BJP:భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు..
హైదరాబాద్లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ చేపట్టిన ‘లోక్తంత్ర బచావో – అరాజకతా హటావో’ మహాపాదయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్కు చేరుకున్న అమిత్ షాకు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు అమిత్ షా. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజల అనంతరం అమిత్ షా బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత బషీర్బాగ్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజంజాహి మార్కెట్...