Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కేసీఆర్‌కు నోటీసులు.. స్పందించిన కేటీఆర్

Author
Posted By STAR TRINETHRAM
| 29 Jan 2026, 01:02 PM | Politics
కేసీఆర్‌కు నోటీసులు.. స్పందించిన కేటీఆర్

తెలంగాణకు రూపశిల్పి కేసీఆర్


విచారణల పేరుతో కక్షసాధింపు


ఇది విచారణ కాదు.. ప్రతీకార రాజకీయం


: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్


స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: చావునోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో- తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన నాయకుడిని లక్ష్యంగా చేసుకుని ఇప్పుడు విచారణల పేరుతో వేధింపులకు పాల్పడటం దుర్మార్గమని విమర్శించారు.


తెలంగాణను పదేళ్ల పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు. సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకున్నారని తెలిపారు. సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి చారిత్రక కార్యక్రమాలతో తెలంగాణ రూపురేఖలను మార్చారని అన్నారు. రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు వంటి సంక్షేమ పథకాల ద్వారా రైతులు, పేదలు, దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప విజనరీ కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి నాయకుడిపై ఇప్పుడు నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని కేటీఆర్ ఆరోపించారు. అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైన ఈ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విచారణల నాటకాన్ని మొదలుపెట్టిందని విమర్శించారు.


తమ పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్‌కు నోటీసులు ఇస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఇది విచారణ కాదని, ఇది ప్రతీకార రాజకీయమని, ఇది న్యాయం కాదని, పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో సాగుతున్న చర్య అని ఆరోపించారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపునే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడని కేటీఆర్ స్పష్టం చేశారు. నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయడం ఎవరి వల్లా కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చరిత్రలో నిలిచే నాయకత్వాన్ని రాజకీయ వేధింపులతో దెబ్బతీయలేరని వ్యాఖ్యానించారు.


ఫోన్ ట్యాపింగ్ కేసును సాకుగా చేసుకుని కేసీఆర్ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్యంలో విచారణలు ఉండొచ్చుగానీ, అవి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని కేటీఆర్ అన్నారు. కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వం తన రాజకీయ అజెండా కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు, ప్రజల తీర్పుతోనే రాస్తారని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


ALSO READ: Mallu Bhatti Vikramarka: అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని త్యాగం చేయం

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: