Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

BIG BREAKING: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Author
Posted By STAR TRINETHRAM
| 30 Jan 2026, 01:03 PM | Business
BIG BREAKING: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

కొన్ని నెలలుగా ఎలాంటి అంచనాలకు అందకుండా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా కుప్పకూలాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.11 వేల మేర పెరిగి రికార్డు స్థాయికి చేరగా, శుక్రవారం మాత్రం ఉదయం నుంచే పతనం మొదలైంది. సాయంత్రానికి వచ్చేసరికి ఒక్కరోజులోనే తులం బంగారం ధర ఏకంగా రూ.11 వేల వరకు తగ్గడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ భారీ పతనంతో శుక్రవారం సాయంత్రానికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,69,200కు దిగివచ్చింది. జీఎస్టీతో కలిపి హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.1,73 వేల వరకు ఉంది. కొద్ది రోజుల క్రితం వరకూ లక్షా డెబ్బై వేల దాకా వెళ్లిన ధరలు ఒక్కరోజులో ఇంతగా తగ్గడం బంగారం కొనుగోలు దారుల్లో మిశ్రమ స్పందనకు కారణమైంది.

ఇక వెండి ధరల పరిస్థితి మరింత సంచలనంగా మారింది. ఇటీవల రోజురోజుకీ రికార్డు స్థాయిలను తాకిన వెండి ధర ఒక్కరోజులోనే భారీగా కూలిపోయింది. శుక్రవారం కేజీ వెండి ధర ఏకంగా రూ.59 వేల వరకు పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.3,48,000కు తగ్గింది. ఇంత పెద్ద స్థాయిలో వెండి ధరలు పడిపోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడులుగా భావించిన ఇన్వెస్టర్లు ఇటీవల భారీగా పెట్టుబడులు పెట్టారు. అంతర్జాతీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణ భయాలు, డాలర్ హెచ్చుతగ్గులతో పాటు ఈవీ వాహనాలు, సోలార్ ప్యానెల్స్ రంగాల్లో వెండికి పెరిగిన డిమాండ్ ఈ లోహాల ధరలను ఊహకందని రీతిలో పెంచింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిల వద్ద కొనుగోళ్లు చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలోనే మరో కీలక అంశంగా బడ్జెట్ 2026 మారింది. మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. బడ్జెట్ తర్వాత బంగారం, వెండి ధరలు తగ్గుతాయన్న అంచనాలు బలపడటంతో ఇన్వెస్టర్లు లాభాలను తీసుకోవడం మొదలుపెట్టినట్లు సమాచారం.

లాభాల స్వీకరణ కారణంగా ఒక్కరోజులోనే బంగారం సంపద దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర ఆవిరైనట్లు అంచనాలు వెలువడుతున్నాయి. గురువారం మార్కెట్లో ఈ లోహాల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపించగా, కొంతసేపటికి పరిస్థితి కొంతవరకు సర్దుకుందని స్టాక్ మార్కెట్ నిపుణులు వెల్లడించారు. అయితే శుక్రవారం మళ్లీ లాభాల స్వీకరణ పెరగడంతో ధరలు భారీగా పడిపోయాయని చెబుతున్నారు.

గడిచిన రెండు రోజుల్లో బంగారం, వెండిలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ పరిణామం భారీ నష్టాలను మిగిల్చింది. మరోవైపు ధరలు తగ్గడంతో కొనుగోలు దారులు మాత్రం కాస్త ఊరట చెందుతున్నారు. బడ్జెట్ తర్వాత ధరలు మరింత తగ్గుతాయా? లేక మళ్లీ పెరుగుతాయా? అన్న అంశంపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

ALSO READ: నదీ జల వివాదాలపై కేంద్ర జల వివాదాల కమిటీ సమావేశం

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: