STAR TRINETHRAM
రిపోర్టర్
మీ ప్రాంత వార్తల కోసం లొకేషన్ ఆన్ చేయండి
Breaking
⚡ BREAKING

Khairatabad: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

Breaking
⚡ BREAKING

CM Revanth Reddy: టెక్నాలజీతో పాలన.. తెలంగాణ కేబినెట్ పూర్తిగా డిజిటల్!

Breaking
⚡ BREAKING

CM Revanth Reddy: ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రానికే ఆదర్శం

Breaking
⚡ BREAKING

Adilabad: తెలంగాణ ఏవియేషన్ హబ్‌గా ఎదుగుతుందా?.. ఆదిలాబాద్‌కు వాయుసేన శిక్షణ కేంద్రం?

Breaking
⚡ BREAKING

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు

ఫ్లిప్ న్యూస్
ప్రపంచం (World)
క్రీడలు (Sports)
ఈ-పేపర్
లైవ్ టీవీ
రీల్స్ / షార్ట్స్
🗳️ ELECTION LIVE
Manage

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

తెలంగాణ వార్తలు

అన్ని వార్తలు ×
Thumb
📍 Telangana

Khairatabad: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

12 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

CM Revanth Reddy: టెక్నాలజీతో పాలన.. తెలంగాణ కేబినెట్ పూర్తిగా డిజిటల్!

4 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

CM Revanth Reddy: ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రానికే ఆదర్శం

6 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Adilabad: తెలంగాణ ఏవియేషన్ హబ్‌గా ఎదుగుతుందా?.. ఆదిలాబాద్‌కు వాయుసేన శిక్షణ కేంద్రం?

15 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు

21 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ప్రారంభం.. అమరుల త్యాగాలను స్మరించిన సీఎం

21 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీ బస్సు ప్రయాణంలో భారీ మార్పు!

21 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త

21 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Andhra Pradesh

పవన్ కళ్యాణ్‌ను చూసి భయపడుతున్నారా? విమర్శలకు తెలంగాణ జనసేన కౌంటర్

21 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

తెలంగాణపై పాత వ్యాఖ్యల వివాదం మళ్లీ తెరపైకి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్

22 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Congress: రెండున్నరేళ్ల విధ్వంసం.. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీ పాలు!

19 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Telangana: తెలంగాణలోని మహిళలకు గుడ్ న్యూస్

27 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Kavitha: తెలంగాణలో కర్కోటకుడి పాలన

27 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Telangana Rastra Sena: కొత్త విప్లవం.. తెలంగాణలో కవిత కొత్త పార్టీ

28 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Kavitha: కొత్త పార్టీ గుబులు.. తెలంగాణ జాగృతిలోకి మాజీ ఎమ్మెల్యేల క్యూ..?

3 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Saleswaram Yatra: ప్రకృతి ఒడిలో పరమశివుడు.. తెలంగాణ అమర్‌నాథ్ యాత్ర నేటి నుంచే ప్రారంభం!

22 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Budget 2026-27: రూ.3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

3 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Hanamkonda: తెలంగాణ డిజిటల్ కేబుల్ టీవీ అసోసియేషన్ అధ్యక్షుడిగా గుండ్ల శ్రీనివాస్

5 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

RevanthReddy: తెలంగాణ మావోయిస్టు స్టేట్ కమిటీ ముగింపు

15 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Congress Government: తెలంగాణ కాంగ్రెస్‌లో సూపర్ పవర్ రేవంత్ రెడ్డి

17 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Special Focus

తెలంగాణ రాజకీయాల్లో అరుదైన స్నేహబంధం

17 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Bhatti Vikramarka: ప్రపంచ దేశాలతో పోటి పడే విధంగా తెలంగాణ ఎదగాలి

24 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

History: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక ‘మేడారం’

25 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

Harish Rao's comments: తెలంగాణలో కొత్త స్కామ్ ఆరోపణలు

26 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Politics

తెలంగాణ విపత్తు నిర్వహణపై ప్రభుత్వ దృష్టి

26 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Mahesh Kumar Goud: తెలంగాణలో బీజేపీకి అధికారం అసాధ్యం

27 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Andhra Pradesh

ఏపీ-తెలంగాణ మధ్య జల వివాదం.. గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక వ్యాఖ్యలు

28 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Thumb
📍 Telangana

Governor Jishnu Dev Verma: దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ

28 రోజుల క్రితం 0 పూర్తి వార్త »
Telangana News
Reporter
STAR TRINETHRAM
12 రోజుల క్రితం
Logo

Khairatabad: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

Khairatabad: ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇంద్రనగర్, జూబ్లీహిల్స్ డివిజన్ బస్తీల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 9 రోజుల బతుకమ్మ సంబరాలు శనివారం ప్రారంభమయ్యాయి. వాడవాడలా, బస్తీబస్తీలో పండుగ వాతావరణం నెలకొనగా, స్థానిక మహిళలు, బస్తీవాసులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేలా నిర్వహించారు. ఈ సందర్భంగా 9 రోజుల బతుకమ్మ వేడుకల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఇన్‌చార్జ్‌లు గీత గౌడ్, డీకొండ కవిత, సోనిక చామకూర బస్తీవాసులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో పండుగకు ప్రత్యేక శోభ...

Khairatabad: ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇంద్రనగర్, జూబ్లీహిల్స్ డివిజన్ బస్తీల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 9 రోజుల బతుకమ్మ సంబరాలు శనివారం ప్రారంభమయ్యాయి. వాడవాడలా, బస్తీబస్తీలో పండుగ వాతావరణం నెలకొనగా, స్థానిక మహిళలు, బస్తీవాసులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేలా నిర్వహించారు. ఈ సందర్భంగా 9 రోజుల బతుకమ్మ వేడుకల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఇన్‌చార్జ్‌లు గీత గౌడ్, డీకొండ కవిత, సోనిక చామకూర బస్తీవాసులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో పండుగకు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. రానున్న రోజుల్లోనూ నియోజకవర్గంలోని వివిధ బస్తీల్లో బతుకమ్మ వేడుకలను కొనసాగించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ALSO READ: Nagaram Division: ఎంగిలి పూల బతుకమ్మ సంబరాల్లో ఏనుగు సుదర్శన్ రెడ్డి
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
4 రోజుల క్రితం
Logo

CM Revanth Reddy: టెక్నాలజీతో పాలన.. తెలంగాణ కేబినెట్ పూర్తిగా డిజిటల్!

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను ఇకపై పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ డిజిటల్ కేబినెట్ వ్యవస్థ అమలుకు అధికారిక ఆమోదం లభించింది. రాష్ట్ర పరిపాలనను మరింత ఆధునికీకరించడంతో పాటు నిర్ణయాల ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్ కేబినెట్ అమలులో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు...

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను ఇకపై పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ డిజిటల్ కేబినెట్ వ్యవస్థ అమలుకు అధికారిక ఆమోదం లభించింది. రాష్ట్ర పరిపాలనను మరింత ఆధునికీకరించడంతో పాటు నిర్ణయాల ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్ కేబినెట్ అమలులో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సభ్యులందరికీ ప్రత్యేక ట్యాబ్‌లను అందజేశారు. ఇకపై కేబినెట్ సమావేశాలకు సంబంధించిన అన్ని ఎజెండాలు, శాఖల నివేదికలు, ప్రతిపాదనలు, నిర్ణయాలు, అనుబంధ పత్రాలు, కార్యాచరణ వివరాలు పూర్తిగా డిజిటల్ రూపంలోనే మంత్రులకు అందుబాటులో ఉండనున్నాయి. దీంతో భారీ స్థాయిలో కాగితాల వినియోగానికి స్వస్తి పలకనున్నట్లు అధికారులు తెలిపారు. డిజిటల్ కేబినెట్ వ్యవస్థ పనితీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కొత్త విధానం ద్వారా నిర్ణయాల ప్రక్రియ మరింత వేగంగా సాగడంతో పాటు శాఖల మధ్య సమన్వయం కూడా మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా కీలక ప్రభుత్వ సమాచారాన్ని సురక్షితంగా భద్రపరచడం, అవసరమైనప్పుడు తక్షణమే అందుబాటులోకి తీసుకురావడం కూడా సులభమవుతుందని అధికారులు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పారదర్శక పరిపాలనను ప్రోత్సహించడం, సాంకేతికత ఆధారిత పాలనను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పేపర్‌లెస్ గవర్నెన్స్ వైపు తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగు రాష్ట్ర పరిపాలనలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ప్రభుత్వ వ్యవస్థలో డిజిటల్ మార్పులకు ఇది నాంది పలుకుతుందని, భవిష్యత్తులో మరిన్ని సేవలను కూడా పూర్తిగా డిజిటల్ విధానంలోకి తీసుకురావడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ALSO READ: Viral News: అలా ఎలా దూరావ్ నాగన్న..
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
🗳️ ELECTION LIVE
Manage

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది?

Telangana News
Reporter
STAR TRINETHRAM
6 రోజుల క్రితం
Logo

CM Revanth Reddy: ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రానికే ఆదర్శం

CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామం తెలంగాణ విద్యా రంగ చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించి రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆరుట్లలో ప్రారంభమైన విద్యా సంస్కరణల ప్రయాణం ఒక గ్రామానికే పరిమితం కాకుండా మొత్తం తెలంగాణ విద్యా వ్యవస్థకు కొత్త దిశను చూపించబోతుందని అన్నారు. తెలంగాణ భవిష్యత్తు కేవలం ఆధునిక భవనాల్లో, ఆకర్షణీయమైన నిర్మాణాల్లో...

CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామం తెలంగాణ విద్యా రంగ చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించి రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆరుట్లలో ప్రారంభమైన విద్యా సంస్కరణల ప్రయాణం ఒక గ్రామానికే పరిమితం కాకుండా మొత్తం తెలంగాణ విద్యా వ్యవస్థకు కొత్త దిశను చూపించబోతుందని అన్నారు. తెలంగాణ భవిష్యత్తు కేవలం ఆధునిక భవనాల్లో, ఆకర్షణీయమైన నిర్మాణాల్లో లేదని, విద్యార్థులు చదువుకునే తరగతి గదుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు నిర్మితమవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యా కమిషన్ ఇచ్చిన సూచనలు, సిఫార్సులను ఆధారంగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ప్రభుత్వ విద్యను మరింత నాణ్యంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేపట్టిన చర్యలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో ఇప్పటికే 1,814 మంది విద్యార్థులు చేరడం ప్రభుత్వ విద్యపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల కోసం పోటీ ఏర్పడి, ‘నో అడ్మిషన్’ బోర్డు ఏర్పాటు చేసే పరిస్థితి రావడం విద్యా రంగంలో సానుకూల మార్పులకు సంకేతమని అభిప్రాయపడ్డారు. ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, గ్రామ ప్రజలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించాలంటే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి అత్యంత కీలకమని పేర్కొన్నారు. మట్టిలో దాగి ఉన్న మాణిక్యాలను వెలికి తీయాలంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావును గుర్తు చేసిన సీఎం, తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం పూర్తి చేశానని తెలిపారు. ప్రభుత్వ బడిలో చదివిన ఒక విద్యార్థి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం విద్యా శక్తికి నిదర్శనమని అన్నారు. నేటి విద్యార్థులు కూడా కష్టపడి చదివి భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల్లో నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు, ఆధునిక విద్యా కిట్లు అందించే కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి విద్య, నైపుణ్యాలు అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం ద్వారా తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆరుట్ల గ్రామంలో ప్రారంభమైన ఈ విద్యా విప్లవం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యకు కొత్త ఊపునిస్తుందని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రజల మొదటి ఎంపికగా మారేలా చర్యలు కొనసాగుతాయని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యా రంగంలో ఆరుట్ల మోడల్ ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందని సభలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడ్డారు. ALSO READ: Traffic Rules: బైక్‌పై ఇవి పెట్టుకుంటే భారీగా జరిమానా
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
15 రోజుల క్రితం
Logo

Adilabad: తెలంగాణ ఏవియేషన్ హబ్‌గా ఎదుగుతుందా?.. ఆదిలాబాద్‌కు వాయుసేన శిక్షణ కేంద్రం?

Adilabad: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా త్వరలోనే భారత వాయుసేన శిక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన హకీంపేట, దుండిగల్ కేంద్రాల్లో కొనసాగుతున్న భారత వాయుసేన పైలట్ శిక్షణ కార్యక్రమాలకు అనుబంధంగా ఆదిలాబాద్‌లో కొత్త శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమలైతే దేశ రక్షణ రంగంలో ఆదిలాబాద్ ప్రత్యేక గుర్తింపు పొందే జిల్లాల జాబితాలో చేరనుంది. ప్రస్తుతం భారత వాయుసేన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను నడిపే పైలట్లకు హకీంపేట, దుండిగల్ ప్రాంతాల్లో శిక్షణ అందిస్తోంది. అయితే హైదరాబాద్ నగరంలో విమాన...

Adilabad: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా త్వరలోనే భారత వాయుసేన శిక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన హకీంపేట, దుండిగల్ కేంద్రాల్లో కొనసాగుతున్న భారత వాయుసేన పైలట్ శిక్షణ కార్యక్రమాలకు అనుబంధంగా ఆదిలాబాద్‌లో కొత్త శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమలైతే దేశ రక్షణ రంగంలో ఆదిలాబాద్ ప్రత్యేక గుర్తింపు పొందే జిల్లాల జాబితాలో చేరనుంది. ప్రస్తుతం భారత వాయుసేన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను నడిపే పైలట్లకు హకీంపేట, దుండిగల్ ప్రాంతాల్లో శిక్షణ అందిస్తోంది. అయితే హైదరాబాద్ నగరంలో విమాన రాకపోకలు గణనీయంగా పెరగడంతో శిక్షణ కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, బేగంపేట విమానాశ్రయాల పరిధిలో పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్ కారణంగా ట్రైనీ పైలట్లకు అవసరమైన ఫ్లయింగ్ అవర్స్ కేటాయించడం సవాలుగా మారింది. రోజుకు పలుమార్లు శిక్షణ విమానాలు నడపాల్సి ఉండగా ట్రాఫిక్ ఒత్తిడి కారణంగా సమయపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ శిక్షణ కేంద్రాల అవసరం ఏర్పడింది. అందుకే అధికారులు ఆదిలాబాద్‌తో పాటు వరంగల్ జిల్లా మామునూరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాగపూర్, హైదరాబాద్ మధ్య వ్యూహాత్మకంగా ఉన్న ఆదిలాబాద్ భౌగోళికంగా అనుకూల ప్రాంతంగా భావిస్తున్నారు. కొత్త విమానాశ్రయం అభివృద్ధి ప్రణాళికలతో పాటు వాయుసేన అవసరాలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సివిల్ ఏవియేషన్ రంగానికి సంబంధించిన పైలట్ శిక్షణ కార్యకలాపాలను వరంగల్ జిల్లా మామునూరుకు విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బేగంపేట కేంద్రంగా శిక్షణ పొందుతున్న వందలాది మంది విద్యార్థులు తగిన ఫ్లయింగ్ అవర్స్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామునూరులో ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు శిక్షణ నాణ్యత కూడా మెరుగుపడే అవకాశం ఉంది. హకీంపేటలో సుమారు 1,852 ఎకరాలు, దుండిగల్‌లో 2 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ప్రస్తుతం శిక్షణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటిని పూర్తిగా తరలించడం కాకుండా అదనపు కేంద్రాలుగా ఆదిలాబాద్, మామునూరును అభివృద్ధి చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో శిక్షణ వ్యవస్థపై ఒత్తిడి తగ్గడమే కాకుండా భవిష్యత్తు అవసరాలను కూడా తీర్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రణాళికలు కార్యరూపం దాల్చితే తెలంగాణ రాష్ట్రం దేశ విమానయాన రంగంలో మరింత ప్రాధాన్యం సంపాదించనుంది. పైలట్ శిక్షణకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు అధిక ఫ్లయింగ్ అవర్స్ లభిస్తాయి. అదే సమయంలో పైలట్ లైసెన్సుల జారీ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ ఫ్లయింగ్ అకాడమీలు, ఏవియేషన్ శిక్షణ సంస్థలు కూడా ఈ ప్రాంతాల వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఆదిలాబాద్, మామునూరు ప్రాంతాలు భవిష్యత్తులో తెలంగాణ ఏవియేషన్ హబ్‌లుగా రూపుదిద్దుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ALSO READ: Women’s T20 World Cup 2026: అప్పుడే అన్ని లక్షల టిక్కెట్లు ఖతం!
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
21 రోజుల క్రితం
Logo

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటుతో సాధించిన పురోగతిని గుర్తు చేస్తూ భవిష్యత్తు దిశగా ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ సాధన వెనుక ఎన్నో సంవత్సరాల పోరాటం, ప్రజల ఆకాంక్షలు మరియు ఉద్యమకారుల త్యాగాలు ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ అనేక రంగాల్లో వేగంగా ఎదిగి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని ఆయన అభిప్రాయపడ్డారు. గత పదేళ్లలో సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో రాష్ట్రం గణనీయమైన...

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటుతో సాధించిన పురోగతిని గుర్తు చేస్తూ భవిష్యత్తు దిశగా ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ సాధన వెనుక ఎన్నో సంవత్సరాల పోరాటం, ప్రజల ఆకాంక్షలు మరియు ఉద్యమకారుల త్యాగాలు ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ అనేక రంగాల్లో వేగంగా ఎదిగి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని ఆయన అభిప్రాయపడ్డారు. గత పదేళ్లలో సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో రాష్ట్రం గణనీయమైన మార్పును చూసిందని ఆయన తెలిపారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, రైతు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర పురోగతికి బలమైన పునాది వేశాయని వివరించారు. ఇప్పటికే సాధించిన అభివృద్ధిని కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర స్వాభిమానాన్ని కాపాడుకోవడంలో సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పాలకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా రైతుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగ బలోపేతం విషయంలో మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. చివరిగా తెలంగాణ మరింత అభివృద్ధి సాధించి పచ్చని పంటలతో, సుభిక్ష జీవనంతో, అన్ని వర్గాల సంక్షేమంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ కేసీఆర్ తన సందేశాన్ని ముగించారు.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
21 రోజుల క్రితం
Logo

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ప్రారంభం.. అమరుల త్యాగాలను స్మరించిన సీఎం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల సేవలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. వారి త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. రాష్ట్ర నిర్మాణానికి వారు వేసిన బలమైన పునాదుల వల్లే తెలంగాణ నేడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన సందేశంలో రేవంత్ రెడ్డి జూన్ 2ను తెలంగాణ ఆత్మగౌరవానికి...

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల సేవలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. వారి త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. రాష్ట్ర నిర్మాణానికి వారు వేసిన బలమైన పునాదుల వల్లే తెలంగాణ నేడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన సందేశంలో రేవంత్ రెడ్డి జూన్ 2ను తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా అభివర్ణించారు. కోట్లాది మంది ప్రజల కలలు, ఉద్యమకారుల పోరాటాలు, యువత త్యాగాల సమ్మేళనమే తెలంగాణ రాష్ట్రం అని పేర్కొన్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రధాన వేడుకల్లో పాల్గొన్న సీఎం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రజాపాలన, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలపై ప్రభుత్వ కట్టుబాటును పునరుద్ఘాటించారు. ఈ వేడుకల్లో తెలంగాణ ఉద్యమంలో విశేష పాత్ర పోషించిన పలువురు ప్రముఖులను ప్రభుత్వం సత్కరించింది. అలాగే తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శనలు, కళా కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
21 రోజుల క్రితం
Logo

తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీ బస్సు ప్రయాణంలో భారీ మార్పు!

తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళలకు ప్రభుత్వం మరో సౌకర్యాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఆధార్ కార్డు చూపించి ప్రయాణిస్తున్న మహిళలు ఇకపై ప్రత్యేక స్మార్ట్ కార్డు ద్వారా ఉచిత టికెట్ పొందే అవకాశం కలగనుంది. ప్రస్తుతం ఈ పథకానికి అర్హులైన మహిళల వివరాల సేకరణ పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే వారికి ప్రత్యేక స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో ఉండనున్నాయి. కార్డులో మహిళల ఫోటో, ఆధార్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం చిప్ రూపంలో అనుసంధానం...

తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళలకు ప్రభుత్వం మరో సౌకర్యాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఆధార్ కార్డు చూపించి ప్రయాణిస్తున్న మహిళలు ఇకపై ప్రత్యేక స్మార్ట్ కార్డు ద్వారా ఉచిత టికెట్ పొందే అవకాశం కలగనుంది.

ప్రస్తుతం ఈ పథకానికి అర్హులైన మహిళల వివరాల సేకరణ పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే వారికి ప్రత్యేక స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఈ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో ఉండనున్నాయి. కార్డులో మహిళల ఫోటో, ఆధార్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం చిప్ రూపంలో అనుసంధానం చేయనున్నారు. దీంతో ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.

ముందుగా ఒక డిపో పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్డులను అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అక్కడ ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.

స్మార్ట్ కార్డుల తయారీకి అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి విడుదల చేసినట్లు తెలుస్తోంది. దీంతో కార్డుల తయారీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.

2023 డిసెంబర్‌లో ప్రారంభమైన మహాలక్ష్మి పథకం మహిళల నుంచి విశేష స్పందన పొందింది. ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం అనేక మార్గాల్లో మహిళా ప్రయాణికులే అధికంగా కనిపిస్తున్నారు.

స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
21 రోజుల క్రితం
Logo

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త

తెలంగాణలో సొంతిల్లు కల నెరవేర్చుకోవాలనుకుంటున్న పేద కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎవరూ గుడిసెల్లో జీవించకూడదనే ఉద్దేశంతో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా, తాజాగా మరో 2.5 లక్షల ఇళ్ల మంజూరు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే సెప్టెంబర్ 17న మరో లక్ష...

తెలంగాణలో సొంతిల్లు కల నెరవేర్చుకోవాలనుకుంటున్న పేద కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎవరూ గుడిసెల్లో జీవించకూడదనే ఉద్దేశంతో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని చెప్పారు.

ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా, తాజాగా మరో 2.5 లక్షల ఇళ్ల మంజూరు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే సెప్టెంబర్ 17న మరో లక్ష ఇళ్లకు గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

తండాలు, గూడేల్లో నివసించే ఆదివాసీ కుటుంబాలను గుర్తించి వారికి కూడా ఇళ్లను అందించే చర్యలు చేపడుతున్నామని సీఎం వివరించారు. ప్రతి కుటుంబానికి భద్రమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఈ సందర్భంగా రైతుల అంశాన్ని కూడా ప్రస్తావించిన సీఎం, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లు, జొన్నలు, మక్కలను కేంద్రం వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం సహకరించాలని సూచించారు.

జూన్ 15 నాటికి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయని పేర్కొన్న సీఎం, ఇప్పటివరకు 62 లక్షల క్వింటాళ్ల వడ్లు సేకరించినట్లు వెల్లడించారు. రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.

స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Andhra Pradesh News
Reporter
STAR TRINETHRAM
21 రోజుల క్రితం
Logo

పవన్ కళ్యాణ్‌ను చూసి భయపడుతున్నారా? విమర్శలకు తెలంగాణ జనసేన కౌంటర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ జనసేన నాయకులు ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుకునే స్థాయిలో ఎవరూ లేరని, ఆయన ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసే కొందరు రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. జనసేన నాయకుడు సాగర్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌ను పదేపదే విమర్శించడం వెనుక రాజకీయ భయం కనిపిస్తోందన్నారు. ఒక సినిమా నటుడు రాజకీయాల్లోకి రావడంలో తప్పేంటని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడిని అతని గత వృత్తి ఆధారంగా విమర్శించడం...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ జనసేన నాయకులు ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుకునే స్థాయిలో ఎవరూ లేరని, ఆయన ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసే కొందరు రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. జనసేన నాయకుడు సాగర్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌ను పదేపదే విమర్శించడం వెనుక రాజకీయ భయం కనిపిస్తోందన్నారు. ఒక సినిమా నటుడు రాజకీయాల్లోకి రావడంలో తప్పేంటని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడిని అతని గత వృత్తి ఆధారంగా విమర్శించడం సరికాదన్నారు. తెలంగాణలో జనసేన కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయని, అదే కొందరు రాజకీయ నాయకుల్లో అసహనానికి కారణమవుతోందని సాగర్ ఆరోపించారు. జనసేన తెలంగాణలో సభలు నిర్వహించకూడదా అని ప్రశ్నించిన ఆయన, ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి పనిచేసే హక్కు ఉందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావాలనుకుంటే ఎందుకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని ఆయన నిలదీశారు. సమాజానికి, ఆలయాలకు, ప్రజా ప్రయోజనాల కోసం పవన్ చేసిన సహాయాల గురించి మాట్లాడని వారు రాజకీయాల విషయానికి వస్తే మాత్రమే విమర్శలు చేస్తున్నారని అన్నారు. జనసేన తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ కూడా ఈ వివాదంపై స్పందించారు. రాజకీయాల్లో కొత్త తరం నాయకులకు అవకాశం ఉండకూడదా అని ప్రశ్నించారు. కొందరు నాయకులు మాత్రమే రాజకీయాల్లో ఉండాలనే భావన ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన సాధించిన విజయాలను ప్రస్తావించిన ఆయన, తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రజల్లో ప్రత్యామ్నాయ రాజకీయాలపై ఆసక్తి పెరుగుతోందని, జనసేన ఆ ఆశలకు వేదికగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ప్రయత్నించిన నాయకులపై ఎవరూ ప్రశ్నించలేదని, కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం విమర్శలు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని శంకర్ గౌడ్ అన్నారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం, తెలంగాణలో జనసేన భవిష్యత్తు పాత్రపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన నేతల తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
22 రోజుల క్రితం
Logo

తెలంగాణపై పాత వ్యాఖ్యల వివాదం మళ్లీ తెరపైకి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. తెలంగాణకు సంబంధించిన గత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు మరియు ఆ సమయంలో పలువురు నాయకులు చేసిన వ్యాఖ్యలను ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన వారంతా తమ వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం...

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. తెలంగాణకు సంబంధించిన గత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు మరియు ఆ సమయంలో పలువురు నాయకులు చేసిన వ్యాఖ్యలను ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన వారంతా తమ వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమైన రోజు అని పొన్నం ప్రభాకర్ అన్నారు. అలాంటి సందర్భాల్లో రాష్ట్రంలో సభలు నిర్వహించాలనుకునే నాయకులు ముందుగా తెలంగాణ పట్ల గౌరవాన్ని చాటాలని సూచించారు. గతంలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వకుండా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సభలు నిర్వహించడంలో ఉన్న ఉద్దేశ్యాన్ని ప్రజలకు వివరించాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులు, ఉద్యమకారుల సేవలను గుర్తించి వారికి తగిన గౌరవం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వారి త్యాగాలను చిన్నచూపు చూసే వ్యాఖ్యలను ప్రజలు అంగీకరించరని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సోదర భావం కొనసాగాలని తమ ఆకాంక్ష అని మంత్రి చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలు పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని, విభేదాలను రెచ్చగొట్టే రాజకీయాలకు ప్రోత్సాహం ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ సభలు నిర్వహించే హక్కు ఉందని పేర్కొన్న ఆయన, విద్వేష రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదని స్పష్టం చేశారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
19 రోజుల క్రితం
Logo

Congress: రెండున్నరేళ్ల విధ్వంసం.. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీ పాలు!

తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన! ప్రజా భవన్‌ ముందు కంచెలు కూలిస్తే.. ప్రజల జీవితాలు మారుతాయా? తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు! సంక్షేమానికి పాతర- రైతులకు ద్రోహం బ్రాండ్ హైదరాబాద్ ఖతం- రియల్ ఎస్టేట్ ఢమాల్! అబద్ధపు హామీలు - నిరుద్యోగుల ఆక్రందన! చీకటి రోజులు - ప్రజా వ్యతిరేక నిర్ణయాలు! రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ అరాచక పాలనపై స్పెషల్ ఫోకస్ Congress: తెలంగాణ సమాజం మార్పును కోరుకుంటే.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు కాస్తా వినాశనంగా మారి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ నిర్మించిన బంగారు తెలంగాణను రెండున్నరేళ్లలోనే చీకటి తెలంగాణగా...

  • తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన!
  • ప్రజా భవన్‌ ముందు కంచెలు కూలిస్తే.. ప్రజల జీవితాలు మారుతాయా?
  • తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు!
  • సంక్షేమానికి పాతర- రైతులకు ద్రోహం
  • బ్రాండ్ హైదరాబాద్ ఖతం- రియల్ ఎస్టేట్ ఢమాల్!
  • అబద్ధపు హామీలు - నిరుద్యోగుల ఆక్రందన!
  • చీకటి రోజులు - ప్రజా వ్యతిరేక నిర్ణయాలు!
  • రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ అరాచక పాలనపై స్పెషల్ ఫోకస్
Congress: తెలంగాణ సమాజం మార్పును కోరుకుంటే.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు కాస్తా వినాశనంగా మారి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ నిర్మించిన బంగారు తెలంగాణను రెండున్నరేళ్లలోనే చీకటి తెలంగాణగా మార్చేసింది రేవంత్ ప్రభుత్వం. మార్పు పేరుతో అభివృద్ధికి పాతరేసి, సంక్షేమాన్ని సమాధి చేస్తూ.. హైడ్రా పేరుతో అలజడి, అక్రమ అరెస్టులతో అరాచకం సృష్టిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టామని, ఇనుప కంచెలు తొలగించామని గొప్పలు చెప్పుకున్న రేవంత్ సర్కార్.. సామాన్యుడి కష్టాలను మాత్రం తీర్చలేకపోయింది. కంచెలు పోయినా.. సామాన్యుడికి సచివాలయంలోకి ప్రవేశం లేదు. మొదట్లో ఆర్భాటం చేసిన ప్రజా దర్బార్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. వేల సంఖ్యలో వచ్చిన అర్జీలు బుట్టదాఖలయ్యాయి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి.. మార్పు తెస్తామని ప్రగల్భాలు పలికారు. నిజమే.. ఆయన చెప్పినట్లే తెలంగాణలో మార్పు వచ్చింది. ఆ మార్పు ఏమిటంటే.. మళ్ళీ పాత సమైక్యాంధ్ర పాలన నాటి చీకటి రోజులు, కరెంటు కోతలు, నీటి కటకటలు తిరిగి రావడం. సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణకు చేసిన అన్యాయం గుర్తుకు తెచ్చుకుంటే కన్నీరు రాక మానదు. కరెంట్‌ లేక, ఉపాధి లేక, సాగు, మంచి నీటి కటకట. తెలంగాణ అంటేనే ఓ ఎడారిలా తయారైంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసి తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చారు. మిషన్ భగీరథతో ప్రజల ఇంటి ముందుకే మంచినీరు తీసుకొచ్చారు. కేసీఆర్ సర్కార్ వచ్చిన నెలరోజుల్లోనే కరెంట్ కష్టాలను తీర్చి.. నాడు సమైక్య పాలనలో కరెంట్ ఉంటే వార్త.. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ పోతే వార్త అన్నట్లుగా తీర్చిదిద్దారు. సాగునీటి రంగంలో విప్లవాన్ని తీసుకొస్తూ కాళేశ్వరంతో మండే వేసవిలోనూ చెరువులను మత్తడి దూకించిన అపర భగీరథుడు కేసీఆర్. ఇలా ఒకటి రెండు కాదు అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్ది పల్లెలను దేశానికే పట్టుకొమ్మలుగా మార్చారు. తీరా పదేళ్ల తర్వాత ఇప్పుడు సీన్ పూర్తిగా రీవర్స్ అయింది. కేసీఆర్‌ కంటే బెటర్ పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గుంపు మేస్త్రి పాలనలో అంధకారంలోకి వెళ్లిపోయింది. ఆరు గ్యారెంటీలు.. 420 మామీలతో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు రేవంత్. రైతు భరోసాకు అష్టకష్టాలు.. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000 ఇస్తామని చెప్పి ఓట్లు దండుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ పథకం అమలుకు సవాలక్ష సాకులు వెతుకుతోంది. గత ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిన 'రైతు బంధు'ను కూడా సమర్థవంతంగా అమలు చేయలేక చేతులెత్తేసింది. సాగునీటి నిర్వహణలో విఫలమై, ఎండిపోతున్న పంటలను చూసి రైతులు కన్నీరు పెడుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి మూటలు పంపడంలో నిమగ్నమయ్యారు. రైతు బంధుకు రాం రాం.. దళిత బంధుకు జై భీం.. కేసీఆర్ కిట్‌కు మంగళం ఇలా గత ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేలా తెచ్చిన సంక్షేమ పథకాలన్ని ఇప్పుడు కాల గర్భంలో కలిసిపోయాయి. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆక్రంధన పంట చేతికొచ్చినా, కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరువకపోవడంతో వడ్లు రోడ్డుపాలవుతున్నాయి. మక్క రైతులు గన్నీ సంచుల కొరత, మద్దతు ధర దక్కక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేమ ఉందని క్వింటాలుకు 5 కిలోల వరకు కోత.. ఇక యూరియా కోసం రైతులు అరిగోస పడే పరిస్థితి నెలకొంది. కేసీఆర్ పాలనలో యూరియా సజావుగా అందగా.. ఇప్పుడు యూరియా కోసం రైతులు రోజుల తరబడి వేచిచూసే పరిస్థితి నెలకొంది. పదేళ్ల తర్వాత మళ్ళీ యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టాల్సిన దుస్థితిని రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. 'హైడ్రా'.. పేదల గుండెల్లో గుబులు! ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో హైడ్రాను అస్త్రంగా చేసుకుని రేవంత్ రెడ్డి సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది, ప్రభుత్వమే నల్లా కనెక్షన్ ఇచ్చింది.. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం బుల్డోజర్‌లతో కూల్చేస్తోంది. పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా, బడా బాబుల ఆక్రమణల జోలికి వెళ్లకపోవడం ఈ ప్రభుత్వ పక్షపాత వైఖరికి నిదర్శనమని ప్రజలు చెప్పకోని సందర్భాలు లేకపోలేదు. బ్రాండ్ హైదరాబాద్‌ ఖతం.. దశాబ్ద కాలంగా కేసీఆర్ నిర్మించిన 'బ్రాండ్ హైదరాబాద్'ను కాంగ్రెస్ మంటగలిపింది. ప్రపంచపటంలో వెలిగిన హైదరాబాద్ నగరం నేడు కళ తప్పింది. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ఇన్వెస్టర్లు పారిపోతున్నారు. హైడ్రా పేరుతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పకూల్చారు. కొత్త ఐటీ కంపెనీలు రాకపోగా, ఉన్న కంపెనీలు తమ కార్యకలాపాలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు 40% పడిపోయాయి. సచివాలయంలో మంత్రుల కంటే వారి కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగిపోయింది. అసలు పదవుల్లో లేని సీఎం సోదరులు సమీక్షలు నిర్వహిస్తుంటే.. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ప్రశ్నించే వారిని ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిని సైతం జైలుకు పంపే అధ్వాన్న పాలన సాగుతోంది. చీకటి రోజులు - ప్రజా వ్యతిరేక నిర్ణయాలు.. తెలంగాణను మళ్లీ కరెంట్ కోతల రాష్ట్రంగా మార్చారు. సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు ఆపేసి పంట ఎండిపోయేలా చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఆటో డ్రైవర్ల పొట్టకొట్టారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది ఆటోడ్రైవర్లు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారిని ఆదుకునే ప్రయత్నం చేయని మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు రేవంత్. ఆరు గ్యారెంటీలు.. అన్నీ 420 హామీలే! మహాలక్ష్మి పథకం (మహిళల కోసం) నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అడిగే నాథుడే లేడు. కళ్యాణమస్తు పథకంలో భాగంగా ఆడబిడ్డల వివాహానికి లక్ష రూపాలయ ఆర్థిక సాయంతోపాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏ ఒక్కరికి తులం బంగారం ఇచ్చిన పరిస్థితి లేదు. రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ అని ఉదరగొట్టారు.. కానీ అది పూర్తిస్థాయిలో అమలైందా అంటే ఆ పార్టీ నేతలే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు నెలకు రూ.4,000 పెన్షన్ అన్నారు. కానీ ఉన్న పెన్షన్‌లే ఇవ్వడానికి అష్టకష్టాలు పడుతున్నారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. ధరణీ స్థానంలో తెచ్చిన భూమాత పోర్టల్‌ అట్టర్‌ ఫ్లాప్. భూమాత పోర్టల్‌లో జరిగిన కుంభకోణంతో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ.10 లక్షలు వడ్డీ లేని రుణం అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ.10 వేలు, 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు రూ.3 వేల పెన్షన్, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షలు, రేషన్ డీలర్లకు గౌరవ వేతనం, ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజూ 'ప్రజాదర్భార్' ఏర్పాటు ఇలా రేవంత్ సర్కార్ ఇచ్చిన ప్రతీ హామీ బుట్టాదాఖలైంది. ఢిల్లీకి బానిసత్వం! ఒకప్పుడు స్వయంపాలనలో గర్వంగా ఉన్న తెలంగాణ.. నేడు ఢిల్లీకి బానిసగా మారింది. తెలంగాణ సంపదను మూటలు కట్టి ఢిల్లీకి పంపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి చిన్న పనికి, మంత్రివర్గ విస్తరణకు, నామినేటెడ్ పదవులకు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ వీధుల్లో పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి తీరని అవమానం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలేమని చేతులెత్తేసిన చేతగాని ప్రభుత్వం ఇది. అబద్ధపు హామీలు - నిరుద్యోగుల ఆక్రందన! అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్వయంగా ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీని అశోక్ నగర్ రప్పించి నిరుద్యోగుల ఓట్లు దండుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా, ఉన్న ఉపాధి అవకాశాలను కూడా దెబ్బతీస్తున్నారు. పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు జాబ్స్ ఇచ్చి వాటిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం విడ్డూరం. కొత్త గ్రూప్స్ నోటిఫికేషన్లు లేవు, మెగా డీఎస్సీ ఊసే లేదు. నిరుద్యోగ భృతి రూ.4,000 ఇస్తామన్న హామీ ఎటు పోయిందో రేవంత్ రెడ్డికే తెలియాలి. గురుకులాల్లో మరణ మృదంగం.. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో తెలంగాణ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరుగుతుందని అంతా భావించారు. ఇంటిగ్రెడెట్ స్కూల్స్ పేరుతో ఉదర గొడుతూ.. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గురుకులాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. రెండేళ్లలో గురుకులాల్లో వందలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ మరియు ఇతర కారణాలతో మరణించడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. పేద విద్యార్థుల చదువులకు ఆసరాగా నిలిచే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నిలిపివేసి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. కాంగ్రెస్ మార్కు పాలన అంటే అబద్ధాలు, అరాచకాలు, మరియు అరాచకత్వం అని ప్రజలకు అర్థమైపోయింది. ఆరు గ్యారెంటీలు అడ్రస్ లేవు కానీ, ప్రకటనల కోసం మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాగే మొండిగా ముందుకు వెళ్తే, తెలంగాణ ప్రజలు త్వరలోనే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ALSO READ: Social Media: చాటింగ్ పేరుతో చీటింగ్.. వీడియో కాలింగ్‌తో లూటింగ్
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
27 రోజుల క్రితం
Logo

Telangana: తెలంగాణలోని మహిళలకు గుడ్ న్యూస్

Telangana: తెలంగాణ మహిళల ఆర్థిక సాధికారతకు ఊతమిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసే కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమైంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తొలి దశలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 1000 మంది మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను ఉచితంగా అందించనుండగా, తర్వాత విడతల వారీగా అర్హులైన మహిళలందరికీ ఈ ప్రయోజనం విస్తరించనున్నారు. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి, అర్హుల ఎంపిక...

Telangana: తెలంగాణ మహిళల ఆర్థిక సాధికారతకు ఊతమిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసే కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమైంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తొలి దశలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 1000 మంది మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను ఉచితంగా అందించనుండగా, తర్వాత విడతల వారీగా అర్హులైన మహిళలందరికీ ఈ ప్రయోజనం విస్తరించనున్నారు. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి, అర్హుల ఎంపిక అనంతరం లబ్ధిదారులకు మిషన్ల పంపిణీ చేపట్టనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మహిళల్లో స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పథకం రూపొందించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రత్యేకంగా బీసీ మహిళలకు ఈ పథకం మరింత ప్రయోజనకరంగా మారనుంది. నైపుణ్యం కలిగిన మహిళలను గుర్తించి టైలరింగ్ రంగంలో వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఆటోమేటిక్ కుట్టు యంత్రాలతో పాటు డిజైనింగ్, ఆధునిక టైలరింగ్ పద్ధతులు, ఇతర అనుబంధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలుకానున్న ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్ల పర్యవేక్షణలో పారదర్శకంగా జరగనుంది. కేవలం మిషన్ల పంపిణీతో పరిమితం కాకుండా, మహిళలు ఆదాయ మార్గాలను సృష్టించుకునేలా అవసరమైన ఇతర వనరులను కూడా ప్రభుత్వం సమకూర్చనుంది. ఈ పథకం అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది మహిళలు స్వయం ఉపాధి పొందడంతో పాటు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ పేద మహిళలకు ఇది ఉపాధి ఆధారంగా మారనుంది. ఇంటి వద్ద నుంచే ఉపాధి పొందే అవకాశంతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లోనూ మార్పు తీసుకురానుంది. మహిళలతో పాటు నిరుద్యోగ యువతకు కూడా నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తోంది. వివిధ వృత్తుల్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టి ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు కేవలం లబ్ధిదారులుగానే కాకుండా స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయనున్నారని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ALSO READ: Tollywood Heroine: పెళ్లి కాకుండా పిల్లల్ని కనొచ్చు..
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
27 రోజుల క్రితం
Logo

Kavitha: తెలంగాణలో కర్కోటకుడి పాలన

Kavitha: రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచేలా తెలంగాణ రాష్ట్ర సేన అధినేత కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నయా హిట్లర్, కర్కోటకుడి తరహా పాలన కొనసాగుతోందని ఆరోపిస్తూ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించగా, మరోవైపు బీఆర్ఎస్ అవినీతికి కేంద్రంగా మారిపోయిందని ఆమె ఆరోపించారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీపై...

Kavitha: రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచేలా తెలంగాణ రాష్ట్ర సేన అధినేత కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నయా హిట్లర్, కర్కోటకుడి తరహా పాలన కొనసాగుతోందని ఆరోపిస్తూ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించగా, మరోవైపు బీఆర్ఎస్ అవినీతికి కేంద్రంగా మారిపోయిందని ఆమె ఆరోపించారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీపై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ మూడు ప్రధాన పార్టీల వైఫల్యాల వల్లే కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమైందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో బాధలు అనుభవించిన వారు ఈ రోజు గుర్తింపు లేక రోడ్డుపై పడిపోయారని, అయితే అప్పట్లో ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించినవారు ఇప్పుడు ఉన్నత స్థానాల్లో సుఖాలు అనుభవిస్తున్నారని విమర్శించారు. గత 10 సంవత్సరాల్లో సుమారు 30 వేల నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ ఎంతమంది నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరిగిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తాను ప్రశ్నించడంతోనే తనను పార్టీ నుంచి బయటకు పంపించారని పేర్కొన్నారు. తప్పులు చేసిన వారిని పక్కన పెట్టి అవినీతి ఆరోపణలు ఉన్నవారిని ప్రోత్సహించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ చేసిన తప్పులను ఒక్కొక్కటిగా ప్రజల ముందుంచుతానని హెచ్చరించారు. ఇప్పటి వరకు జరిగినది కేవలం ఆరంభం మాత్రమేనని, ముందున్న రోజుల్లో మరిన్ని విషయాలు వెలుగులోకి తీసుకువస్తానని గట్టి హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణ ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ వైఖరిని తీవ్రంగా విమర్శించిన కవిత, ఆ పార్టీకి రాష్ట్రం ఏర్పడటమే ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటును తల్లిని చంపి బిడ్డను తీశారని పోల్చిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆ పార్టీ నాయకులపై మండిపడ్డారు. తెలంగాణను భారత్-పాక్ విభజనతో పోల్చిన ఒక ఎంపీ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఇంత అన్యాయమైన వ్యాఖ్యలపై కూడా ఆ పార్టీకి చెందిన ఎంపీలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. సామాజిక న్యాయం అనే భావనకు ఆ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని ఆరోపించారు. మహిళల కోసం తీసుకురావాల్సిన చట్టాలను పక్కన పెట్టారని, బీసీ వర్గాల కోసం అవసరమైన చర్యలను నిర్లక్ష్యం చేశారని, కులగణన అంశాన్ని కూడా విస్మరించారని విమర్శించారు. పేదలకు ఉపాధి కల్పించే పథకాలను బలహీనపరిచారని పేర్కొన్నారు. సమాఖ్య వ్యవస్థను పక్కనబెట్టి తెలంగాణకు చెందిన 7 మండలాలను తీసుకున్నప్పటికీ రాష్ట్రానికి చెందిన ఎంపీలు స్పందించలేదని విమర్శించారు. భద్రాచలం పరిధిలోని 5 గ్రామాలను తిరిగి రాష్ట్రానికి తీసుకురావాలని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి రాకపోయినా, రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. తన పార్టీ లక్ష్యాలను స్పష్టంగా ప్రకటిస్తూ ఐదు ప్రధాన అంశాలతో కూడిన ‘పాంచజన్యం’ ప్రకటనను కూడా విడుదల చేశారు. ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య అందించేలా చర్యలు తీసుకుంటామని, ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా ఉచిత విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఏ వ్యాధికైనా, ఏ ఆసుపత్రిలోనైనా పూర్తి ఉచిత వైద్యం అందేలా వ్యవస్థను రూపుదిద్దుతామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ రైతును నిజమైన రాజుగా నిలబెట్టాలని సంకల్పించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోనే 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సమాన న్యాయం చేస్తూ సామాజిక సమతౌల్యం తీసుకురావడమే లక్ష్యమని వెల్లడించారు. అవినీతి, బంధుప్రీతి ఆధారంగా నడుస్తున్న ప్రస్తుత పార్టీలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్ర సేన ఎదుగుతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. ASLO READ: Telangana Rastra Sena: కొత్త విప్లవం.. తెలంగాణలో కవిత కొత్త పార్టీ
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
28 రోజుల క్రితం
Logo

Telangana Rastra Sena: కొత్త విప్లవం.. తెలంగాణలో కవిత కొత్త పార్టీ

Telangana Rastra Sena: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ ప్రాంతంలోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించిన సభలో ఆమె పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించిన కవిత.. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన జెండాను ప్రజల ముందుంచారు. ఆ జెండా మధ్యలో తెలంగాణ ఆకృతిని ప్రతిష్టించి, దానిపై పార్టీ పేరును సూచించే అక్షరాలను ప్రతిబింబించారు. అనంతరం సభలో మాట్లాడిన కవిత...

Telangana Rastra Sena: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ ప్రాంతంలోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించిన సభలో ఆమె పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించిన కవిత.. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన జెండాను ప్రజల ముందుంచారు. ఆ జెండా మధ్యలో తెలంగాణ ఆకృతిని ప్రతిష్టించి, దానిపై పార్టీ పేరును సూచించే అక్షరాలను ప్రతిబింబించారు. అనంతరం సభలో మాట్లాడిన కవిత తన పార్టీ ఏర్పాటుకు కారణమైన అంశాలను వివరిస్తూ, తెలంగాణ ఆత్మ దెబ్బతిన్నదనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ రోజు తన జీవితంలో మరపురాని రోజుగా నిలిచిందని పేర్కొన్న కవిత.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ప్రజల ఆకాంక్షలు పూర్తిగా నెరవేరలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్యమ నాయకుడిగా నిలిచిన కేసీఆర్ అభివృద్ధి దిశలో సాగించిన ప్రయాణం ప్రస్తుతం గాడితప్పిందని విమర్శించారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో తాను కూడా భాగమని అంగీకరిస్తూ, ప్రజల ముందు క్షమాపణ చెబుతున్నానని వెల్లడించారు. ఆ తప్పులను సరిదిద్దుకునే సంకల్పంతోనే కొత్త పార్టీ స్థాపనకు ముందుకొచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని ఆరోపిస్తూ, అందుకే తెలంగాణ రాష్ట్ర సేన రూపుదిద్దుకుందని స్పష్టం చేశారు. తాను తెలంగాణలోని 3.5 కోట్ల ప్రజలకు తల్లిగా మారాలని కోరుకుంటున్నానని కవిత పేర్కొన్నారు. అమ్మతనంతో పాలన సాగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. సామాజిక న్యాయం లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రకటించారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని కోరుతూ, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఏర్పాటుపై ఆసక్తి లేదని విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నీళ్లు, నిధులు, నియామకాల అంశాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. గతంలో టీఆర్ఎస్ కోసం పని చేసిన తాను, అప్పటి కేసీఆర్‌కు ఇప్పటి కేసీఆర్‌కు ఎంతో తేడా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేరని, ప్రజలకు ఇబ్బందులు వచ్చినా స్పందించడం లేదని విమర్శించారు. అధికారం ముందు అనుబంధాలు తగ్గిపోయాయని, రాజకీయ పరిణతి లోపించిందని కూడా వ్యాఖ్యానించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మంచిదేనని చెప్పిన కవిత.. ఆ పార్టీలో కొనసాగి తాను బలంగా పోరాడలేకపోయానని అన్నారు. ఇప్పుడు రాష్ట్రం కోసం స్వేచ్ఛగా పోరాడతానని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పినందుకే తనను పక్కన పెట్టారని ఆరోపించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయని ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తమ పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుందని, మరో 2 సంవత్సరాల తరువాత అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభకు ముందు బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కవిత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వమత ప్రార్థనలు చేసిన అనంతరం కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి పార్టీ శ్రేణులతో కలిసి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్త మార్పులకు నాంది పలుకుతున్నామని తెలిపారు. తాను తప్పకుండా తెలంగాణ ముఖ్యమంత్రిగా అవుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ALSO READ: Interesting Facts: ఏడు గుర్రాల ఫొటో ఇంట్లో పెడుతున్నారా?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
3 రోజుల క్రితం
Logo

Kavitha: కొత్త పార్టీ గుబులు.. తెలంగాణ జాగృతిలోకి మాజీ ఎమ్మెల్యేల క్యూ..?

Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజలకు సేవ చేయడంలో అడ్డంకిగా మారిన పాత రాజకీయ శక్తులను పక్కనబెట్టి, కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరడం ఈ దిశగా కీలక పరిణామంగా నిలిచింది. కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన కవిత, తెలంగాణ సాధన కోసం కలిసి పోరాడిన నాయకులు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్కటిగా నిలవాలని పునరుద్ఘాటించారు. తెలంగాణ...

Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజలకు సేవ చేయడంలో అడ్డంకిగా మారిన పాత రాజకీయ శక్తులను పక్కనబెట్టి, కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరడం ఈ దిశగా కీలక పరిణామంగా నిలిచింది. కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన కవిత, తెలంగాణ సాధన కోసం కలిసి పోరాడిన నాయకులు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్కటిగా నిలవాలని పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాన్ని గుర్తు చేసుకున్న కవిత, 2007లో తన కుటుంబంతో కలిసి బోథ్ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో గిరిజన ప్రాంతాలు మన్నెం జ్వరంతో బాధపడుతూ, కనీస సదుపాయాల లేమితో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆమె పేర్కొన్నారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే సంకల్పంతో అందరం ఐక్యంగా ఉద్యమించామని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పని చేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. రాథోడ్ బాపూరావు గతంలో జాగృతి నుంచి బీఆర్ఎస్‌లో చేరి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ప్రస్తుతం కొత్తగా ఏర్పడబోయే రాజకీయ వేదికలో చేరడం ద్వారా మరోసారి ప్రజాసేవకు కట్టుబడుతున్నారని కవిత తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు ఈ కొత్త రాజకీయ ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారని, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు ఈ దిశగా ఎదురుచూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ కొత్త రాజకీయ శక్తికి మంచి ఆదరణ లభిస్తుందని కూడా ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ.. కవిత నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, రాష్ట్రానికి ఆమె ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. తన రాజకీయ ప్రయాణంలో కవిత ఇచ్చిన ప్రోత్సాహం కీలకమైందని, ఆ ధైర్యంతోనే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా సేవలందించినప్పటికీ, తర్వాత సరైన అవకాశాలు దక్కలేదని, ఇతర పార్టీల్లోనూ తగిన ప్రాధాన్యత లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో ఇచ్చోడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన అనుచరులు, కార్యకర్తలను జాగృతిలో చేర్పించనున్నట్లు వెల్లడించారు. ఇక ఆదివాసీల హక్కుల అంశంపై కూడా కవిత గళమెత్తారు. జనగణనలో ఆదివాసీల మతానికి ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్టిట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో ఆమెను కలిశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను వారు వివరించారు. పెసా చట్టం అమలులో లోపాలు ఉన్నాయని, రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్లలో ఉన్న రక్షణలను బలహీనపరుస్తున్నారని కవిత విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా సుమారు 3 లక్షల ఆదివాసీలు అడవుల నుంచి దూరమవుతున్నారని, వారికి తగిన పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. జనగణనలో మతం కేటగిరిలో ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు లేకపోవడం వారి సంస్కృతిని అవమానించే చర్యగా ఆమె అభివర్ణించారు. ఆదివాసీలు తమ మతాన్ని గర్వంగా ప్రకటించుకునేలా ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఆదివాసీల భాష ‘కోయతూర్’ను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని కవిత కోరారు. దేశవ్యాప్తంగా సుమారు 12 కోట్ల ఆదివాసీలు భారతీయ సంస్కృతికి ప్రతినిధులని, వారి గౌరవాన్ని కాపాడే లక్ష్యంతో కొత్త రాజకీయ పార్టీ పని చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాడూరి శ్రీనివాస్, పాయం సత్యనారాయణ, మాడవి నర్సింగరావు, వట్టం నారాయణ దొర, రమణాల లక్ష్మయ్య, వజ్జ నర్సింహరావు, కబ్బాక శ్రావణ్ కుమార్, కుర్సంగ వేణు, వరియ శ్రీనివాస్, షడమాకి సంజీవ్, ఆత్రం పైకాజీ, పోదెం భార్గవ, ఎల్. రూప్ సింగ్, లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు. ALSO READ: Suicide: 30 ఏళ్లు వచ్చినా ఇక 3 ముళ్లు వేసే యోగ్యం లేదేమోనని..
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
22 రోజుల క్రితం
Logo

Saleswaram Yatra: ప్రకృతి ఒడిలో పరమశివుడు.. తెలంగాణ అమర్‌నాథ్ యాత్ర నేటి నుంచే ప్రారంభం!

Saleswaram Yatra: తెలంగాణలో అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక సాహస యాత్రలలో ఒకటైన సలేశ్వరం జాతర నేటి నుంచి భక్తుల సందడితో ప్రారంభమైంది. నల్లమల అరణ్యపు లోతుల్లో, ప్రకృతి నడుమ వెలసిన ఈ పవిత్ర క్షేత్రం సలేశ్వరం దేవాలయం ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి సందర్భంగా మాత్రమే దర్శనానికి అనుమతించబడుతుంది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉన్న లింగమయ్యను దర్శించుకోవడం అనేది సాధారణ యాత్ర కాదని, అది భక్తి, ధైర్యం, సహనాన్ని పరీక్షించే ప్రయాణమని భక్తులు భావిస్తున్నారు. ఏటా కేవలం 3 నుండి 5 రోజుల పాటు మాత్రమే అనుమతి ఉండటంతో, ఈ అరుదైన అవకాశాన్ని...

Saleswaram Yatra: తెలంగాణలో అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక సాహస యాత్రలలో ఒకటైన సలేశ్వరం జాతర నేటి నుంచి భక్తుల సందడితో ప్రారంభమైంది. నల్లమల అరణ్యపు లోతుల్లో, ప్రకృతి నడుమ వెలసిన ఈ పవిత్ర క్షేత్రం సలేశ్వరం దేవాలయం ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి సందర్భంగా మాత్రమే దర్శనానికి అనుమతించబడుతుంది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉన్న లింగమయ్యను దర్శించుకోవడం అనేది సాధారణ యాత్ర కాదని, అది భక్తి, ధైర్యం, సహనాన్ని పరీక్షించే ప్రయాణమని భక్తులు భావిస్తున్నారు. ఏటా కేవలం 3 నుండి 5 రోజుల పాటు మాత్రమే అనుమతి ఉండటంతో, ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. “వస్తున్నాం లింగమయ్యా” అనే నినాదాలతో అడవి మారుమ్రోగిపోతూ ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారుతోంది. ఈ యాత్రలో ప్రధాన సవాలు రాంపూర్ చెంచుపెంట నుంచి మొదలవుతుంది. అక్కడి వరకు వాహనాల్లో చేరుకున్న భక్తులు, ఆ తర్వాత సుమారు 4 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిగా కాలి నడకన దట్టమైన అడవిలో ప్రయాణించాల్సి ఉంటుంది. లోయల మధ్యుగా, ఎత్తైన కొండలపైగా సాగాల్సిన ఈ మార్గం ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో దారి కేవలం 1 అడుగు వెడల్పుతో ఉండటం, పక్కనే వేల అడుగుల లోతైన అగాధం ఉండటం భక్తులను భయపెడుతుంది. మోకాళ్లకు పరీక్షగా నిలిచే ఎత్తైన మెట్లు, నిటారుగా ఉన్న కొండలను అధిరోహిస్తూ, ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ భక్తులు ముందుకు సాగుతారు. దారి పొడవునా వన్యప్రాణుల సంచారం ఉన్నప్పటికీ, భగవంతుడిపై విశ్వాసంతో యాత్రను కొనసాగిస్తారు. లోయ దిగువ భాగానికి చేరుకున్న వెంటనే భక్తులను అలరించే ప్రకృతి సోయగం ప్రత్యేకంగా నిలుస్తుంది. సుమారు 200 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం వెండి తెరలా మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకుంటుంది. అడవిలోని అనేక వనమూలికలను తాకుతూ ప్రవహించే ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ పవిత్ర జలంలో స్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయని, మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని నమ్మకం ఉంది. జలపాతం గర్జన, పక్షుల స్వరాలు, ప్రకృతి నిశ్శబ్దం మధ్య లింగమయ్య దర్శనం భక్తులకు అపూర్వ అనుభూతిని కలిగిస్తుంది. ఈ క్షేత్రంలో ఎటువంటి భారీ నిర్మాణాలు లేకుండా, ప్రకృతి మధ్యలో గుహలలో లింగమయ్య కొలువై ఉండటం విశేషం. శతాబ్దాలుగా ఈ ప్రాంతానికి చెందిన చెంచు గిరిజనులు స్వామివారికి పూజలు నిర్వహించడం ఈ యాత్రకు ప్రత్యేకతను తెచ్చింది. సంప్రదాయాన్ని కాపాడుతూ, ప్రకృతితో ఏకమై సాగించే ఈ పూజా విధానం భారతీయ సంస్కృతికి గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. ఆలయ పరిసరాల్లో కనిపించే నిజాం కాలం నాటి పాత నిర్మాణాలు ఈ ప్రాంత చరిత్రను గుర్తు చేస్తాయి. ఇది పులుల అభయారణ్యంగా గుర్తింపు పొందిన ప్రాంతం కావడంతో అటవీ శాఖ కఠిన నియమాలను అమలు చేస్తోంది. ప్లాస్టిక్ వాడకంపై పూర్తిగా నిషేధం విధించబడింది. పర్యావరణాన్ని కాపాడేలా భక్తులు వ్యవహరించాలని అధికారులు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో భక్తులు రానున్నారని అంచనా వేయడంతో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అడవి మార్గంలో భక్తులకు సహాయం అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, అల్పాహారాన్ని అందిస్తున్నాయి. ఈ యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ బస్టాండ్‌తో పాటు నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. స్వంత వాహనాల్లో వెళ్లేవారు పులిబొమ్మ మార్గం ద్వారా బేస్ క్యాంప్‌కు చేరుకోవచ్చు. ఏప్రిల్ 1 నుండి 3 వరకు నిర్వహించే ఈ జాతరలో పాల్గొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ లింగమయ్య ఆశీస్సులు పొందాలని భక్తులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఈ 3 రోజుల యాత్ర జీవితంలో చిరస్థాయిగా నిలిచే అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నారు. ALSO READ: Land Scam: సామాన్యులపై భూ బకాసురుల పంజా..
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
3 రోజుల క్రితం
Logo

Budget 2026-27: రూ.3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

Budget 2026-27: తెలంగాణ రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల బలోపేతం అనే లక్ష్యాలతో రూపొందించిన ఈ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టగా, శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,24,234 కోట్ల అంచనాలతో ఈసారి బడ్జెట్ రూపొందించబడింది. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా విభాగాల వారీగా నిధులను కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ బడ్జెట్‌లో భాగంగా నూతన సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక...

Budget 2026-27: తెలంగాణ రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల బలోపేతం అనే లక్ష్యాలతో రూపొందించిన ఈ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టగా, శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,24,234 కోట్ల అంచనాలతో ఈసారి బడ్జెట్ రూపొందించబడింది. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా విభాగాల వారీగా నిధులను కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ బడ్జెట్‌లో భాగంగా నూతన సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 118 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతి నెల రూ.2,000 చొప్పున స్కాలర్‌షిప్ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఇక శాఖల వారీగా కేటాయించిన నిధులను పరిశీలిస్తే విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వబడింది. విద్యాశాఖకు రూ.26,674 కోట్లు కేటాయించగా, వైద్య ఆరోగ్య శాఖకు రూ.13,679 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి రూ.21,285 కోట్లు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.33,688 కోట్లు కేటాయించడం ద్వారా గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. గృహనిర్మాణానికి రూ.7,430 కోట్లు కేటాయించగా, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు రూ.17,907 కోట్లు కేటాయించారు. సామాజిక సంక్షేమానికి కూడా ఈ బడ్జెట్‌లో మంచి ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.7,937 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.3,769 కోట్లు కేటాయించారు. మహిళా, శిశు సంక్షేమానికి రూ.3,143 కోట్లు కేటాయించడం ద్వారా మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. కార్మిక శాఖకు రూ.998 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.1,529 కోట్లు కేటాయించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా భారీగా నిధులు కేటాయించారు. ఆర్ అండ్ బి శాఖకు రూ.12,789 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.3,490 కోట్లు, హోం శాఖకు రూ.11,907 కోట్లు కేటాయించారు. న్యాయ శాఖకు రూ.2,367 కోట్లు కేటాయించగా, చేనేత రంగానికి రూ.258 కోట్లు కేటాయించారు. పర్యాటక శాఖ అభివృద్ధికి రూ.1,224 కోట్లు కేటాయించారు. అదేవిధంగా గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రూ.500 కోట్లు కేటాయించడం విశేషం. ఇక రాజీవ్ యువ వికాసం కార్యక్రమానికి రూ.6,000 కోట్లు కేటాయించడం ద్వారా యువత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రభుత్వం తెలిపింది. హెచ్ సిటీ పథకం కింద రూ.2,654 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఈ బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధి, యువత సాధికారత అనే మూడు ప్రధాన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించినట్లు స్పష్టమవుతోంది. ALSO READ: Telangana Budget: 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకం
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
5 రోజుల క్రితం
Logo

Hanamkonda: తెలంగాణ డిజిటల్ కేబుల్ టీవీ అసోసియేషన్ అధ్యక్షుడిగా గుండ్ల శ్రీనివాస్

Hanamkonda: జర్నలిజం రంగంలో దాదాపు 20 సంవత్సరాలుగా నిరంతరంగా సేవలందిస్తూ, తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న గుండ్ల శ్రీనివాస్, ఇప్పుడు తెలంగాణ డిజిటల్ కేబుల్ టీవీ అసోసియేషన్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ నియామకం కేబుల్ టీవీ రంగంలో పనిచేస్తున్న వారికి కొత్త ఉత్సాహాన్ని నింపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుండ్ల శ్రీనివాస్ తన నేతృత్వంలో మీడియా 10 కేబుల్ టీవీని స్థాపించి, స్థానిక స్థాయిలో వార్తా ప్రసారాల్లో విశ్వసనీయతను పెంచిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. సమాజానికి సమీపంగా ఉండే వార్తలను ప్రజలకు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆయన సేవలను...

Hanamkonda: జర్నలిజం రంగంలో దాదాపు 20 సంవత్సరాలుగా నిరంతరంగా సేవలందిస్తూ, తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న గుండ్ల శ్రీనివాస్, ఇప్పుడు తెలంగాణ డిజిటల్ కేబుల్ టీవీ అసోసియేషన్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ నియామకం కేబుల్ టీవీ రంగంలో పనిచేస్తున్న వారికి కొత్త ఉత్సాహాన్ని నింపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుండ్ల శ్రీనివాస్ తన నేతృత్వంలో మీడియా 10 కేబుల్ టీవీని స్థాపించి, స్థానిక స్థాయిలో వార్తా ప్రసారాల్లో విశ్వసనీయతను పెంచిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. సమాజానికి సమీపంగా ఉండే వార్తలను ప్రజలకు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన తెలంగాణ డిజిటల్ కేబుల్ టీవీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ.. హన్మకొండ జిల్లా కమిటీని ప్రకటిస్తూ, జిల్లా అధ్యక్షుడిగా గుండ్ల శ్రీనివాస్‌ను అధికారికంగా నియమించింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రాచర్ల గోపి మాట్లాడుతూ.. గుండ్ల శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. ఆయన నాయకత్వంలో హన్మకొండ జిల్లాలో కేబుల్ టీవీ రంగం మరింత బలోపేతం అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అలాగే కేబుల్ ఛానల్ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టుకు అందాల్సిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పదవిలో గుండ్ల శ్రీనివాస్ 2 సంవత్సరాల పాటు కొనసాగనున్నారని స్పష్టంచేశారు. ఈ కాలంలో కేబుల్ టీవీ రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడమే కాకుండా, జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ నియామకం ద్వారా హన్మకొండ జిల్లాలో కేబుల్ టీవీ వ్యవస్థ మరింత అభివృద్ధి దిశగా పయనిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ALSO READ: Chirra Suman Goud: జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
15 రోజుల క్రితం
Logo

RevanthReddy: తెలంగాణ మావోయిస్టు స్టేట్ కమిటీ ముగింపు

సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు మిగిలిన వారూ లొంగిపోవాలని డీజీపీ పిలుపు స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ ఇక లేదని, ఆ కమిటీకి సంబంధించిన మిగిలిన సభ్యులందరూ లొంగిపోయారని ఆయన వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మొత్తం 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలను అప్పగించి లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో తెలంగాణ స్టేట్ కమిటీకి చెందిన ఐదుగురు సభ్యులు కూడా...

సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు మిగిలిన వారూ లొంగిపోవాలని డీజీపీ పిలుపు స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ ఇక లేదని, ఆ కమిటీకి సంబంధించిన మిగిలిన సభ్యులందరూ లొంగిపోయారని ఆయన వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మొత్తం 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలను అప్పగించి లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో తెలంగాణ స్టేట్ కమిటీకి చెందిన ఐదుగురు సభ్యులు కూడా ఉండటంతో ఇక రాష్ట్ర కమిటీ చరిత్రలోనే మిగిలిపోయిందని డీజీపీ పేర్కొన్నారు. తుపాకీ ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్ముతూ తెలంగాణ నాయకత్వంలో పోరాటం కొనసాగించిన మావోయిస్టు పార్టీకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ లేకుండా పోయిందని అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టు కమిటీలలో తెలంగాణకు చెందిన సభ్యులు కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారని, వారు కూడా త్వరలోనే లొంగిపోవాలని పిలుపునిచ్చారు. శనివారం లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. వారు ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆయుధాలను సమర్పించారు. అందులో ఒక ఇన్‌సాస్ ఎల్‌ఎంజీ రైఫిల్, 31 ఏకే-47 రైఫిళ్లు, 21 ఇన్‌సాస్ రైఫిళ్లు, 20 ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, 18 303 రైఫిళ్లు, 33 ఇతర తుపాకులు ఉన్నాయి. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. లొంగిపోయిన మావోయిస్టుల హోదాలను బట్టి ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తామని తెలిపారు. వారికి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే రాష్ట్రంలో భూమి లభ్యత కష్టంగా ఉన్నందున భూమి ఇవ్వడంపై హామీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హింసకు తావు లేదని, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే ప్రభుత్వం సహించదని సీఎం హెచ్చరించారు. మావోయిస్టులు ప్రజాప్రవాహంలోకి వచ్చి సాధారణ జీవితం గడపాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. ALSO READ: RevanthReddy: లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం కీలక హామీ
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
17 రోజుల క్రితం
Logo

Congress Government: తెలంగాణ కాంగ్రెస్‌లో సూపర్ పవర్ రేవంత్ రెడ్డి

ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై దృష్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊరట రైతులకు రుణమాఫీతో ఉపశమనం ఆరోగ్యశ్రీ విస్తరణతో పేదలకు వైద్య భరోసా విజన్ 2047తో తెలంగాణ భవిష్యత్ లక్ష్యాలు Congress government: తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు అజేయ శక్తిగా కనిపించిన బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో పెద్ద మలుపుగా నిలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నదనే భావన బలంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం చాలా మందిలో లేకపోయినా, ఆ పార్టీ...

ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై దృష్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊరట రైతులకు రుణమాఫీతో ఉపశమనం ఆరోగ్యశ్రీ విస్తరణతో పేదలకు వైద్య భరోసా విజన్ 2047తో తెలంగాణ భవిష్యత్ లక్ష్యాలు Congress government: తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు అజేయ శక్తిగా కనిపించిన బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో పెద్ద మలుపుగా నిలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నదనే భావన బలంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం చాలా మందిలో లేకపోయినా, ఆ పార్టీ నాయకులు మాత్రం వెనక్కి తగ్గలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లి బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూనే తమ పాలన ఎలా ఉండబోతుందో వివరించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నేతలు గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను వివరించి ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు. ఈ హామీలపై ప్రజల్లో విశ్వాసం పెరగడంతో కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించింది. బీఆర్‌ఎస్‌ను ఓడించడం అసాధ్యమని భావించిన రాజకీయ విశ్లేషకులకే ఈ ఫలితం ఆశ్చర్యాన్ని కలిగించింది. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన సాగిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశను చూపిస్తున్నారు. మార్పు కోరుకున్న ప్రజల ఆశలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ తన పాలనను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న ఈ సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలు దిశగా ప్రభుత్వం వరుస చర్యలు చేపడుతోంది. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోంది. ప్రజా పాలన అనే నినాదంతో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమం, అభివృద్ధి అనే రెండు అంశాలను సమానంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన పథకాలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయడం ప్రారంభించింది. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం పెద్ద మార్పుగా నిలిచింది. ఉద్యోగాలు లేదా ఇతర పనుల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన మహిళలకు ఇది ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో మహిళల నుంచి విస్తృతమైన స్పందన వచ్చింది. అదే విధంగా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ రూ.500కే అందించే విధంగా సబ్సీడీ అమలు చేయడం ద్వారా మహిళలపై పడే ఖర్చును తగ్గించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఇంకా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని కూడా ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటగా మారింది. విద్యుత్ ఖర్చు తగ్గడంతో కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గింది. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసే సమయంలో అర్హుల ఎంపికలో పారదర్శకత పాటిస్తూ లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంది. పథకాలు సరైన వారికి చేరేలా పర్యవేక్షణ వ్యవస్థను కూడా బలోపేతం చేసింది. ఆరోగ్య రంగంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్యశ్రీ పథకం పరిధిని విస్తరించి రూ.10 లక్షల వరకు వైద్య ఖర్చులను భరించే విధంగా మార్పులు చేసింది. దీంతో పేదలకు ఖరీదైన వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స పొందే అవకాశం కలగడంతో పేద కుటుంబాలకు ఇది పెద్ద సహాయంగా మారింది. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను సాధారణ ప్రజలకు అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని మరింత విస్తరించింది ప్రభుత్వం. రైతుల సంక్షేమం విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు మద్దతుగా నిలుస్తూ రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసింది. దాదాపు రూ.2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేయడం ద్వారా లక్షలాది మంది రైతులకు ఉపశమనం కలిగించింది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం సుమారు రూ.31,000 కోట్ల నిధులను కేటాయించింది. దాదాపు 40 లక్షల మంది రైతులకు ఈ రుణమాఫీ ద్వారా లాభం చేకూరింది. అదేవిధంగా రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి సహాయాన్ని అందిస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. రైతులు అప్పుల బారిన పడకుండా ఉండేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణను భవిష్యత్తులో బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందిస్తోంది. రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో విజన్- 2047 ప్రణాళికను రూపొందించింది. అలాగే పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ద్వారా భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పేదలకు సొంత ఇల్లు కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రభుత్వం పునఃప్రారంభించింది. సొంత స్థలం ఉన్నా ఇల్లు కట్టుకోలేని పేదలకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి సొంతింటి కలను నిజం చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు ప్రయోజనం పొందే అవకాశముంది. అయితే ప్రభుత్వంపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో హైడ్రా చర్యల పేరుతో పేదల ఇళ్లు కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. ఎఫ్‌టీఎల్ మరియు బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నా, ఈ చర్యలు పేదలపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పెద్దల నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల ఘటన కూడా ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది. ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న పేదల ఇళ్లను ఒక్కసారిగా కూల్చివేయడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఇక నిరుద్యోగుల సమస్య కూడా ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఎన్నికల తర్వాత కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినప్పటికీ జాబ్ క్యాలెండర్ అమలు కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియక నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. యువతకు ఇచ్చిన కొన్ని హామీలు అమలు కాలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయినప్పటికీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కొన్ని లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో పెద్ద సమస్యలు ఉండవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. ALSO READ: Missile Strike: ఖమేనీని ఎలా టార్గెట్ చేశారో తెలుసా?
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Special Focus News
Reporter
STAR TRINETHRAM
17 రోజుల క్రితం
Logo

తెలంగాణ రాజకీయాల్లో అరుదైన స్నేహబంధం

తెలంగాణ రాజకీయాల్లో స్నేహబంధాల గురించి మాట్లాడేటప్పుడు ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలిచే ఇద్దరు నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరియు వేం నరేందర్‌రెడ్డి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని తరచూ చెప్పుకునే మాట ఉన్నప్పటికీ, కొంతమంది మాత్రం ఆ నానుడికి భిన్నంగా నిలుస్తూ సుదీర్ఘ కాలం పాటు స్నేహాన్ని కొనసాగిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. తెలుగునాట ఒకప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరియు కేవీపీ రామచంద్రరావుల స్నేహం ఎంతగా చర్చకు దారి తీసిందో, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌రెడ్డి మరియు వేం నరేందర్‌రెడ్డి మధ్య ఉన్న స్నేహం కూడా అంతే ప్రాధాన్యంతో చర్చకు వస్తోంది. దాదాపు...

తెలంగాణ రాజకీయాల్లో స్నేహబంధాల గురించి మాట్లాడేటప్పుడు ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలిచే ఇద్దరు నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరియు వేం నరేందర్‌రెడ్డి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని తరచూ చెప్పుకునే మాట ఉన్నప్పటికీ, కొంతమంది మాత్రం ఆ నానుడికి భిన్నంగా నిలుస్తూ సుదీర్ఘ కాలం పాటు స్నేహాన్ని కొనసాగిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. తెలుగునాట ఒకప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరియు కేవీపీ రామచంద్రరావుల స్నేహం ఎంతగా చర్చకు దారి తీసిందో, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌రెడ్డి మరియు వేం నరేందర్‌రెడ్డి మధ్య ఉన్న స్నేహం కూడా అంతే ప్రాధాన్యంతో చర్చకు వస్తోంది. దాదాపు 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ స్నేహం అనేక రాజకీయ పరిణామాలను, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ మరింత బలపడింది. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో వేం నరేందర్‌రెడ్డి పేరు అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ స్నేహబంధం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏప్రిల్‌ 9తో రెండు స్థానాల గడువు ముగియనున్న నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా అభిషేక్‌ మనుసింఘ్వీ మరియు వేం నరేందర్‌రెడ్డిలను ప్రకటించారు. ఇందులో ఒక స్థానాన్ని పార్టీ అధిష్ఠానం కోటాలో అభిషేక్‌ మనుసింఘ్వీకి కేటాయించగా, మరో స్థానానికి వేం నరేందర్‌రెడ్డిని ఎంపిక చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. పార్టీ అధిష్ఠానంతో చర్చలు జరిపి తన మిత్రుడికి అవకాశం కల్పించడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు చెప్పుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి మరియు వేం నరేందర్‌రెడ్డి మధ్య స్నేహం ప్రారంభమైన కాలం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. 2004లో వేం నరేందర్‌రెడ్డి తెలుగు దేశం పార్టీ తరఫున మహబూబాబాద్‌ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2007లో రేవంత్‌రెడ్డి శాసన మండలిలో సభ్యుడిగా రాజకీయ జీవితంలో కొత్త దశను ప్రారంభించారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది క్రమంగా గాఢమైన స్నేహంగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ రాజకీయంగా ఒకే దారిలో ముందుకు సాగుతూ పరస్పరం సహకరిస్తూ వచ్చారు. 2015లో శాసనసభ సభ్యుల కోటాలో వేం నరేందర్‌రెడ్డిని శాసన మండలికి పంపేందుకు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా ఆయన జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఆ ఘటన ఇద్దరి మధ్య స్నేహాన్ని దెబ్బతీయలేదు. విరుద్ధంగా, ఆ అనుభవం వారి బంధాన్ని మరింత బలపరిచింది. రాజకీయ ఒత్తిడులు, వ్యక్తిగత కష్టాలు ఎదురైనప్పటికీ ఇద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టకుండా ముందుకు సాగారు. తరువాతి దశలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరగా, వేం నరేందర్‌రెడ్డి కూడా ఆయనతో పాటు అదే దారిని ఎంచుకున్నారు. ఆ తరువాత కూడా ఇద్దరి రాజకీయ ప్రయాణం కలిసి కొనసాగింది. పార్టీ నిర్మాణంలోనూ, రాజకీయ వ్యూహాల్లోనూ వేం నరేందర్‌రెడ్డి రేవంత్‌రెడ్డికి దగ్గరగా ఉండి సహకరించారు. 2023లో జరిగిన ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డిని ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించారు. ప్రస్తుతం పెద్దల సభకు పంపే నిర్ణయం కూడా ఆ స్నేహానికి మరో ఉదాహరణగా నిలిచింది. పోటీ లేకపోవడంతో వేం నరేందర్‌రెడ్డి ఎన్నిక దాదాపు ఏకగ్రీవంగా జరగనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సన్నిహిత మిత్రుడు కేవీపీ రామచంద్రరావును మొదట సలహాదారుగా నియమించి, తరువాత రాజ్యసభకు పంపిన సంఘటనను ఇప్పుడు చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. అయితే అక్కడ నాలుగేళ్ల తరువాత ఆ అవకాశం కల్పించగా, ఇక్కడ మాత్రం రెండు సంవత్సరాల వ్యవధిలోనే రేవంత్‌రెడ్డి తన మిత్రుడిని పెద్దల సభకు పంపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక కావడంతో వేం నరేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపగా, అది వెంటనే ఆమోదించబడింది. అయితే పెద్దల సభకు వెళ్లిన తరువాత కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో కేవీపీ రామచంద్రరావు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో పలు బాధ్యతలను నిర్వహించిన సందర్భం ఉంది. ఆ సమయంలో ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేసి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా ఇప్పుడు కూడా వేం నరేందర్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలక అంశాల్లో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇప్పటి వరకు సలహాదారుగా వేతనభత్యాలతో పనిచేసిన ఆయన ఇకపై అలాంటి వేతనభత్యాలు లేకుండానే సేవలందించే అవకాశముందని తెలుస్తోంది. రాజకీయాల్లో స్నేహం చాలా అరుదుగా కనిపించే అంశంగా భావించబడుతున్న సమయంలో రేవంత్‌రెడ్డి మరియు వేం నరేందర్‌రెడ్డి మధ్య ఉన్న ఈ బంధం మరోసారి చర్చకు రావడం విశేషంగా మారింది. ALSO READ: Sairat: ఊహకందని సీన్లు, మైండ్ బ్లాక్ చేసే ఎండింగ్.. ఈ సినిమా అస్సలు మిస్ కాకండి మావా
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
24 రోజుల క్రితం
Logo

Bhatti Vikramarka: ప్రపంచ దేశాలతో పోటి పడే విధంగా తెలంగాణ ఎదగాలి

Bhatti Vikramarka: ప్రపంచ దేశాలతో అన్ని రంగాల్లో పోటీ పడే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే విద్య, వైద్యం, ఉపాధి రంగాలే పునాదులని పేర్కొన్నారు. అందుకే ఈ మూడు రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.22 వేల 500...

