Municipal Elections: ప్రచారంలో దూసుకుపోతున్న ఈగ దామోదర్
Municipal Elections: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ రాజకీయాల్లో ఎన్నికల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని 11వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈగ దామోదర్ గురువారం నిర్వహించిన ప్రచారం స్థానికంగా హోరెత్తిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనాసగే ఈ ప్రచార కార్యక్రమంలో ఆయన తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. వీధివీధిన నినాదాలు, హోరెత్తిన ప్రచారంతో 11వ వార్డు మొత్తం ఎన్నికల సందడితో మార్మోగింది. ప్రజల స్పందన కూడా ఉత్సాహంగా ఉండటంతో ప్రచారం మరింత ఉత్కంఠగా మారింది. ప్రచారంలో భాగంగా ఈగ దామోదర్ మాట్లాడుతూ.. 11వ వార్డు అభివృద్ధిలో వెనుకబడి ఉండటానికి...