Telangana: మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్‌కు ముగిసిన గడువు

Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల రాజకీయాలకు కీలక ఘట్టంగా భావిస్తున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలను స్వీకరించారు. చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల వాతావరణం రాష్ట్రవ్యాప్తంగా వేడెక్కింది. నామినేషన్ల చివరి రోజున పట్టణాలు, మున్సిపాలిటీ కార్యాలయాలు రాజకీయ కార్యకర్తలు, అభ్యర్థులతో కిటకిటలాడాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున బరిలోకి దిగారు. స్థానిక సమస్యలే ప్రధాన అస్త్రంగా అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల దాఖలుతో రాజకీయ సమీకరణాలు స్పష్టమవుతున్నాయి. నామినేషన్ల...