HomeNATIONALRahul Gandhi: బహిరంగ చర్చకు సిద్ధం..మోదీకి రాహుల్ సవాల్‌!

Rahul Gandhi: బహిరంగ చర్చకు సిద్ధం..మోదీకి రాహుల్ సవాల్‌!

📰 Generate e-Paper Clip

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటుగా బదులిచ్చారు. విదేశీ సహకారంతోనే మీరు ప్రధాని అయ్యారని ఇప్పటికీ అదే మద్దతుతో అధికారంలో కొనసాగుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంaగ చర్చకు సిద్ధమా అంటూ మోదీకి సవాల్ విసిరారు.

ఎక్స్‌లో పోస్టు చేసిన రాహుల్.. దేశ ప్రజలతో అబద్ధాలు చెప్పడం ఆపండి. విదేశీ సాయంతోనే మీరు ప్రధాని అయ్యారు. ఇప్పటికీ విదేశీ సహకారంతోనే పదవిలో కొనసాగుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విదేశీయుల నియంత్రణలో నడుస్తోంది…. విదేశీ సోషల్ మీడియా కూడా మీకు పూర్తిగా మద్దతు ఇస్తోంది అని ఆరోపించారు.

ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు రండి.. మీకు ధైర్యం ఉంటే ముందుకు రండి. అయితే నేను మీ గురించి తెలుసుకున్న విషయాలపై మీరు భయపడుతున్నారు కాబట్టి ఈ సవాల్‌ను స్వీకరించరని నాకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.

అంతకుముందు గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అబద్ధాలు, వదంతులు వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. దేశం  సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలోనే  కొన్ని శక్తులు అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నించాయని అన్నారు.

మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన ఈ తాజా విమర్శలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

RELATED ARTICLES

Most Popular