Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Payal Ghosh: ఛాన్స్ దొరకాలే గానీ ప్రభాస్‌ను వదిలేదే లేదు

Author
Posted By STAR TRINETHRAM
| 28 Jan 2026, 07:42 PM | Entertainment
Payal Ghosh: ఛాన్స్ దొరకాలే గానీ ప్రభాస్‌ను వదిలేదే లేదు

Payal Ghosh: బాహుబలి సిరీస్‌తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా దేశం దాటింది. అంతవరకూ టాలీవుడ్ స్టార్‌గా ఉన్న ప్రభాస్.. ఆ సినిమాల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. విదేశాల్లో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. ఆ సమయంలో నుంచే సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు, హీరోయిన్లు కూడా ప్రభాస్‌పై తమ అభిమానాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా మరో హీరోయిన్ ప్రభాస్‌పై తన మనసులోని మాట చెప్పడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసిన నటి పాయల్ ఘోష్.. ఇటీవల ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ప్రభాస్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమాలపై ఉన్న ఆసక్తితో తొలుత డాక్యుమెంటరీలు, కెనడియన్ చిత్రాల్లో నటించిన పాయల్ ఘోష్, కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పక్కన పెట్టి కోల్‌కతా నుంచి ముంబైకి వెళ్లారు. అక్కడ యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటూ తన కలను సాకారం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయాణమే ఆమెకు దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన ‘ప్రయాణం’ సినిమాతో టాలీవుడ్‌లో తొలి అవకాశాన్ని అందించింది.

‘ప్రయాణం’ సినిమా తర్వాత పాయల్ ఘోష్‌కు వరుసగా అవకాశాలు వచ్చాయి. ‘మిస్టర్ రాస్కెల్’, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘ఊసరవెల్లి’లో తమన్నా స్నేహితురాలిగా నటించి మంచి పేరు సంపాదించారు. ఆ సినిమాతో ఆమెకు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానం లభించింది.

తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై కూడా పాయల్ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సినిమాల్లోకి రాకపోయి ఉంటే మంచి విద్యాసంస్థలో ప్రొఫెసర్‌గా పనిచేసేదాన్నని తెలిపారు. చదువుల్లో ఎప్పుడూ ముందుండేదాన్నని, కుటుంబ సభ్యులు తనను ఒక ప్రొఫెషనల్ కెరీర్‌లో చూడాలని ఆశించారని చెప్పారు. అయితే తనకు నటనపై ఉన్న మక్కువే చివరకు సినిమాల వైపు నడిపించిందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

కాలేజీ రోజుల్లో తనకు లభించిన అపారమైన అటెన్షన్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పాయల్ ఘోష్ చెప్పారు. అదే ధైర్యంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశానని పేర్కొన్నారు. ఇక ప్రస్తుత హీరోలలో తనకు అత్యంత ఇష్టమైన నటుడు ప్రభాస్ అని స్పష్టంగా చెప్పారు. ఆయనపై తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు, గాఢమైన క్రష్ కూడా ఉందని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

అవకాశం వస్తే ప్రభాస్‌తో డేటింగ్ చేయాలని తన మనసులో ఉందని పాయల్ ఘోష్ తెలిపారు. అయితే ఆ విషయం చెప్పేటప్పుడు ఆమె కొంత సంకోచం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రభాస్ వ్యక్తిత్వం, ఆయన సింప్లిసిటీ, స్టార్‌డమ్ ఉన్నా నేలమీదే ఉండే స్వభావమే తనను ఎక్కువగా ఆకట్టుకుందని ఆమె చెప్పుకొచ్చారు.

కెరీర్ పరంగా చూస్తే.. 2009లో విడుదలైన ‘ప్రయాణం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ ఘోష్, ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘పటేల్ కీ పంజాబీ షాదీ’, ‘కోయి జానే నా’ వంటి సినిమాల్లో నటించారు. 2021 తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రభాస్‌పై ఆమె చేసిన తాజా వ్యాఖ్యలతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు.

ALSO READ: PM Kisan: 30 లక్షల మంది రైతుల పేర్లు తొలగింపు.. లిస్ట్‌లో పేరు చెక్ చేసుకోండిలా!

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: