Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Municipal Elections: ప్రచారంలో దూసుకుపోతున్న ఈగ దామోదర్

Author
Posted By STAR TRINETHRAM
| 05 Feb 2026, 10:31 AM | Politics
Municipal Elections: ప్రచారంలో దూసుకుపోతున్న ఈగ దామోదర్

Municipal Elections: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ రాజకీయాల్లో ఎన్నికల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని 11వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈగ దామోదర్ గురువారం నిర్వహించిన ప్రచారం స్థానికంగా హోరెత్తిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనాసగే ఈ ప్రచార కార్యక్రమంలో ఆయన తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. వీధివీధిన నినాదాలు, హోరెత్తిన ప్రచారంతో 11వ వార్డు మొత్తం ఎన్నికల సందడితో మార్మోగింది. ప్రజల స్పందన కూడా ఉత్సాహంగా ఉండటంతో ప్రచారం మరింత ఉత్కంఠగా మారింది.

ప్రచారంలో భాగంగా ఈగ దామోదర్ మాట్లాడుతూ.. 11వ వార్డు అభివృద్ధిలో వెనుకబడి ఉండటానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నిసార్లు కోరినా మౌలిక వసతుల సమస్యలు పరిష్కారం కాలేదని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి అంశాల్లో ఇంకా అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితి ఇకపై మారాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రజల సహకారం కీలకమని చెప్పారు. 11వ వార్డులో నిజమైన అభివృద్ధి దూసుకుపోవాలంటే రాబోయే ఎన్నికల్లో చేతి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం పట్టణ కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని, అదే వేగంతో 11వ వార్డును కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని ఈగ దామోదర్ స్పష్టం చేశారు. గత పాలకుల మాదిరిగా హామీలకే పరిమితం కాకుండా, ప్రజలకు కనిపించే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సమస్యపై స్పందిస్తూ, ప్రజలతో ఎప్పుడూ అందుబాటులో ఉండే కౌన్సిలర్‌గా పనిచేస్తానని చెప్పారు. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు భద్రత, వృద్ధులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ కార్యాచరణలో కీలక అంశాలుగా ఉంటాయని వివరించారు.

ప్రచారంలో పాల్గొన్న స్థానికులు కూడా ఈగ దామోదర్‌పై విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తాము ఎదుర్కొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వాటిని పరిష్కరిస్తానని భరోసా ఇచ్చిన తీరు నచ్చిందని పలువురు చెప్పారు. ఈసారి ఎన్నికల్లో మార్పు కావాలని, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే నాయకుడికే తమ ఓటు ఉంటుందని వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 11వ వార్డులో ఈగ దామోదర్ ప్రచారం రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.

ALSO READ: IND vs AFG U19: వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత్

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: