HomeTELANGANARaja Prabhakar: కవితపై ఆరోపణలు చేస్తే ఊరుకోం..ఆర్ఎస్ ప్రవీణ్ క్షమాపణ చెప్పాలి!

Raja Prabhakar: కవితపై ఆరోపణలు చేస్తే ఊరుకోం..ఆర్ఎస్ ప్రవీణ్ క్షమాపణ చెప్పాలి!

📰 Generate e-Paper Clip

తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవితపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలను ఆ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజా ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. కవితపై నిరాధార ఆరోపణలు చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంటనే క్షమాపణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రాజా ప్రభాకర్ మాట్లాడుతూ.. కవితమ్మను విమర్శించే ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకసారి తన గతాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. గతంలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన ప్రవీణ్ కుమార్ నేడు అదే కేసీఆర్‌కు వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. అవినీతిని ప్రశ్నించే కల్వకుంట్ల కవితక్కను విమర్శించే నైతిక అర్హత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు.

అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని వెంటనే కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కవితమ్మపై వ్యక్తిగతంగా, రాజకీయంగా అనవసర ఆరోపణలు చేయడం సరికాదని రాజా ప్రభాకర్ పేర్కొన్నారు. కవితపై చేస్తున్న విమర్శలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కవితను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు చేసే ముందు నాయకులు తమ గత రాజకీయ వైఖరిని కూడా గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular