Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Harish Rao's comments: తెలంగాణలో కొత్త స్కామ్ ఆరోపణలు

Author
Posted By STAR TRINETHRAM
| 28 Jan 2026, 01:46 PM | Politics
Harish Rao's comments: తెలంగాణలో కొత్త స్కామ్ ఆరోపణలు

కాంగ్రెస్‌పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

లాటరీ విధానం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్న

మద్యం ప్రభుత్వమా? రైతు ప్రభుత్వమా?: హరీశ్ రావు ప్రశ్న

Harish Rao's comments: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఓ భారీ స్కామ్ జరుగుతోందని ఆరోపిస్తూ అబ్కారీ శాఖ కేంద్రంగా అవినీతి దందా సాగుతోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యనేతలు, మంత్రుల కోటాల పేరిట మైక్రో బెవరేజెస్ అనుమతుల విషయంలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని హరీశ్ రావు మీడియా చిట్ చాట్‌లో ఆరోపణలు గుప్పించారు. ఈ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

ఎక్సైజ్ శాఖలో మైక్రో బెవరేజెస్ అనుమతుల కోసం మొత్తం 110 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం చెబుతోందని హరీశ్ రావు తెలిపారు. అయితే తొలిదశలో 25 అనుమతులు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారని అన్నారు. ఈ 25 అనుమతుల్లో మంత్రి కోటా కింద 4, మరో కీలక నేత కోటా కింద 21 మైక్రో బెవరేజెస్‌ను ముందుగానే ఎంపిక చేసుకున్నారని ఆరోపించారు. ఇది పూర్తిగా పారదర్శకతకు విరుద్ధమని, ప్రజలను మభ్యపెట్టే చర్యగా ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవలి కాలంలో ఒక ముఖ్యనేతకు తోడుగా, నీడలా తిరుగుతున్న వ్యక్తి ఇంట్లోనే ఉంటున్నాడని, ఈ విషయమై ఇప్పటికే వార్తలు కూడా వచ్చినట్టు హరీశ్ రావు పేర్కొన్నారు. కార్లు నేరుగా ఆ ముఖ్యనేత ఇంట్లోకి వెళ్లడం, తిరుపతి పర్యటనలో కూడా ఆ వ్యక్తి వెంటే ఉండటం వంటి ఉదాహరణలు చూపుతూ, వెనుక తెరల లావాదేవీలకు ఇవి నిదర్శనాలని ఆరోపించారు. ఈ వ్యవహారం అంతా ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

ఒక్కో బ్రేవరీకి రూ.1.80 కోట్లుగా ధర నిర్ణయించారని, అందులో రూ.1.50 కోట్లు ముఖ్యనేతకు, మిగిలిన రూ.30 లక్షలు తోడు నీడగా ఉన్న వ్యక్తికి వెళ్తున్నాయని హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం 21 బ్రేవరీలను ఒక వర్గం ఫైనల్ చేసుకుంటే, మరో 4 బ్రేవరీలను మంత్రి కోటాలో ఖరారు చేశారని అన్నారు. ఇది స్పష్టమైన అవినీతి వ్యవహారమని, రాష్ట్ర ప్రజలు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు.

మైక్రో బెవరేజెస్‌కు సంబంధించి లాటరీ విధానం ఎందుకు అమలు చేయలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. వైన్స్ షాపులకు లాటరీ తీసినప్పుడు, 110 దరఖాస్తులు వచ్చిన ఈ అనుమతులకు ఎందుకు లాటరీ తీయలేదని నిలదీశారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా లిక్కర్ సరఫరా సంస్థలకు రూ.4500 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, వాటిలో కొన్ని 16 నెలలుగా చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15 రోజుల్లోనే చెల్లింపులు జరిగేవని గుర్తు చేసిన హరీశ్ రావు.. ప్రస్తుతం బకాయిల కారణంగా సరఫరా నిలిచిపోయి అనేక వైన్ షాపుల్లో మద్యం అందుబాటులో లేకుండా పోతోందని అన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలు కూడా సరఫరా నిలిపివేస్తామని లేఖలు రాసిన పరిస్థితి ఉందని చెప్పారు. వాటాల పంపకాల్లో తేడాలే ఈ సంక్షోభానికి కారణమని ఆయన విమర్శించారు.

ఇప్పటికే హాలోగ్రామ్ టెండర్ల విషయంలో కూడా ముఖ్యనేతల బంధువులకే లాభం చేకూరేలా వ్యవహరించారని ఆరోపించిన హరీశ్ రావు, బీర్ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా సింగూరు డ్యాం మరమ్మతుల పేరిట రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించి వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం లేదని, అదే జిల్లాలోని బీర్ కంపెనీలకు మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా నీరు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు.

ఇది మద్యం తయారీదారుల ప్రభుత్వమా? లేక రైతుల ప్రభుత్వమా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. అబ్కారీ శాఖ స్పెషల్ సీఎస్ స్వయంగా సంగారెడ్డి వెళ్లి నీటిపారుదల అధికారులతో సమావేశమై రైతులకు నీరు ఆపి బీర్ కంపెనీలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారన్న ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ALSO READ: Telangana: పార్టీలకు ఈసీ బిగ్ షాక్

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: