Sangem Police: వరుస బ్యాటరీ దొంగతనాలకు చెక్
Sangem Police: వరంగల్ జిల్లాలో గత వారం రోజులుగా వరుసగా జరుగుతున్న బ్యాటరీ దొంగతనాలకు సంగెం పోలీసులు చెక్ పెట్టారు. సంగెం, మామునూర్, పర్వతగిరి, వర్ధన్నపేట ప్రాంతాల్లో స్వర్గ రథాలకు సంబంధించిన బ్యాటరీలు మాయమవుతున్న ఘటనలు స్థానికంగా ఆందోళన కలిగించగా, పోలీసులు వేగంగా స్పందించి నిందితులను అరెస్ట్ చేశారు. మే 9, 10 తేదీల్లో గావిచర్ల, రామచంద్రపురం, తిమ్మాపూర్ గ్రామాల్లో చోటుచేసుకున్న స్వర్గ రథం బ్యాటరీ దొంగతనాలపై కేసులు నమోదు చేసిన సంగెం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్...