Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

8వ వార్డులో కాంగ్రెస్ గెలుపు ఖాయం: పాలకుర్తి సారంగపాణి

Author
Posted By STAR TRINETHRAM
| 07 Feb 2026, 04:50 PM | Politics
8వ వార్డులో కాంగ్రెస్ గెలుపు ఖాయం: పాలకుర్తి సారంగపాణి

- ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా..

- వార్డును అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం

- గెలిపిస్తే ఇంటి బిడ్డలా ఎప్పుడూ అందుబాటులో ఉంటా..

- అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తా..

: 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పాలకుర్తి సారంగపాణి

స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పాలకుర్తి సారంగపాణి ప్రచారంలో దూకుడు చూపిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అధికార పార్టీ తరఫున ఈసారి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న ఆయన.. ఇంటింటి ప్రచారంతో వార్డు ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని శనివారం నిర్వహించిన ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రచార కార్యక్రమం అనంతరం మాట్లాడిన పాలకుర్తి సారంగపాణి.. తాను సమాజం పట్ల పూర్తి అవగాహనతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. కేవలం పదవుల కోసమే కాకుండా సేవాభావంతోనే ప్రజల ముందుకు వచ్చానని స్పష్టం చేశారు. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే, కౌన్సిలర్‌గా కాకుండా ఒక సేవకుడిగా పనిచేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. 8వ వార్డులో ఉన్న సమస్యలన్నింటిపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, ఆశల కోసం కాదు ఆశయాల కోసం పనిచేసే వారికి ప్రజలు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రచారంలో పేర్కొన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సహకారంతో 8వ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని పాలకుర్తి సారంగపాణి హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తూ, వార్డును అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తానని అన్నారు.

తాను ప్రజలందరికీ ఇంటి బిడ్డలా ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, రోజువారీగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కార్యాచరణ చేపడతానని, ఎవరూ ప్రభుత్వ సహాయానికి దూరం కాకుండా చూడటమే తన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. కొందరు వ్యక్తులు కావాలనే తనపై లేనిపోని విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆశీర్వాదంతో తనకు అవకాశం కల్పిస్తే, వార్డు అభివృద్ధే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తానని ఆయన అన్నారు.

మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వచ్చానని, హస్తం గుర్తుకు ఓటు వేసి సేవ చేసే భాగ్యం కల్పించాలని పాలకుర్తి సారంగపాణి ప్రజలను అభ్యర్థించారు. ప్రచారంలో ప్రజల నుంచి లభిస్తున్న స్పందనతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా, 8వ వార్డులో హస్తం పార్టీకి అనుకూల వాతావరణం ఉందన్న విశ్వాసం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.

ALSO READ: Tollywood actor: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: