HomePOLITICALTRS:రాజప్రభాకర్ నాయకత్వం భేష్..నేతల కితాబు

TRS:రాజప్రభాకర్ నాయకత్వం భేష్..నేతల కితాబు

📰 Generate e-Paper Clip

తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి రాజ ప్రభాకర్ నాయకత్వంలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఆయన చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, యువతను ఆకట్టుకునే నాయకత్వ శైలి పట్ల నియోజకవర్గంలో విశేష స్పందన లభిస్తోంది.

ఇందులో భాగంగా తాజాగా మద్దూరు మండలంలోని పలు గ్రామాల నూతన కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించి, రాజప్రభాకర్ పట్ల తమ పూర్తి మద్దతును ప్రకటించారు.

ఈ సందర్భంగా రాజప్రభాకర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, ప్రజల సమస్యల పరిష్కారానికై ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సన్మాన మరియు అభినందన కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular