Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Telangana: కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కవిత స్పందన

Author
Posted By STAR TRINETHRAM
| 29 Jan 2026, 12:39 PM | Politics
Telangana: కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కవిత స్పందన

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి రాజకీయ వేడి పెరిగింది. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం ఇప్పటికే చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ ఉద్దేశమే ఉందని, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన కవిత.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అసలు సీరియస్‌గా జరగడం లేదని విమర్శించారు. కేసును త్వరగా ముగించాల్సిన బదులు ప్రభుత్వం దీనిని రోజువారీ సీరియల్‌లా కొనసాగిస్తోందని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ వ్యవహారాన్ని పదేపదే తెరపైకి తీసుకొస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

ఫోన్ ట్యాపింగ్ వంటి చర్యలు తప్పేనని కవిత స్పష్టం చేశారు. అలాంటి వ్యవహారాలను ఎవరూ సమర్థించరని ఆమె అన్నారు. అయితే, ఈ కేసులో నిజంగా నేరస్థులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. బాధ్యులను శిక్షించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే కేసును సాగదీస్తున్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇక ఈ కేసును ఇంకెన్నాళ్లు ఇలాగే లాగుతారో చూడాలని కవిత ఎద్దేవా చేశారు. ప్రజల ముందు నిజాలు పెట్టకుండా, రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఈ విచారణ సాగుతోందని ఆమె ఆరోపించారు. ఇది న్యాయ ప్రక్రియ కంటే రాజకీయ డ్రామాగా మారుతోందని అన్నారు.

ఇవి కూడా చదవండి

అంతకుముందు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఇది నిజమైన విచారణ కాదని, పూర్తిగా ప్రతీకార రాజకీయమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరిట బీఆర్‌ఎస్ నేతలను వేధించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. అలాంటి నాయకుడిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

ALSO READ: BREAKING: షాక్ ఇచ్చిన బంగారం ధరలు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: