HomeTOURS & TRAVELSIndia Best Road Trip:అద్భుతమైన రోడ్‌ ట్రిప్‌..మైమరిపించే బీచ్‌లు, జలపాతాలు మరియు ఆలయాల దర్శనం..అస్సలు మిస్సవ్వొద్దు!

India Best Road Trip:అద్భుతమైన రోడ్‌ ట్రిప్‌..మైమరిపించే బీచ్‌లు, జలపాతాలు మరియు ఆలయాల దర్శనం..అస్సలు మిస్సవ్వొద్దు!

📰 Generate e-Paper Clip

భారత దేశం ఎన్నో వైవిధ్యాలకు నిలయం. ముఖ్యంగా ప్రశాంతమైన బీచ్‌లు, పచ్చని జలపాతాలు ,పురాతన దేవాలయాలు ఇలా ప్రకృతి రమణీయతను ఆస్వాదించే అద్భుత టూరిజం భారత్ సొంతం. ముఖ్యంగా ముంబై, గోవా వంటి రద్దీగా ఉండే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు భిన్నంగా మహారాష్ట్రలోని గణపతిపులే, సింధుదుర్గ్ వంటి స్థానిక అద్భుతాలను అన్వేషించడం ఒక మధురానుభూతి.

ఇంతటి చక్కటి మధురానుభూతిని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లోని హిల్ స్టేషన్లకు వెళ్లాల్సిందే. రోడ్డు మార్గంలో సాగే ఈ మొదటి మజిలీలో చూడదగ్గ ప్రాంతం గణపతిపులే. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న గణపతిపులే ఒక ప్రశాంతమైన తీరప్రాంత పట్టణం. ఇది గణపతి దేవాలయం , బీచ్‌లకు ప్రసిద్ధి.

అలాగే లాటరైట్ రాతి పలకలపై చెక్కబడిన అలనాటి చరిత్రను సజీవంగా అందించే చిత్రాలు, అంతరించిపోయిన జంతువులు, మానవ ఆకారాలు ఇలా ప్రతి ఒక్కటి ఆకట్టుకుంటాయి. అరేబియా సముద్రానికి ఆనుకుని ఉన్న ప్రసిద్ధ ‘ఆరే-వారే’ తీరప్రాంత రహదారి గుండా ప్రయాణం ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. తర్వాత సింధుదుర్గ్ వెళ్లే దారిలో ఫన్సావ్లే అనే గ్రామంలో దట్టమైన చెట్లు, జీడిమామిడి తోటల మధ్య ఉన్న ఒక అందమైన వంతెన..ఆ వంతెన దాటగానే ఉండే పురాతన ఆలయం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.

ఇక సింధుదుర్గ్‌ టూర్‌లో భాగంగా ‘కోకో శంబాలా’లో ఉన్న బీచ్‌, ఆ బీచ్‌కు ఆనుకుని ఉన్న విల్లాలు కొబ్బరి కలపతో పర్యావరణ హితంగా నిర్మించబడగా టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ కొంకణ్ ప్రాంత సంస్కృతి, కళలు, ప్రకృతిని దగ్గరగా చూసి ఎంజాయ్‌ చేయవచ్చు. ఇక్కడి బీచ్‌లో స్కూబా డైవింగ్ మరియు డాల్ఫిన్‌లతో ఈత కొట్టడం వంటి అనేక అనుభవాలను పొందవచ్చు.

17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మాల్వన్ తీరంలోని ఒక ద్వీపంలో నిర్మించిన సింధుదుర్గ్ సముద్రపు కోట ఇక్కడి ప్రధాన ఆకర్షణ. దేశంలోని ఇతర టూరిజం ప్రాంతాలతో పోలిస్తే మహారాష్ట్రలోని ఈ రెండు టూరిజం ప్రాంతాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే ప్రతి ఏటా పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంకెందుకు ఆలస్యం సొంత వాహనంలో ప్రకృతిని దగ్గరగా చూస్తూ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ టూరిజం ప్లేస్.

RELATED ARTICLES

Most Popular