Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి

Author
Posted By STAR TRINETHRAM
| 07 Feb 2026, 07:51 PM | Telangana
వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి

: హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

స్టార్ త్రినేత్రం, హనుమకొండ: రానున్న వేసవి కాలంలో జిల్లాలోని అన్ని గ్రామాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని గ్రామాల్లో వేసవి కాలంలో తాగునీటి సరఫరాకు సంబంధించి మిషన్ భగీరథ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గాయత్రి, ఈఈ రామాంజనేయులు, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్‌లతో కలిసి వేసవిలో తాగునీటి సరఫరాకు సంబంధించి రూపొందించాల్సిన యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరంలో తాగునీటి సమస్యలు ఎదురైన గ్రామాలు, వాటికి తీసుకున్న పునరుద్ధరణ చర్యలు, జిల్లాకు అవసరమైన నీటి సామర్థ్యం, నీటి వనరుల స్థితిగతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను మిషన్ భగీరథ ఈఈలు, జిల్లా పంచాయతీ అధికారి త్వరితగతిన అందజేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు ప్రతి ఇంటికి తాగునీరు అందుతున్నదా లేదా అన్నది క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

ఇందిరమ్మ ఇళ్లు, రెండు పడక గదుల ఇళ్లు, వలస కార్మికులు నివసిస్తున్న కాలనీలు సహా అన్ని నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ, పంచాయతీ శాఖలు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని ఎంపీడీవోలు, ఎంపీవోలను ఆదేశించారు. ప్రతి గ్రామపంచాయతీలో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని సూచించారు.

జిల్లాలోని గ్రామపంచాయతీలలో తాగునీటి సరఫరాకు సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే స్పందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, డిఆర్డివో మేన శ్రీను, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మిషన్ భగీరథ డిఈలు, ఏఈలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ALSO READ: 8వ వార్డులో కాంగ్రెస్ గెలుపు ఖాయం: పాలకుర్తి సారంగపాణి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: