కేసీఆర్‌కు నోటీసులు.. స్పందించిన కేటీఆర్

తెలంగాణకు రూపశిల్పి కేసీఆర్ విచారణల పేరుతో కక్షసాధింపు ఇది విచారణ కాదు.. ప్రతీకార రాజకీయం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: చావునోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో- తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన నాయకుడిని లక్ష్యంగా చేసుకుని ఇప్పుడు విచారణల పేరుతో వేధింపులకు పాల్పడటం దుర్మార్గమని...