Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Train Fight: రైల్లో జుట్టు పట్టుకొని కొట్టుకున్న యువతులు (VIDEO)

Author
Posted By STAR TRINETHRAM
| 03 Feb 2026, 11:34 AM | Crime
Train Fight: రైల్లో జుట్టు పట్టుకొని కొట్టుకున్న యువతులు (VIDEO)

Train Fight: ఇటీవల కాలంలో ప్రజా రవాణా వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలు సమాజంలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా బస్సులు, రైళ్లు, విమానాలు వంటి ప్రయాణ సాధనాల్లో కొందరు మహిళలు అతి అరాచకంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ప్రయాణికుల రద్దీతో ఉండే ఈ ప్రాంతాల్లో కనీస నియంత్రణ లేకుండా గొడవలకు దిగడం, ఇతరులకు అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలు పెరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తనలతో ప్రజా రవాణా భద్రత, ప్రయాణికుల సంస్కృతి ప్రశ్నార్థకంగా మారుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

https://twitter.com/gharkekalesh/status/2017526046455959729?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2017526046455959729%7Ctwgr%5E18dedf7250efdf7ccfe3a8a35776a8158ffd73bd%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fgharkekalesh%2Fstatus%2F2017526046455959729

ఇప్పటికే ఉచిత బస్సుల ప్రయాణాల్లో మహిళల మధ్య చోటుచేసుకున్న గొడవల వీడియోలు పలుమార్లు వైరల్ అయ్యాయి. సీటు, క్యూలో నిలబడటం వంటి చిన్న విషయాలకే మాటా మాటా పెరిగి చివరకు జుట్టులు పట్టుకుని దాడులు చేసుకునే స్థాయికి పరిస్థితి చేరుతున్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. చుట్టుపక్కల ఎంతో మంది ప్రయాణికులు ఉన్నా కూడా వారిని పట్టించుకోకుండా కొందరు పూర్తిగా అదుపు తప్పినట్లుగా ప్రవర్తించడం చూసి జనాలు షాక్ అవుతున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా గొడవలకు దిగడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

ఇలాంటి ఘర్షణలు ఇప్పుడు రైళ్లలో కూడా చోటుచేసుకుంటుండటం మరింత కలవరపెడుతోంది. తాజాగా ఓ రన్నింగ్ ట్రైన్‌లో ఇద్దరు యువతులు తీవ్ర స్థాయిలో పరస్పరం దాడులకు దిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. జుట్టులు పట్టుకుని ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడం, బూతులు తిట్టుకుంటూ ఘర్షణ పడటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు ఎంతగా ఆపేందుకు ప్రయత్నించినా కూడా వారు వెనక్కి తగ్గకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సీటు విషయంలో మొదలైన వాగ్వాదమే చివరకు ఈ స్థాయి ఫైటింగ్‌కు దారి తీసినట్లు తెలుస్తోంది. ట్రైన్‌లో ఒకరిపై ఒకరు పడుతూ తీవ్రంగా కొట్టుకోవడంతో మిగతా ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రయాణం మధ్యలో ఈ తరహా ఘటన జరగడంతో కొందరు ప్రయాణికులు అసౌకర్యానికి లోనయ్యారని, మరికొందరు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ మొత్తం ఘటనను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇలాంటి ప్రవర్తన ఏంటని ప్రశ్నిస్తూ కామెంట్లు పెడుతున్నారు. చిన్న విషయాలకు ఇంత పెద్ద గొడవలు అవసరమా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ALSO READ: NABARD: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: