Exit polls: ‘మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా..!’
* కాంగ్రెస్‌కు 80-85 మున్సిపాలిటీల అంచనా! * తుది ఫలితాలపై ఉత్కంఠ * ఈవీఎంల తీర్పే అంతిమ నిర్ణయం Exit polls: తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పురపోరుకు బుధవారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై కేంద్రీకృతమైంది. పట్టణ రాజకీయాల్లో ఎవరు ఆధిపత్యం చాటుకోబోతున్నారు? అధికార పగ్గాలు ఎవరికి దక్కనున్నాయి? అన్న ఉత్కంఠ నెలకొన్న వేళ ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటికే పీపుల్స్ పల్స్ సర్వే కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉంటుందని అంచనా వేయగా, తాజాగా మరో రెండు ప్రముఖ సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి....