Rahul Gandhi: బహిరంగ చర్చకు సిద్ధం..మోదీకి రాహుల్ సవాల్‌!

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటుగా బదులిచ్చారు. విదేశీ సహకారంతోనే మీరు ప్రధాని అయ్యారని ఇప్పటికీ అదే మద్దతుతో అధికారంలో కొనసాగుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంaగ చర్చకు సిద్ధమా అంటూ మోదీకి సవాల్ విసిరారు. ఎక్స్‌లో పోస్టు చేసిన రాహుల్.. దేశ ప్రజలతో అబద్ధాలు చెప్పడం ఆపండి. విదేశీ సాయంతోనే మీరు ప్రధాని అయ్యారు. ఇప్పటికీ విదేశీ సహకారంతోనే పదవిలో కొనసాగుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విదేశీయుల...