వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి
: హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ స్టార్ త్రినేత్రం, హనుమకొండ: రానున్న వేసవి కాలంలో జిల్లాలోని అన్ని గ్రామాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని గ్రామాల్లో వేసవి కాలంలో తాగునీటి సరఫరాకు సంబంధించి మిషన్ భగీరథ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గాయత్రి, ఈఈ రామాంజనేయులు, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్లతో కలిసి వేసవిలో తాగునీటి సరఫరాకు సంబంధించి రూపొందించాల్సిన యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించారు....