US Midterm Elections:డెమోక్రాట్ల దూకుడు..సెనేట్‌లో రెండు స్థానాలు కైవసం..రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ!
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ జోరు కొనసాగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కీలక పరీక్షగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. ఇప్పటికే సెనేట్‌లో రెండు స్థానాలను డెమోక్రాట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రతినిధుల సభలోనూ రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న పలు నియోజకవర్గాల్లో డెమోక్రటిక్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియడంతో ఫలితాలు వెలువడుతున్నాయి. వచ్చే రెండేళ్ల పాటు అమెరికా కాంగ్రెస్‌పై ఎవరి ఆధిపత్యం ఉండబోతోందనేది ఈ ఎన్నికలు నిర్ణయించనున్నాయి. నార్త్ కరోలినా మాజీ...