Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Telangana: మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్‌కు ముగిసిన గడువు

Author
Posted By STAR TRINETHRAM
| 30 Jan 2026, 12:48 PM | Politics
Telangana: మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్‌కు ముగిసిన గడువు

Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల రాజకీయాలకు కీలక ఘట్టంగా భావిస్తున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలను స్వీకరించారు. చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల వాతావరణం రాష్ట్రవ్యాప్తంగా వేడెక్కింది. నామినేషన్ల చివరి రోజున పట్టణాలు, మున్సిపాలిటీ కార్యాలయాలు రాజకీయ కార్యకర్తలు, అభ్యర్థులతో కిటకిటలాడాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున బరిలోకి దిగారు. స్థానిక సమస్యలే ప్రధాన అస్త్రంగా అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల దాఖలుతో రాజకీయ సమీకరణాలు స్పష్టమవుతున్నాయి.

నామినేషన్ల స్వీకరణ ముగిసిన నేపథ్యంలో శనివారం అధికారులు వాటి పరిశీలన చేపట్టనున్నారు. అర్హతలు, పత్రాల సరైనతపై పరిశీలన జరగనుంది. ఈ దశలో కొన్నింటిని తిరస్కరించే అవకాశం కూడా ఉందని ఎన్నికల వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాతే తుది అభ్యర్థుల జాబితా స్పష్టతకు రానుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈ లోపు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ దశలో పొత్తులు, అవగాహనలు, ఏకగ్రీవ ఎన్నికలపై చర్చలు జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉపసంహరణల అనంతరం అసలు పోరు మొదలవనుంది.

ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజల తీర్పు కీలకంగా మారనుంది. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 7 కార్పొరేషన్లు, 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీలు, మొత్తం 2,582 వార్డుల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే రోజున అన్ని చోట్ల పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఇవి కూడా చదవండి

భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 8,203 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.

ALSO READ: ACB రైడ్స్‌లో స్వాధీనం చేసుకున్న నగదును ఏం చేస్తారో తెలుసా?

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: