట్టు స్పష్టమవుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం బలంగా కనిపిస్తోందని సర్వేలు సూచిస్తున్నాయి.

ఆపరేషన్ చాణక్య సర్వేలో జనసేనకు 30 నుంచి 35 స్థానాలు వచ్చే అవకాశముందని పేర్కొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిన్నపార్టీల పాత్ర కూడా కొన్ని ప్రాంతాల్లో కీలకంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. హంగ్ పరిస్థితులు ఏర్పడే మున్సిపాలిటీల్లో స్వతంత్రులు, చిన్నపార్టీలు నిర్ణాయకంగా మారే అవకాశం ఉందని చర్చ సాగుతోంది.

అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయి? వాస్తవ ఫలితాలు ఇదే విధంగా ఉంటాయా? లేక రాజకీయ సమీకరణాలు తారుమారవుతాయా? అన్నది ఫలితాల రోజు తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ సాధారణంగా ఓటర్ల అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయే గానీ, తుది తీర్పు మాత్రం ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లే నిర్ణయిస్తాయి. దీంతో అన్ని పార్టీల నేతలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ: అబ్బో.. మాములుగా లేదుగా ఇతడి కథ.. టిప్ టాప్‌గా తిరుగుతాడు, ఇళ్లను గుల్ల చేసేస్తాడు!

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: