Homeక్రైమ్Sangem Police: వరుస బ్యాటరీ దొంగతనాలకు చెక్

Sangem Police: వరుస బ్యాటరీ దొంగతనాలకు చెక్

📰 Generate e-Paper Clip

Sangem Police: వరంగల్ జిల్లాలో గత వారం రోజులుగా వరుసగా జరుగుతున్న బ్యాటరీ దొంగతనాలకు సంగెం పోలీసులు చెక్ పెట్టారు. సంగెం, మామునూర్, పర్వతగిరి, వర్ధన్నపేట ప్రాంతాల్లో స్వర్గ రథాలకు సంబంధించిన బ్యాటరీలు మాయమవుతున్న ఘటనలు స్థానికంగా ఆందోళన కలిగించగా, పోలీసులు వేగంగా స్పందించి నిందితులను అరెస్ట్ చేశారు. మే 9, 10 తేదీల్లో గావిచర్ల, రామచంద్రపురం, తిమ్మాపూర్ గ్రామాల్లో చోటుచేసుకున్న స్వర్గ రథం బ్యాటరీ దొంగతనాలపై కేసులు నమోదు చేసిన సంగెం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

పర్వతగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్ ఆదేశాల మేరకు సంగెం ఎస్సై వంశీకృష్ణ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. హెడ్ కానిస్టేబుళ్లు సంతోష్, బాబు, కానిస్టేబుళ్లు శ్రవణ్, నవీన్ కిషోర్, వీరన్నలతో కలిసి ప్రత్యేక నిఘా కొనసాగించారు. నమ్మదగిన సమాచారం ఆధారంగా తిమ్మాపూర్ సబ్‌స్టేషన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు అనుమానితులు స్కూటీపై 6 బ్యాటరీలను తరలిస్తూ కనిపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల విచారణలో గూడూరు అరవింద్, హింగిరి బన్నీ అలియాస్ తీగరాజుపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మే 9, 10 తేదీల్లో మమ్నూర్, పర్వతగిరి, ఉప్పరపల్లి, గావిచర్ల, రామచంద్రపురం, తిమ్మాపూర్ ప్రాంతాల్లో స్వర్గ రథాలకు అమర్చిన బ్యాటరీలను దొంగిలించినట్లు వారు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. దొంగిలించిన బ్యాటరీలను వరంగల్‌లో విక్రయించేందుకు తీసుకెళ్తున్న సమయంలోనే వారిని పట్టుకున్నట్లు వెల్లడించారు.

నిందితుల వద్ద నుంచి 6 బ్యాటరీలతో పాటు దొంగతనాలకు ఉపయోగించిన స్కూటీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వరుస దొంగతనాల కేసులను వేగంగా ఛేదించిన సంగెం పోలీస్ సిబ్బందిని పర్వతగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్ అభినందించారు. స్థానిక ప్రజలు కూడా పోలీసులు వేగంగా స్పందించి నిందితులను పట్టుకోవడంపై ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: Natural Gas: LPG, CNG, PNG, LNG మధ్య తేడా ఏంటో తెలుసా?

RELATED ARTICLES

Most Popular