Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Romantic movies: సాదాసీదా లవ్ స్టోరీలు చూసి బోర్ కొట్టిందా?. . ఓటీటీలో అస్సలు మిస్సవ్వకూడని 10 బోల్డ్ సినిమాలు చూసేయండి.

Author
Posted By STAR TRINETHRAM
| 04 Feb 2026, 05:14 PM | Entertainment
Romantic movies: సాదాసీదా లవ్ స్టోరీలు చూసి బోర్ కొట్టిందా?. . ఓటీటీలో అస్సలు మిస్సవ్వకూడని 10 బోల్డ్ సినిమాలు చూసేయండి.

Romantic movies: సాధారణ ప్రేమకథలు, రొటీన్ రొమాన్స్ చూసి చూసి బోర్ కొట్టిందా? ప్రతీసారి ఒకేలా సాగే లవ్ స్టోరీలకు బ్రేక్ ఇచ్చి, కాస్త బోల్డ్‌గా, ఇంటెన్స్‌గా, భావోద్వేగాలతో పాటు ఆకర్షణ, ఒబ్సెషన్, హద్దులు దాటే కోరికలతో నిండిన కంటెంట్ చూడాలనుకుంటున్నారా? అయితే మీకోసం నెట్‌ఫ్లిక్స్ ఓ క్రేజీ కలెక్షన్‌ని సిద్ధం చేసింది. కేవలం ప్రేమే కాకుండా, మానవ మనస్తత్వంలోని లోతైన కోణాలు, సంబంధాల్లో వచ్చే మలుపులు, నమ్మకం-మోసం మధ్య సాగే సంఘర్షణలను చూపించే ఈ సినిమాలు మీ వీకెండ్ మూడ్‌ను పూర్తిగా మార్చేస్తాయి. రొమాన్స్‌కు థ్రిల్లర్ టచ్, ఎమోషన్స్‌కు బోల్డ్ నేరేషన్ జతకలిసిన ఈ సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.

వరల్డ్‌వైడ్‌గా భారీ క్రేజ్ తెచ్చుకున్న ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ ప్రేమను ఒక డిఫరెంట్ కోణంలో చూపించింది. కాలేజ్ విద్యార్థిని అనస్తాసియా, బిలియనీర్ క్రిస్టియన్ గ్రేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన సందర్భంలో మొదలైన పరిచయం, క్రమంగా అసాధారణ బంధంగా మారుతుంది. డామినేషన్, కంట్రోల్, ఎమోషనల్ అటాచ్మెంట్ మధ్య సాగే ఈ సంబంధం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. శృంగార భావాలను కొత్త నేరేషన్‌తో చూపించిన ఈ సినిమా సిరీస్ ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మాన్‌హాటన్ నేపథ్యంగా తెరకెక్కిన ‘స్లివర్’లో రొమాన్స్‌తో పాటు మిస్టరీ కూడా కీలకంగా ఉంటుంది. కొత్త అపార్ట్‌మెంట్‌లో కొత్త జీవితం ప్రారంభించాలని వచ్చిన కార్లీ, అక్కడ ఓ మిస్టీరియస్ వ్యక్తితో ప్రేమలో పడుతుంది. అయితే అదే సమయంలో ఆ బిల్డింగ్‌లో దాగున్న చీకటి రహస్యాలు, అనుమానాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ప్రేమ, సస్పెన్స్ కలిసినప్పుడు కథ ఎలా మలుపులు తిరుగుతుందో ఈ సినిమా చూపిస్తుంది.

మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘365 డేస్’ బోల్డ్ లవ్ స్టోరీల జాబితాలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. సిసిలియన్ మాఫియా డాన్ మాసిమో, లారాను కిడ్నాప్ చేసి ఏడాది కాలంలో తనని ప్రేమించాలనే షరతు పెడతాడు. ఈ ఇద్దరి మధ్య ఏర్పడే ఇంటెన్స్ కెమిస్ట్రీ, పవర్ గేమ్, భావోద్వేగ సంఘర్షణలు సినిమాను చర్చనీయాంశంగా మార్చాయి. ఈ మూవీకి వచ్చిన క్రేజ్‌తోనే సీక్వెల్స్ కూడా తెరకెక్కాయి.

పర్ఫెక్ట్‌గా కనిపించే ఓ మహిళ జీవితం ఎలా తలకిందులవుతుందో ‘అడిక్టెడ్’ చూపిస్తుంది. మంచి కెరీర్, కుటుంబంతో సంతోషంగా ఉన్న జోయ్ రేనార్డ్ జీవితం, ఓ ఆర్టిస్ట్‌తో ఏర్పడిన పరిచయం వల్ల ప్రమాదంలో పడుతుంది. ఒక చిన్న ఆకర్షణ ఎలా వ్యసనంగా మారి, జీవితాన్ని నాశనం చేస్తుందో ఈ సినిమా బలమైన కథనంతో వివరిస్తుంది.

ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్ ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పే క్లాసిక్ థ్రిల్లర్ ‘ఫాటల్ అట్రాక్షన్’. ఒక చిన్న అఫైర్‌తో మొదలైన కథ, ఆబ్సెషన్‌గా మారి కుటుంబాన్ని ఎలా భయాందోళనకు గురిచేస్తుందో ఈ సినిమా ఉత్కంఠభరితంగా చూపిస్తుంది. మానసిక ఉద్రిక్తత, భయాన్ని కలిగించే కథనం ఈ మూవీకి ప్రత్యేకత.

ఇవి కూడా చదవండి

క్లాసిక్ పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన ‘లేడీ చాటర్లీస్ లవర్’ సమాజం గీసిన గీతలను ప్రశ్నిస్తుంది. యుద్ధంలో గాయపడిన భర్తతో భావోద్వేగంగా దూరమైపోయిన లేడీ చాటర్లీ, ఒక గేమ్ కీపర్‌తో ఏర్పడిన బంధం అప్పట్లో సంచలనంగా మారింది. శారీరక, మానసిక స్వేచ్ఛ కోసం ఆమె చేసిన ప్రయాణం ఈ కథలో ప్రధానంగా కనిపిస్తుంది.

‘మియా కల్పా’లో క్రిమినల్ డిఫెన్స్ లాయర్‌గా ఉన్న మియా, ఓ మర్డర్ కేసులో నిందితుడైన ఆర్టిస్ట్ తరఫున వాదించాల్సి వస్తుంది. ప్రొఫెషనల్ బాధ్యతలు, వ్యక్తిగత ఆకర్షణల మధ్య ఆమె పడే సంఘర్షణ కథకు కీలకంగా మారుతుంది. ఇందులోని ట్విస్టులు ప్రేక్షకులను చివరి వరకూ కట్టిపడేస్తాయి.

ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘రైడ్ ఆర్ డై’ స్నేహం, ప్రేమ, బాధను కలగలిపిన కథ. గృహహింస నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే ఓ మహిళను ఆమె చిన్ననాటి స్నేహితురాలు కాపాడుతుంది. ఆ ప్రయాణంలో ఇద్దరి మధ్య ఉన్న బంధం, దాగిన భావాలు బయటపడతాయి.

‘బర్నింగ్ బిట్రేయల్’ నమ్మకం, మోసం చుట్టూ తిరిగే కథ. తన భాగస్వామి మోసం చేశాడని తెలిసిన బాబి, కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనుకుంటుంది. ఈ క్రమంలో ఏర్పడిన కొత్త ప్రేమ వెనుక ఉన్న ప్రమాదం కథకు ప్రధాన మలుపు.

ఆఫీస్ రొమాన్స్ ఎలా విషపూరితంగా మారుతుందో ‘ఫెయిర్ ప్లే’ చూపిస్తుంది. ఒకే కంపెనీలో పనిచేస్తూ రహస్యంగా ప్రేమించుకునే ఎమిలీ, లూక్ మధ్య సంబంధం, ప్రమోషన్ కారణంగా చీలిపోతుంది. ఈర్ష, అధికార పోరాటాలు వారి వ్యక్తిగత జీవితాన్ని ఎలా దెబ్బతీస్తాయో ఈ సినిమా బలంగా చూపిస్తుంది.

ALSO READ: ఇదీ మావా శోభితా ధూళిపాళ్ల రేంజ్.. టాప్-3 రొమాంటిక్ రోల్స్.. మీరు చూశారా?

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: