HomeINTERNATIONALUS Midterm Elections:డెమోక్రాట్ల దూకుడు..సెనేట్‌లో రెండు స్థానాలు కైవసం..రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ!

US Midterm Elections:డెమోక్రాట్ల దూకుడు..సెనేట్‌లో రెండు స్థానాలు కైవసం..రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ!

📰 Generate e-Paper Clip

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ జోరు కొనసాగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కీలక పరీక్షగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. ఇప్పటికే సెనేట్‌లో రెండు స్థానాలను డెమోక్రాట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రతినిధుల సభలోనూ రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న పలు నియోజకవర్గాల్లో డెమోక్రటిక్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.

అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియడంతో ఫలితాలు వెలువడుతున్నాయి. వచ్చే రెండేళ్ల పాటు అమెరికా కాంగ్రెస్‌పై ఎవరి ఆధిపత్యం ఉండబోతోందనేది ఈ ఎన్నికలు నిర్ణయించనున్నాయి. నార్త్ కరోలినా మాజీ గవర్నర్ రాయ్ కూపర్.. రిపబ్లికన్ అభ్యర్థి మైఖేల్ వాట్లీపై విజయం సాధించి సెనేట్ స్థానాన్ని డెమోక్రాట్లకు దక్కేలా చేశారు. దీంతో రిపబ్లికన్ల నుంచి నాలుగు స్థానాలను అదనంగా గెలుచుకుంటే సెనేట్‌లో మెజార్టీ సాధించే దిశగా డెమోక్రాట్లు ముందుకు సాగుతున్నారు.

జార్జియా రాష్ట్రంలోనూ రిపబ్లికన్ అభ్యర్థులపై డెమోక్రటిక్ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తుండటంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, 100 మంది సభ్యులున్న సెనేట్‌లో 35 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 36 రాష్ట్రాల్లో గవర్నర్ పదవులకు కూడా పోలింగ్ నిర్వహించారు. హౌస్‌లో మూడు స్థానాలు అదనంగా గెలుచుకుంటే డెమోక్రాట్లు మెజార్టీ సాధించే అవకాశం ఉంది. సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్ల నుంచి నికరంగా నాలుగు స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లకు 53, డెమోక్రాట్లకు 47 స్థానాల బలం ఉంది. అయితే కాన్సాస్, టెక్సాస్, అయోవా, ఒహియో, అలాస్కా వంటి సంప్రదాయకంగా రిపబ్లికన్లకు పట్టున్న రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు గట్టి పోటీ ఇస్తున్నారు.

ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోతే ముఖ్యంగా ట్రంప్ ఫలితాలను అంగీకరిస్తారా లేదా అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. మంగళవారం ఓటర్లను ఉద్దేశించి టీవీ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్.. వలస విధానాలు, ఇరాన్‌తో యుద్ధం, సుంకాల విధానం ద్వారా అమెరికాను తిరిగి బలోపేతం చేశామని పేర్కొన్నారు.

మొత్తంగా ఈ ఎన్నికలు ట్రంప్ రెండేళ్ల పాలనపై ప్రజల తీర్పుగా భావిస్తున్నారు. డెమోక్రాట్లు రెండు సభల్లోనూ ఆధిపత్యం సాధిస్తే ట్రంప్ ప్రభుత్వానికి కీలక నిర్ణయాల అమలులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular