Payal Ghosh: ఛాన్స్ దొరకాలే గానీ ప్రభాస్‌ను వదిలేదే లేదు

Payal Ghosh: బాహుబలి సిరీస్‌తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా దేశం దాటింది. అంతవరకూ టాలీవుడ్ స్టార్‌గా ఉన్న ప్రభాస్.. ఆ సినిమాల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. విదేశాల్లో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. ఆ సమయంలో నుంచే సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు, హీరోయిన్లు కూడా ప్రభాస్‌పై తమ అభిమానాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో హీరోయిన్ ప్రభాస్‌పై తన మనసులోని మాట చెప్పడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసిన నటి పాయల్ ఘోష్.....