Telangana: కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కవిత స్పందన

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి రాజకీయ వేడి పెరిగింది. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం ఇప్పటికే చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ ఉద్దేశమే ఉందని, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన కవిత.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అసలు సీరియస్‌గా జరగడం లేదని విమర్శించారు. కేసును త్వరగా ముగించాల్సిన బదులు ప్రభుత్వం దీనిని రోజువారీ...