Bhatti Vikramarka: ప్రపంచ దేశాలతో అన్ని రంగాల్లో పోటీ పడే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే విద్య, వైద్యం, ఉపాధి రంగాలే పునాదులని పేర్కొన్నారు. అందుకే ఈ మూడు రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.22 వేల 500 కోట్లతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో, రూ.200 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో ఒక్కో పాఠశాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇవి కేవలం పాఠశాలలే కాకుండా, భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసే విద్యాకేంద్రాలుగా నిలవనున్నాయని పేర్కొన్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం కూడా అందించాలనే ఆలోచన ఉందని, ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి ప్రాధాన్యం పెరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు. డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచామని చెప్పారు. అలాగే ప్రతి నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో అత్యాధునిక వసతులతో వైద్యశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉంటేనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళలందరినీ మహాలక్ష్ములుగా గౌరవిస్తూ అర్హులైన ప్రతి మహిళకు నాణ్యమైన ఇందిరమ్మ చీరలు అందించామని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.27 వేల కోట్ల వడ్డీరహిత రుణాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మంత్రులు దృఢమైన నిర్ణయం తీసుకున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. గతేడాది ఇదే పాఠశాల 150వ వార్షికోత్సవ ప్రారంభోత్సవానికి సీఎం హాజరై రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయడంతో ప్రస్తుతం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. పాఠశాలలో హైదరాబాద్ స్టేట్ మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పేరుతో మెమోరియల్ ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకుముందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జవహర్‌లాల్ నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు తీసుకువచ్చిన పంచవర్ష ప్రణాళికల వల్లే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. విద్యతోనే వ్యక్తి, కుటుంబం, సమాజం ఎదుగుతుందని పేర్కొన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. మొగిలిగిద్ద పాఠశాల చరిత్రాత్మక విద్యాలయమని, గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పాఠశాల అభివృద్ధికి, గ్రామ రహదారుల నిర్మాణానికి భారీ నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అకస్మాత్తుగా మొగిలిగిద్ద కస్తూర్భా గాంధీ బాలికల వసతిగృహాన్ని సందర్శించారు. విద్యార్థినీలతో కలిసి భోజనం చేసి, వారికి అందుతున్న వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినీల లక్ష్యాలు, భవిష్యత్ ఆశయాలపై మంత్రులు మాట్లాడి ప్రోత్సహించారు. వసతిగృహంలోని బోధన, బోధనేతర అంశాలపై సిబ్బందిని ప్రశ్నించి పలు సూచనలు చేశారు. ALSO READ: మంత్రితో డ్యాన్స్ చేసింది నేనే: శాంతి స్వరూప్
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
25 రోజుల క్రితం
Logo

History: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక ‘మేడారం’

History: తెలంగాణ గిరిజన చరిత్రలో, ప్రజా పోరాటాల వారసత్వంలో సమ్మక్క- సారలమ్మలు కేవలం దేవతలుగా మాత్రమే కాదు.. అణచివేతకు వ్యతిరేకంగా ఆయుధం ఎత్తిన వీరోచిత వనితలుగా నిలిచిపోయారు. కాకతీయుల సైన్యాన్ని గడగడలాడించిన ధైర్యవంతులైన ఈ తల్లి- కుమార్తె కథే నేటికీ మేడారం మహాజాతర రూపంలో జీవంతంగా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందిన ఈ జాతర, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దట్టమైన అడవులు, కొండకోనల మధ్య ఉన్న మేడారం గ్రామంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క- సారలమ్మ జాతరకు దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా భక్తులు...

History: తెలంగాణ గిరిజన చరిత్రలో, ప్రజా పోరాటాల వారసత్వంలో సమ్మక్క- సారలమ్మలు కేవలం దేవతలుగా మాత్రమే కాదు.. అణచివేతకు వ్యతిరేకంగా ఆయుధం ఎత్తిన వీరోచిత వనితలుగా నిలిచిపోయారు. కాకతీయుల సైన్యాన్ని గడగడలాడించిన ధైర్యవంతులైన ఈ తల్లి- కుమార్తె కథే నేటికీ మేడారం మహాజాతర రూపంలో జీవంతంగా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందిన ఈ జాతర, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దట్టమైన అడవులు, కొండకోనల మధ్య ఉన్న మేడారం గ్రామంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క- సారలమ్మ జాతరకు దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. కుంభమేళా తర్వాత భారతదేశంలో అత్యధిక జనసందోహం ఏర్పడే పండుగగా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. సమ్మక్క కథ గిరిజన జీవన విధానానికి, పోరాట చరిత్రకు అద్దం పడుతుంది. జగిత్యాల ప్రాంతంలోని పోలవాసను పాలించిన గిరిజన దొర మేడరాజు వేటకు వెళ్లిన సమయంలో ఒక పుట్టపై కేరింతలు కొడుతూ కనిపించిన బాలికనే సమ్మక్కగా పెంచుకున్నాడు. ఆమె చేతి ఆకు పసరుతో వ్యాధులు నయమవుతాయన్న నమ్మకం ప్రజల్లో విస్తరించింది. ఆమెను మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేయగా, ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే సంతానం జన్మించారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు పోలవాసపై దండెత్తడంతో పరిస్థితులు మారాయి. కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేకపోయిన పగిడిద్దరాజు, మేడరాజుకు ఆశ్రయం కల్పించడంతో గిరిజనులపై తిరుగుబాటు ముద్ర వేసి కాకతీయులు మేడారంపై దాడి చేశారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున యుగంధరుడి నేతృత్వంలో వచ్చిన కాకతీయ సేనలకు ఎదురుగా నిలబడి సమ్మక్క, సారలమ్మ, జంపన్న, గోవిందరాజులు గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించారు. సాంప్రదాయ ఆయుధాలతో సుశిక్షితమైన కాకతీయ సేనలను ఎదుర్కొంటూ వీరోచితంగా పోరాడిన గిరిజన యోధులు చివరికి యుద్ధంలో వీరమరణం పొందారు. పరాజయ వార్తతో జంపన్న సంపెంగ వాగులో దూకి ప్రాణాలు తీసుకోగా, ఆ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. సమ్మక్క మాత్రం యుద్ధభూమిలో చివరి వరకు పోరాడుతూ, రక్తధారలతో చిలుకల గుట్ట వైపు వెళ్లి మార్గమధ్యంలో అదృశ్యమైంది. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు పసుపు కుంకుమలతో ఉన్న భరణి మాత్రమే లభించింది. అదే సమ్మక్క స్వరూపంగా భావించి, అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మహాజాతర నిర్వహిస్తున్నారు. జాతరలో మొదట కన్నెపల్లి నుంచి సారలమ్మ రాక, ఆపై చిలుకల గుట్ట నుంచి భరణి రూపంలో సమ్మక్క గద్దెపైకి రావడం, చివరికి వనప్రవేశంతో జాతర ముగియడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ జాతరలో మరో విశేషం వంశపారంపర్యంగా గిరిజనులే పూజార్లుగా వ్యవహరించడం. భక్తులు అమ్మవార్లకు బంగారం రూపంలో బెల్లం సమర్పిస్తూ తమ కోరికలు వేడుకుంటారు. సమ్మక్క- సారలమ్మలను కేవలం దేవతలుగా మాత్రమే కాకుండా, కోయ గిరిజనుల హక్కుల కోసం రాజ్యాధికారాన్ని ఎదిరించిన విప్లవ వీర వనితలుగా గుర్తించాల్సిన అవసరం ఉందన్న భావన ఈ జాతర ద్వారా తరతరాలకు చేరుతోంది. వ్యాసకర్త: ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పసుల వినయ్ కుమార్ ALSO READ: Mahesh Kumar Goud: ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం సిట్‌కు ఉంది
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
26 రోజుల క్రితం
Logo

Harish Rao's comments: తెలంగాణలో కొత్త స్కామ్ ఆరోపణలు

కాంగ్రెస్‌పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు లాటరీ విధానం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్న మద్యం ప్రభుత్వమా? రైతు ప్రభుత్వమా?: హరీశ్ రావు ప్రశ్న Harish Rao's comments: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఓ భారీ స్కామ్ జరుగుతోందని ఆరోపిస్తూ అబ్కారీ శాఖ కేంద్రంగా అవినీతి దందా సాగుతోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యనేతలు, మంత్రుల కోటాల పేరిట మైక్రో బెవరేజెస్ అనుమతుల విషయంలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని హరీశ్ రావు మీడియా చిట్ చాట్‌లో...

కాంగ్రెస్‌పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు లాటరీ విధానం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్న మద్యం ప్రభుత్వమా? రైతు ప్రభుత్వమా?: హరీశ్ రావు ప్రశ్న Harish Rao's comments: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఓ భారీ స్కామ్ జరుగుతోందని ఆరోపిస్తూ అబ్కారీ శాఖ కేంద్రంగా అవినీతి దందా సాగుతోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యనేతలు, మంత్రుల కోటాల పేరిట మైక్రో బెవరేజెస్ అనుమతుల విషయంలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని హరీశ్ రావు మీడియా చిట్ చాట్‌లో ఆరోపణలు గుప్పించారు. ఈ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఎక్సైజ్ శాఖలో మైక్రో బెవరేజెస్ అనుమతుల కోసం మొత్తం 110 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం చెబుతోందని హరీశ్ రావు తెలిపారు. అయితే తొలిదశలో 25 అనుమతులు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారని అన్నారు. ఈ 25 అనుమతుల్లో మంత్రి కోటా కింద 4, మరో కీలక నేత కోటా కింద 21 మైక్రో బెవరేజెస్‌ను ముందుగానే ఎంపిక చేసుకున్నారని ఆరోపించారు. ఇది పూర్తిగా పారదర్శకతకు విరుద్ధమని, ప్రజలను మభ్యపెట్టే చర్యగా ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో ఒక ముఖ్యనేతకు తోడుగా, నీడలా తిరుగుతున్న వ్యక్తి ఇంట్లోనే ఉంటున్నాడని, ఈ విషయమై ఇప్పటికే వార్తలు కూడా వచ్చినట్టు హరీశ్ రావు పేర్కొన్నారు. కార్లు నేరుగా ఆ ముఖ్యనేత ఇంట్లోకి వెళ్లడం, తిరుపతి పర్యటనలో కూడా ఆ వ్యక్తి వెంటే ఉండటం వంటి ఉదాహరణలు చూపుతూ, వెనుక తెరల లావాదేవీలకు ఇవి నిదర్శనాలని ఆరోపించారు. ఈ వ్యవహారం అంతా ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఒక్కో బ్రేవరీకి రూ.1.80 కోట్లుగా ధర నిర్ణయించారని, అందులో రూ.1.50 కోట్లు ముఖ్యనేతకు, మిగిలిన రూ.30 లక్షలు తోడు నీడగా ఉన్న వ్యక్తికి వెళ్తున్నాయని హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం 21 బ్రేవరీలను ఒక వర్గం ఫైనల్ చేసుకుంటే, మరో 4 బ్రేవరీలను మంత్రి కోటాలో ఖరారు చేశారని అన్నారు. ఇది స్పష్టమైన అవినీతి వ్యవహారమని, రాష్ట్ర ప్రజలు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు. మైక్రో బెవరేజెస్‌కు సంబంధించి లాటరీ విధానం ఎందుకు అమలు చేయలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. వైన్స్ షాపులకు లాటరీ తీసినప్పుడు, 110 దరఖాస్తులు వచ్చిన ఈ అనుమతులకు ఎందుకు లాటరీ తీయలేదని నిలదీశారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా లిక్కర్ సరఫరా సంస్థలకు రూ.4500 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, వాటిలో కొన్ని 16 నెలలుగా చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15 రోజుల్లోనే చెల్లింపులు జరిగేవని గుర్తు చేసిన హరీశ్ రావు.. ప్రస్తుతం బకాయిల కారణంగా సరఫరా నిలిచిపోయి అనేక వైన్ షాపుల్లో మద్యం అందుబాటులో లేకుండా పోతోందని అన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలు కూడా సరఫరా నిలిపివేస్తామని లేఖలు రాసిన పరిస్థితి ఉందని చెప్పారు. వాటాల పంపకాల్లో తేడాలే ఈ సంక్షోభానికి కారణమని ఆయన విమర్శించారు. ఇప్పటికే హాలోగ్రామ్ టెండర్ల విషయంలో కూడా ముఖ్యనేతల బంధువులకే లాభం చేకూరేలా వ్యవహరించారని ఆరోపించిన హరీశ్ రావు, బీర్ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా సింగూరు డ్యాం మరమ్మతుల పేరిట రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించి వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం లేదని, అదే జిల్లాలోని బీర్ కంపెనీలకు మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా నీరు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఇది మద్యం తయారీదారుల ప్రభుత్వమా? లేక రైతుల ప్రభుత్వమా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. అబ్కారీ శాఖ స్పెషల్ సీఎస్ స్వయంగా సంగారెడ్డి వెళ్లి నీటిపారుదల అధికారులతో సమావేశమై రైతులకు నీరు ఆపి బీర్ కంపెనీలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారన్న ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ALSO READ: Telangana: పార్టీలకు ఈసీ బిగ్ షాక్
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Politics News
Reporter
STAR TRINETHRAM
26 రోజుల క్రితం
Logo

తెలంగాణ విపత్తు నిర్వహణపై ప్రభుత్వ దృష్టి

దేశానికి ఆదర్శంగా వ్యవస్థ తీర్చిదిద్దుతామన్న మంత్రి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రణాళిక మండల స్థాయి వరకు వాతావరణ కేంద్రాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్టార్ త్రినేతం, హైదరాబాద్: తెలంగాణలో విపత్తు నిర్వహణ వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. విపత్తులు సంభవించినప్పుడు స్పందించడమే కాకుండా, ముందే వాటిని అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టే స్థాయికి వ్యవస్థను తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ దిశగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని...

దేశానికి ఆదర్శంగా వ్యవస్థ తీర్చిదిద్దుతామన్న మంత్రి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రణాళిక మండల స్థాయి వరకు వాతావరణ కేంద్రాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్టార్ త్రినేతం, హైదరాబాద్: తెలంగాణలో విపత్తు నిర్వహణ వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. విపత్తులు సంభవించినప్పుడు స్పందించడమే కాకుండా, ముందే వాటిని అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టే స్థాయికి వ్యవస్థను తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ దిశగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సచివాలయంలో ఫైర్ సర్వీసెస్, SDRF, హైడ్రా విపత్తు నిర్వహణ విభాగాల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కీలక సూచనలు చేశారు. విపత్తు నిర్వహణలో భాగంగా అత్యంత ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి, సమయానికి ప్రాణరక్షణ చర్యలు చేపట్టేలా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు. విపత్తుల తీవ్రతను తగ్గించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. విపత్తు నిర్వహణ సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా, సమర్థంగా పనిచేసేలా సిబ్బందిని సిద్ధం చేయడమే ఈ శిక్షణ కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు. శిక్షణతో పాటు ఆధునిక పరికరాల వినియోగంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ మార్పులను క్షుణ్ణంగా గమనించేందుకు మండల స్థాయి వరకు అత్యాధునిక వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీనివల్ల వర్షాలు, వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి వీలవుతుందన్నారు. ప్రజలకు సమయానికి సమాచారం అందితే నష్టం తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పారు. విపత్తుల సమయంలో సహాయక చర్యలు మరింత వేగంగా చేపట్టేందుకు భారీ బరువులు మోయగల డ్రోన్లు, హైస్పీడ్ బోట్లు కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వరదలు, ముంపు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితిని అంచనా వేసి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఎత్తయిన భవనాల్లో అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆధునిక పరికరాలను త్వరలోనే సమకూరుస్తామని చెప్పారు. ఫైర్ సర్వీసెస్, SDRF, హైడ్రా విభాగాలు విడివిడిగా కాకుండా ఒకే గొడుగు కింద సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. సమన్వయ లోపాల వల్ల సహాయక చర్యలు ఆలస్యం కాకుండా, అన్ని విభాగాలు ఒకే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ పరిధిలో విపత్తుల నియంత్రణ కోసం హైడ్రా బృందాలను ఇప్పటికే 30 నుంచి 70కి పెంచామని, సిబ్బంది సంఖ్యను కూడా గణనీయంగా పెంచుతున్నామని తెలిపారు. ప్రజలకు తక్షణ సహాయం అందించేలా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఏ ప్రాంతంలో విపత్తు సంభవించినా ప్రజలు ఒక్క కాల్‌తో సమాచారం అందించేలా వ్యవస్థ ఉండాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే విషయంలో తెలంగాణను దేశంలోనే ఉత్తమ రోల్ మోడల్‌గా నిలపడం ప్రభుత్వ సంకల్పమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ALSO READ: Medaram: మహాజాతరకు సర్వం సిద్ధం
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
27 రోజుల క్రితం
Logo

Mahesh Kumar Goud: తెలంగాణలో బీజేపీకి అధికారం అసాధ్యం

టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ఢిల్లీ పర్యటనలో చిట్‌చాట్ కర్ణాటక, తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒకటే బీజేపీతో పాటు బీఆర్ఎస్ పని ఖతం అయినట్లే! నైనీ కోల్ బ్లాక్ అంశం మీడియా సృష్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై టీపీసీసీ చీఫ్ ధీమా Mahesh Kumar Goud: తెలంగాణలో ఎన్ని రాజకీయ పోరాటాలు చేసినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....

టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ఢిల్లీ పర్యటనలో చిట్‌చాట్ కర్ణాటక, తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒకటే బీజేపీతో పాటు బీఆర్ఎస్ పని ఖతం అయినట్లే! నైనీ కోల్ బ్లాక్ అంశం మీడియా సృష్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై టీపీసీసీ చీఫ్ ధీమా Mahesh Kumar Goud: తెలంగాణలో ఎన్ని రాజకీయ పోరాటాలు చేసినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోనూ, తెలంగాణలోనూ బీజేపీ పరిస్థితి ఒకటేనని, ప్రజలు ఇప్పటికే ఆ పార్టీని తిరస్కరించారని అన్నారు. బీజేపీతో పాటు బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు కూడా ముగింపు దశకు చేరిందని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని బలంగా నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేసే పనిలో ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం రెండు డీసీసీ అధ్యక్షుల ఎంపికతో పాటు మహిళా అధ్యక్షురాలి నియామకం ఇంకా పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. సోషల్ మీడియా రాజకీయాలపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ సోషల్ మీడియాను పట్టుకుని రాజకీయంగా పాకులాడుతున్నారని వ్యాఖ్యానించారు. వాస్తవ సమస్యలపై పోరాటం చేయకుండా వర్చువల్ రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలపై స్పందించిన టీపీసీసీ చీఫ్.. నిజామాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభావం పూర్తిగా కనుమరుగైందన్నారు. అక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల్లో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం నెలకొందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయ భవిష్యత్తుపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. కవిత సొంత పార్టీ ఏర్పాటు చేసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని తెలిపారు. అయితే ఇవన్నీ రాజకీయ ఊహాగానాలేనని అన్నారు. నైనీ కోల్ బ్లాక్ అంశాన్ని పూర్తిగా మీడియా సృష్టిగా మహేశ్ కుమార్ గౌడ్ కొట్టిపారేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్‌లోని కేసీ వేణుగోపాల్‌తో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. కావాలని కొందరు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీనే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే తథ్యమని టీపీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలే తమ రాజకీయ అజెండా అని, అదే బలంగా ప్రజల ముందుకు వెళ్లనున్నామని ఆయన అన్నారు. ALSO READ: WPL: ముంబైకి మూడో విజయం.. వరుస ఓటములతో ఆర్సీబీ ఆందోళన
స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Andhra Pradesh News
Reporter
STAR TRINETHRAM
28 రోజుల క్రితం
Logo

ఏపీ-తెలంగాణ మధ్య జల వివాదం.. గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదం మరోసారి రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ప్రతిపాదిస్తున్న బనకచర్ల, పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, ఈ వివాదం సుప్రీంకోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తమ ప్రాజెక్టుల ద్వారా సముద్రంలో కలిసే నీటినే వినియోగిస్తామని, తెలంగాణకు చెందిన ఒక్క చుక్క నీటినీ ఉపయోగించబోమని స్పష్టం చేస్తోంది. ఈ పరిస్థితుల నడుమ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమరావతిలో నిర్వహించిన తొలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదం మరోసారి రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ప్రతిపాదిస్తున్న బనకచర్ల, పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, ఈ వివాదం సుప్రీంకోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తమ ప్రాజెక్టుల ద్వారా సముద్రంలో కలిసే నీటినే వినియోగిస్తామని, తెలంగాణకు చెందిన ఒక్క చుక్క నీటినీ ఉపయోగించబోమని స్పష్టం చేస్తోంది.

ఈ పరిస్థితుల నడుమ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమరావతిలో నిర్వహించిన తొలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర అభివృద్ధి, జల వనరుల వినియోగం, సంక్షేమ కార్యక్రమాలపై కీలక అంశాలను ప్రస్తావించారు. నల్లమలసాగర్ ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానాన్ని చేపడతామని, పొరుగు రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సముద్రంలో కలిసే జలాలనే మళ్లిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు.

జల వివాదం నేపథ్యంలో గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కాకుండా, పరిపాలనా స్థాయిలో సమస్యను పరిష్కరించే ప్రయత్నంగా భావిస్తున్నారు. రాష్ట్రాల మధ్య సఖ్యతకు భంగం కలగకుండా, రాజ్యాంగ పరిమితుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించినట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదే సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. ఉగాది పండుగ నాటికి మరో ఐదు లక్షల కుటుంబాలకు ఇళ్లను అందించనున్నట్లు వెల్లడించారు. పేదలకు సొంత ఇల్లు అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇది సామాజిక భద్రతకు కీలక అడుగుగా పేర్కొన్నారు.

గత ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాజెక్టును మధ్యలో నిలిపివేసిందని, రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని గవర్నర్ విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రాజధాని అభివృద్ధితో పాటు, రవాణా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. రహదారులు, మౌలిక వసతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర ఆర్థిక ప్రగతి వేగంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

జల వనరుల వినియోగం విషయంలో రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన, నమ్మకం అవసరమని గవర్నర్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. నల్లమలసాగర్ వంటి ప్రాజెక్టులు కేవలం ఒక రాష్ట్ర ప్రయోజనాలకే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలని ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ మధ్య జల వివాదంపై కేంద్రం, న్యాయస్థానాల సూచనల మేరకు శాంతియుత పరిష్కారం దిశగా అడుగులు పడతాయా అన్నది వేచి చూడాల్సిన అంశంగా మారింది.

స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి
Telangana News
Reporter
STAR TRINETHRAM
28 రోజుల క్రితం
Logo

Governor Jishnu Dev Verma: దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ

Governor Jishnu Dev Verma: దేశవ్యాప్తంగా అభివృద్ధికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన సోమవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. “రైజింగ్ తెలంగాణ-2047” అనే దృష్టితో రాష్ట్రం భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోందని గవర్నర్ స్పష్టం చేశారు. దేశం 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో,...

Governor Jishnu Dev Verma: దేశవ్యాప్తంగా అభివృద్ధికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన సోమవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. “రైజింగ్ తెలంగాణ-2047” అనే దృష్టితో రాష్ట్రం భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోందని గవర్నర్ స్పష్టం చేశారు.

దేశం 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో, అందులో తెలంగాణ తన వంతుగా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోందని గవర్నర్ వెల్లడించారు. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్రాన్ని మూడు ప్రధాన అభివృద్ధి మండలాలుగా విభజించి సమతుల్య పాలన అందిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇస్తూ క్యూర్, ప్యూర్, రేర్ వ్యూహాలతో ప్రజలకు మెరుగైన పాలన అందుతోందని కొనియాడారు.

రైతు సంక్షేమాన్ని ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం రాష్ట్ర వ్యవసాయ రంగం సాధించిన ఘనతగా పేర్కొన్నారు. రైతుల ఆర్థిక భారం తగ్గించేందుకు తీసుకున్న రుణమాఫీ నిర్ణయం లక్షలాది కుటుంబాలకు ఊరటనిచ్చిందని తెలిపారు. రూ. 20,617 కోట్ల రుణమాఫీ ద్వారా 26 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరిందన్నారు. సన్నధాన్యం సాగు చేసే రైతులకు క్వింటాలుకు రూ. 500 బోనస్ అందించడం ప్రభుత్వ రైతు అనుకూల విధానాలకు నిదర్శనమని చెప్పారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని తీసుకురావడం మరో కీలక అడుగుగా పేర్కొన్నారు.

మహిళల సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గవర్నర్ వివరించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలతో పేద మహిళలకు అండగా నిలుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమాలు మహిళల దైనందిన జీవితంలో గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

యువతకు ఉపాధి కల్పనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని గవర్నర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 62,749 ఉద్యోగాల భర్తీ పూర్తవడం రాష్ట్రంలో ఉపాధి అవకాశాల విస్తరణకు నిదర్శనమని అన్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఇది తెలంగాణ యువతను గ్లోబల్ స్థాయిలో పోటీ పడేలా తయారు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నగరం రూపురేఖలు వేగంగా మారుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ, మూసీ నది పునరుజ్జీవనం, మెట్రో రెండో దశ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో భాగ్యనగరం అంతర్జాతీయ నగరంగా ఎదుగుతోందని అన్నారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడడం ద్వారా నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ విభాగం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ కొనియాడారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025లో తెలంగాణ పోలీస్ విభాగం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం రాష్ట్రంలో మెరుగైన పాలనకు నిదర్శనమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులు తమ బాధ్యతలను కూడా నిబద్ధతతో నిర్వర్తించాలన్న సందేశంతో గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన వ్యాఖ్యానించారు.

స్వైప్ చేయండి పూర్తి వార్త చదవండి »
SPONSORED AD 📍 🇮🇳 All India Ad
మీ వ్యాపార ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించండి - Local & All-India Ads
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి

ప్రధాన కేటగిరీలు (Categories)

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు (26)

తెలంగాణ జిల్లాలు (33)