BIG BREAKING: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

కొన్ని నెలలుగా ఎలాంటి అంచనాలకు అందకుండా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా కుప్పకూలాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.11 వేల మేర పెరిగి రికార్డు స్థాయికి చేరగా, శుక్రవారం మాత్రం ఉదయం నుంచే పతనం మొదలైంది. సాయంత్రానికి వచ్చేసరికి ఒక్కరోజులోనే తులం బంగారం ధర ఏకంగా రూ.11 వేల వరకు తగ్గడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ భారీ పతనంతో శుక్రవారం సాయంత్రానికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,69,200కు దిగివచ్చింది. జీఎస్టీతో కలిపి హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.1,73 వేల వరకు ఉంది....